వరల్డ్ మోస్ట్ వాంటెడ్ యానిమేషన్ చిత్రం ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) మరో రెండ్రోజుల్లో వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు అదిరిపోయాయన్న కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో పిల్లలతో సహా ఈ యానిమేటెడ్ చిత్రాన్ని చూసేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమాకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సినిమా చూసేముందుకు వాటి గురించి తప్పక తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే అసలైన మజాను ఎంజాయ్ చేయగలుగుతారు. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
‘ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) చిత్రాలకు హాలీవుడ్ సహా ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తొలుత దీనిని ‘ది లయన్ గార్డ్’ పేరుతో టీవీ సిరీస్‌గా రూపొందించింది.
అప్పటికే బాగా పాపులర్ అయిన ‘ది లయన్ గార్డ్’ కామిక్ బుక్‌లోని కథలను తీసుకొని కార్టూన్స్ రూపంలో ఈ టెలివిజన్ సిరీస్‌ను డిస్నీ నిర్మించడం గమనార్హం.
టెలివిజన్‌లో ‘ది లయన్ గార్డ్’ (The Lion Guard) సిరీస్‌కు విశేష ఆదరణ లభించడంతో దానిని ‘ది లయన్ కింగ్’ పేరుతో 1994లో కార్టూన్ యానిమేషన్ చిత్రంగా డిస్నీ తీసుకొచ్చింది. అప్పట్లో ఆ మూవీకి మంచి ఆదరణ లభించింది.
ఆ తర్వాత 2016లో ‘ది లయన్ కింగ్’ (1994)కు రీమేక్‌గా అత్యాధునిక గ్రాఫిక్స్ హంగులతో కొత్త చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు డిస్నీ ప్రకటించింది. అందుకు అనుగుణంగా 2019లో అదే పేరుతో ‘ది లయన్ కింగ్’ చిత్రాన్ని రిలీజ్ చేసింది.
‘ది లయన్ కింగ్’ (2019) వరల్డ్ వైడ్‌గా విశేష స్పందన వచ్చింది. $250 – 260 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా $1.657 బిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.
ఇప్పుడు ది లయన్ కింగ్‌కు సీక్వెల్‌గా ముఫాసా: ది లయన్ కింగ్ చిత్రం వస్తుండటంతో సహజంగానే అందరిలోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
‘ది లయన్ కింగ్’ (2019), ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (2024) చిత్రాల్లో యానిమేటెడ్ జంతువులే తెరపైకి కనిపించినప్పటికీ వాటి వెనక ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్ వర్క్ చేశారు.
అరోన్ పీరే (ముఫాసా), డొనాల్డ్ గ్లోవర్ (సింబా), బియాన్స్ (నాలా), బ్లూ ఇవి కార్టర్ (కియారా), జాన్ కాని, (రఫీకీ), టిఫాని బూనే (సరాబి) వంటి స్టార్స్ అందులోని పాత్రలకు తమ గాత్రాన్ని అందించారు.
ముఫాసా స్టోరీ విషయానికి వస్తే.. ముఫాసా (సింహం) ఓ అనాథ. చిన్నప్పుడు తనను రక్షించడంతో టాకా (సింహం) బ్రదర్‌గా దత్తత తీసుకుంటాడు. పెద్దయ్యాక వారు చేసిన సాహసాలు ఏంటి? ప్రైడ్ ల్యాండ్‌లోని తెల్ల సింహాల నుంచి వాటికి ఎధురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) చిత్రాన్ని బారీ జెంకిన్స్ డైరెక్ట్ చేశాడు. ఈ యానిమేషన్ చిత్రం నిర్మాణానికి దాదాపు 200 మిలియన్ డాలర్లు ఖర్చు అయ్యింది. భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.1700 కోట్లు ఖర్చు అయ్యింది. 118 నిమిషాల నిడివితో ఈ సినిమా రాబోతోంది.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ భారత్‌లోనూ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. హిందీలో వెర్షన్‌లో బాలీవుడ్ బాద్ షా ఫ్యామిలీ భాగస్వామ్యం అయ్యింది. షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు.
2019లో విడుదలైన ‘ది లయన్ కింగ్’ మూవీలో ముఫాసా పాత్రకు షారుఖ్ ఖాన్ వాయిస్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కుమారులు కూడా గాత్ర దానం చేయడంతో హిందీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ముఫాసా తెలుగు వెర్షన్ ఈసారి మరింత హైలేట్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘ముఫాసా’ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. దీంతో మహేష్ అభిమానులు ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలో స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ కూడా డబ్బింగ్ చెప్పారు. పుంబా పాత్రకు బ్రహ్మీ డబ్బింగ్ చెప్పగా, టిమోన్ రోల్‌కు అలీ గాత్ర దానం చేశారు.
2019లో వచ్చిన ‘ది లయన్ కింగ్’ చిత్రంలోనూ అలీ, బ్రహ్మీ డబ్బింగ్ చెప్పారు. దానికి సీక్వెల్‌గా వస్తోన్న ముఫాసాలోనూ పుంబా, టిమోన్ పాత్రలకు వారు డబ్బింగ్ చెప్పడం విశేషం.
తమిళ వెర్షన్‌కు సైతం పలువురు స్టార్స్ డబ్బింగ్ చెప్పారు. అర్జున్ దాస్ (ముఫాసా), అశోక్ సెల్వన్ (టాకా), నాజర్ (కిరోస్), వీటీవీ గణేష్ (యంగ్ రఫీకీ), సింగం పులి (టిమన్) డబ్బింగ్ చెప్పారు.
హైదరాబాద్‌లో ‘ముఫాసా’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 2D, 3D వెర్షన్స్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్రస్తుతానికి ఐదు స్క్రీన్స్‌లో మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి