• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Chiru Odela: చిరు – ఓదెల మూవీ స్టోరీ ఇదేనా .. డైరెక్టర్‌కు ఫ్యాన్స్‌ కండీషన్స్

    మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) కొత్త ప్రాజెక్ట్‌ ఖరారైంది. తొలి చిత్రం ‘దసరా’తో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) ఈ సినిమా (Chiru Odela) ను డైరెక్ట్‌ చేయనున్నారు. యంగ్‌ హీరో నాని ఈ చిత్రాన్ని సమర్పించనున్నట్లు మూవీ యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్‌ చేసిన ప్రీ లుక్‌ పోస్టర్‌లో నెత్తురోడుతున్న చిరు చేతిని చూపించారు. దీంతో ఈ సినిమా చాలా వైలెంట్‌గా ఉండబోతుందని మేకర్స్‌ చెప్పకనే చెప్పారు. కమ్‌ బ్యాక్‌ తర్వాత చిరంజీవి నటించనున్న మోస్ట్‌ వైలెంట్ చిత్రం కావడంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే అంచనాలు మెుదలయ్యాయి. స్టోరీని కూడా ముందే ప్రిడిక్ట్‌ చేసేస్తున్నారు. ఈ మూవీ ఏ స్థాయిలో ఉండాలో ముందుగానే ఫ్యాన్స్‌ సలహాలు ఇస్తున్నారు. 

    చిరు – ఓదెల స్టోరీ ఇదే!

    మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల చిత్రాని (Chiru Odela)కి సంబంధించిన ప్రీలుక్‌ పోస్టులో ఆసక్తికర లైన్‌ను చిత్ర బృందం రాసుకొచ్చింది. ‘అతడు హింసలో తన శాంతిని వెతుక్కుంటున్నాడు’ అని ఆసక్తికర క్యాప్షన్‌ పెట్టింది. దీన్ని బట్టి చూస్తే ఇదో బిగ్‌ రివేంజ్‌ స్టోరీగా కనిపిస్తోంది. తనకు అన్యాయం చేసిన వారిపై మెగాస్టార్‌ చిరు కొదమసింహంలాగా ఈ సినిమాలో విరుచుకుపడతాడని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. తన ఫ్యామిలీ లేదా సమూహం లేదా ప్రజలకు జరిగిన దారుణాలను చూసి కన్నెర్ర చేసిన ఓ సామాన్యుడు ఎలాంటి హింసాత్మక దారిని ఎంచుకున్నాడు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రావొచ్చని నెటిజన్లతో పాటు ఫిల్మ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

    ఫ్యాన్స్‌ ఏమంటున్నారంటే

    మెగాస్టార్‌ చిరంజీవి కమ్‌ బ్యాక్‌ తర్వాత అతడి స్థాయికి తగ్గ సక్సెస్‌ రాలేదు. ‘ఖైదీ నంబర్‌ 150’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఇండస్ట్రీ హిట్‌గా నిలవలేదు. ఈ నేపథ్యంలో చిరు-ఓదెల ప్రాజెక్ట్‌ ఊరమాస్‌ వైలెన్స్‌తో రానుండటంతో ఒక్కసారిగా మెగా ఆడియన్స్‌ దృష్టి దీనిపై పడింది. చిరు కెరీర్‌లో బిగ్గెస్ట్ మాస్‌ చిత్రాలుగా నిలిచిన ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘ముఠామేస్త్రీ’, ‘ఇంద్ర’ సరసన ఈ ప్రాజెక్ట్‌ నిలబడాలని కోరుకుంటున్నారు. చిరు బిగ్‌బాస్‌ చిత్రంలోని రగ్‌డ్‌ లుక్‌ షేర్ చేస్తూ ఆ విధంగా మెగాస్టార్‌ను మేకోవర్‌ చేయాలని రిక్వెస్ట్‌ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో వింటేజ్ చిరును మళ్లీ తీసుకురావాలని ఓదెలాకు విజ్ఞప్తి  చేస్తున్నారు. ‘దుమ్ము లేచిపోవాలి అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్స్‌, డ్యాన్స్‌, కామెడీ పక్కన పెట్టి కంటెంట్‌పై దృష్టి సారించాలని కోరుతున్నారు. తమ నమ్మకాన్ని నిలబెట్టి బెస్ట్‌ మూవీ ఇవ్వాలని సూచిస్తున్నారు. 

    చిరంజీవి స్ఫూర్తితో..

    మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ బిగ్ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. ఈ జనరేషన్‌ హీరోలు, డైరెక్టర్లు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు ఆయనే స్ఫూర్తి. ఈ విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది కూడా. చిరు తాజా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్న యంగ్‌ హీరో నాని కూడా చిరుకి బిగ్‌ ఫ్యాన్‌. చిరు స్ఫూర్తితోనే తాను పెరిగానని, ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిల్చున్నానని ప్రీ లుక్‌ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ నాని పేర్కొన్నాడు. అటువంటి చిరంజీవి చిత్రాన్ని సమర్పిస్తున్నందుకు తన జీవితం పరిపూర్ణమైందని చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. ఇది వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలోనే ‘ది ప్యారడైజ్‌’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

    2025 సమ్మర్‌ బరిలో..

    ప్రస్తుతం చిరంజీవి – వశిష్ట కాంబోలో ‘విశ్వంభర’ (Viswambhara) రూపొందుతోంది. ఈ చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్‌ చరణ్‌ (Ram Charan) నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్‌ ఛేంజర్‌ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్‌ అయింది. 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv