• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 500 Plus Matches: క్రికెట్‌లో ఐదు వందలకు పైగా మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఎవరో తెలుసా?

    ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు.. టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీకి అంతర్జాతీయంగా 500వ మ్యాచ్‌. క్రికెట్‌ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన పదో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడి కంటే ముందు ఏ ఆటగాళ్లు ఉన్నారు? వారు ఎన్ని టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడారు? ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌ ఎవరు? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 1. సచిన్‌ టెండూల్కర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin … Read more

    గోల్డ్ మెడలే లక్ష్యం: రుతురాజ్

    ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి పోడియం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించడమే తన లక్ష్యమని రుతురాజ్ గైక్వాడ్ వెల్లడించాడు. భారత్ క్రికెట్ జట్టుకు రుతురాజ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఈ క్రీడలకు జట్టు చైనా వెళ్లనుంది. ఈ మేరకు కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు క్రీడలు జరగనున్నాయి. మరోవైపు, సెప్టెంబర్ 28 నుంచే వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కూడా ఇందులో ఉన్నాడు. … Read more

    మైదానంలో తెల్లముఖం పెట్టిన ఇషాన్‌!

    వెస్టిండీస్‌తో తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత వికెట్‌ కీపర్ ఇషాన్‌ కిషన్‌ చేసిన పని నెట్టింట వైరల్‌గా మారింది. జడేజా వేసిన 31ఓవర్‌ ఆఖరి బంతిని ఆడే క్రమంలో వెస్టిండీస్‌ బ్యాటర్‌ హోల్డర్‌ మిస్‌ అయ్యాడు. బంతిని అందుకున్న ఇషాన్‌.. హోల్డర్‌ క్రీజు దాటే వరకూ ఎదురు చూశాడు. లైన్‌ దాటగానే బెయిల్స్‌ కొట్టి స్టంపౌట్‌కు అప్పీల్ చేశాడు. కానీ అంపైర్‌ ఓవర్‌ డెడ్ అయిందని ప్రకటించడంతో కిషన్‌ తెల్లముఖం వేశాడు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వీడియోను ట్రెండ్‌ చేస్తున్నారు. … Read more

    81వ బంతికి ఫోర్ బాదిన విరాట్

    వెస్టిండీస్‌తో తొలి టెస్టుపై భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ముగిసే సమయానికి విరాట్, యశస్వి క్రీజులో నిలిచారు. 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ తన ఇన్నింగ్సులో ఒకే ఒక బౌండరీ బాదాడు. అది కూడా 81వ బంతికి ఫోర్ కొట్టడం గమనార్హం. 80 బంతులాడిన కోహ్లీ బౌండరీ కోసం ఆత్రుతతో ఎదురు చూశాడు. చివరికి వారికన్ బౌలింగులో డీప్ కవర్ దిశగా బౌండరీ కొట్టి సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. Calling it a night! That … Read more

    పవన్‌వి తప్పుడు వ్యాఖ్యలు: అంబటి రాయుడు

    వలంటీర్లను సంఘ విద్రోహ శక్తులని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం తప్పని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ‘‘ఏపీలో వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోంది. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద జల్లుతారు. అలాంటివారిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు ధైర్యంగా ముందుకెళ్లాలి. ప్రతి మనిషికీ ఏది అందాలో అది వలంటీర్ల ద్వారా అందుతోంది. కరోనా సమయంలో ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలందించారు.’’ అంటూ రాయుడు చెప్పుకొచ్చారు. Volunteer System is brilliant, They are delivering to the last … Read more

    వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్: గుండు కొట్టించుకున్న తెలుగు క్రికెటర్

    క్వాలిఫయర్స్‌లో సంచలన ప్రదర్శన చేసి వన్డే వరల్డ్‌కప్‌కు నెదర్లాండ్స్ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ జట్టు క్వాలిఫై కావడానికి తెలుగు కుర్రాడు తేజ నిడమానూరు పాత్ర కూడా ఉంది. నెదర్లాండ్స్‌కు ఆడుతున్న తేజ.. నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ అర్హత సాధిస్తే గుండు కొట్టించుకుంటానని వాగ్దానం చేశాడు. దీనిని సహచరులు రికార్డు కూడా చేశారు. అన్నట్లే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాజాగా తన తలనీలాలు సమర్పించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. Teja Nidamanuru is a man of his word. … Read more

    ధోని మంచి మనసు.. వీడియో వైరల్

    భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. తన విల్లాలో పనిచేసే సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు. గార్డు డ్యూటీకి వస్తుండగా ధోని అతడ్ని చూశాడు. విల్లా చాలా దూరం ఉండటంతో గార్డును బైక్‌ ఎక్కించుకొని గేటు వద్ద వదిలిపెట్టాడు. సెక్యూరిటీ గార్డును దించాక మహీ వారికి హలో కూడా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మహీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. Dhoni dropping his security in gate??❤️@MSDhoni #MSDhoni … Read more

    లబుషేనా.. ఏంటీ నువ్ చేసిన పని!

    ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆశ్చర్యకర దృష్యాలు చోటు చేసుకుంటున్నాయి. రెండో టెస్టు తొలి రోజున నిరసనకారులను బెయిర్‌స్టో అమాంతం ఎత్తుకెళ్లిన ఘటనను మరవకముందే మరో దృష్యం చోటు చేసుకుంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ సమయంలో జట్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ వికారం పుట్టించే పనిచేశాడు. నోటి నుంచి భూమిపై ఊడిపడ్డ చూయింగ్ గమ్‌ని తిరిగి తీసుకుని నోట్లో వేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Marnus dropping his gum on the pitch and then … Read more

    చకచకా నడుస్తోన్న పంత్: వీడియో వైరల్

    టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఎవరి సాయం లేకుండా చకచకా నడుస్తున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండా తానే నడుస్తున్నాడు. తాజాగా పంత్ మెట్లు ఎక్కుతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. కాగా గతేడాది డిసెంబర్‌లో పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పంత్ మోకాలుకి గాయం కావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ప్రస్తుతం పంత్ బెంగళూరులోని NCAలో పునరావాసం పొందుతున్నాడు. Not bad yaar Rishabh ❤️❤️?. Simple things can be difficult sometimes … Read more

    ప్యాడ్లతోనే విమానమెక్కిన ముంబై క్రికెటర్

    ముంబై ఇండియన్స్ క్రికెటర్ నేహాల్ వధేరాకు ఆ జట్టు యాజమాన్యం వినూత్న శిక్ష విధించింది. జట్టు సమావేశానికి వధేరా ఆలస్యంగా రావడంతో ప్యాడ్లు కట్టుకుని విమానమెక్కాలని ఆదేశించింది. ఇలా ఎవరైనా ఆలస్యంగా వస్తే ముంబై ఇలాంటి శిక్షే వేస్తుంది. దీంతో వధేరా ప్యాడ్లు కట్టుకునే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. సాధారణ జంప్‌షూట్‌కు బదులు ప్యాడ్లతో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. #MumbaiIndians youngster #NehalWadhera turned all heads at Mumbai airport with his punishment #OOTD. … Read more