బాలీవుడ్ నటి అర్చిత అగర్వాల్ (Arrchita Agarwaal) షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె లీడ్ యాక్ట్రెస్‌గా చేసిన ‘దెస్‌పాచ్’ (Despatch) చిత్రం ఇటీవల జీ 5 (Zee 5) ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో మనోజ్ బాజ్‌పాయి (Manoj Bajpayee) హీరోగా చేశారు. ఈ మూవీ సక్సెస్ నేపథ్యంలో బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన అర్చిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తన లైఫ్‌కు సంబంధించిన పలు విషయాలు పంచుకుంది.
అర్చిత ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏళ్లు అయినప్పటికీ రీసెంట్‌గా వచ్చిన ‘దెస్‌పాచ్’ (Despatch) చిత్రంతోనే ఆమె నటిగా తెరంగేట్రం చేసింది. తొలి ఫిల్మ్‌తోనే నటిగా మంచి మార్కులు సంపాదించింది.
నటి కాకముందు కాస్ట్యూమ్ అసిస్టెంట్‌గా తాను వర్క్ చేసినట్లు తాజా ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. ‘బంగిస్తాన్’ (2015), ‘పికు’ (2015), ‘రాయిస్’ (2016) తదితర చిత్రాలకు పని చేసినట్లు స్పష్టం చేసింది.
కాస్ట్యూమ్ వర్క్‌లో సంతృప్తి లేకపోవడంతో నటన వైపునకు అర్చిత వచ్చింది. ఇందుకోసం అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్‌లో జాయిన్ అయ్యింది. అక్కడ నటనకు సంబంధించిన ఎన్నో వర్క్ షాప్స్‌లో పాల్గొంది.
‘దెస్‌పాచ్’కు ముందు 2020లోనే అర్చిత (Arrchita Agarwaal)కు సినిమా ఆఫర్ వచ్చింది. అయితే ఎలాంటి కారణం లేకుండా తనను రిజెక్ట్ చేసినట్లు అర్చిత తెలిపింది. అది జరిగిన నాలుగేళ్లకు సినమా ఆఫర్ దక్కించుకున్నట్లు నటి తెలిపింది.
‘డెస్‌పాచ్’లో శృంగార సన్నివేశాల్లో నటించడంపైనా అర్చిత మాట్లాడింది. తనకు అసౌకర్యమైన రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్‌లో తాను చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అయితే ఆడియన్స్ వాటిని తప్పుగా తీసుకోలేదని చెప్పుకొచ్చింది.
వాస్తవానికి స్కూల్ డేస్ నుంచే నటి కావాలన్న కోరిక అర్చితకు ఉండేది. అయితే తాను పెద్దగా అందంగా లేనని ఆమె అనుకునేది. కానీ ఇండస్ట్రీలోనే సెటిల్ అవ్వాలన్న కోరిక ఉండటంతో తొలుత కాస్ట్యూమ్ అసిస్టెంట్‌గా సినిమాలకు వర్క్ చేసింది.
అర్చిత అగర్వాల్ తండ్రి ఒక బిజినెస్ మ్యాన్. ఆమె ఎదుగుతున్న క్రమంలో ఆయన ఎన్నో ఆర్థిక నష్టాలను చూశాడు. అయినప్పటికీ ప్రయత్నం ఆపలేదని అర్చిత తెలిపింది. అతనే తనకు ప్రేరణ అని తెలిపింది.
నటి అవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు మీ చుట్టు పక్కల వారు ఎలా రియాక్ట్ అయ్యారు? అన్న ప్రశ్నకు అర్చిత ఆసక్తికర సమాధానం చెప్పింది.
తాను నటి అవ్వాలని అనుకుంటున్నట్లు చిన్నప్పుడే చెప్పి ఉంటే ‘నువ్వు అనుష్క శర్మ లేదా ప్రియాంక చోప్రాలాగా లేవు’ అనే పోలికలు తన చెవిన పడేవని పేర్కొంది.
తాను ఆ విషయం కాలేజీ డేస్ వరకూ దాచానని చెప్పింది. ఆ తర్వాత ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోగా ‘నీకేమైనా పిచ్చా’ అన్నట్లు చూశారని చెప్పింది.
నటి కావాలని కోరుకుంటున్నట్లు బంధువులకు తెలియగానే ‘బట్టలు అలా వేసుకోవాలి.. ఇలా వేసుకోవాలి.. ముంబయి ఆ విధంగా జీవించాలి’ అంటూ తీర్పులు చెప్పడం మెుదలుపెట్టారని అర్చిత తెలిపింది.
అయితే ఒకటి మాత్రం నిజమని ఇండస్ట్రీలోకి రావాలంటే ‘థిక్ స్కిన్’ అవసరమని.. అది తనకు ఉందని’ అర్చిత తెలిపింది.
‘దెస్‌పాచ్’ తర్వాత ప్రస్తుతం ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదని అర్చిత స్పష్టం చేసింది. అయితే చాలా మంది దర్శకులతో మాట్లాడానని, తిరిగి సంప్రదిస్తామని చెప్పారని పేర్కొంది.
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి