ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు.. టీమ్‌ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి అంతర్జాతీయంగా 500వ మ్యాచ్. క్రికెట్ చరిత్రలో 500 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన పదో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడి కంటే ముందు ఏ ఆటగాళ్లు ఉన్నారు? వారు ఎన్ని టెస్టులు, వన్డేలు, టీ20లు ఆడారు? ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ ఎవరు? వంటి అంశాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
1. సచిన్ టెండూల్కర్
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకూ ఆయన 664 మ్యాచ్‌లు ఆడాడు. అందులో ఒక టీ20 సహా 200 టెస్టులు, 463 వన్డేలు ఉన్నాయి.
2. మహేల జయవర్థనే
శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే (Mahela Jayawardene) ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. అతడు శ్రీలంక తరపున 652 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు. 55 టీ20లు, 149 టెస్టులు, 448 వన్డేలు ఆడాడు. శ్రీలంక మేటి క్రికెటర్ల లిస్ట్‌లో జయవర్థనే కచ్చితంగా ఉంటాడు.
3. కుమార సంగక్కర
ప్రపంచంలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగక్కర (Kumara Sangakkara) నిలిచాడు. 594 మ్యాచ్‌లు ఆడిన సంగక్కర.. శ్రీలంక కెప్టెన్‌గా ఎన్నో విజయాలను అందించాడు. అతడు మెుత్తం 134 టెస్టులు, 404 వన్డేలు, 56 టీ-20లు ఆడాడు.
4. సనత్ జయసూర్య
శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య (Sanath Jayasuriya) 586 మ్యాచ్‌లతో ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఇందులో 110 టెస్టులు, 445 వన్డేలు, 31 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి.
5. రికీ పాంటింగ్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) 560 మ్యాచ్‌లతో తర్వాతి (5వ) స్థానంలో ఉన్నాడు. అతడు ఆసీస్ తరపున మెుత్తం 168 టెస్టులు, 375 వన్డేలు, 17 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు.
6. ఎం.ఎస్ ధోని
టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్ ధోని (MS Dhoni).. సచిన్ తర్వాత అత్యధిక మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్‌గా ఉన్నాడు. 538 మ్యాచ్‌లతో అంతర్జాతీయంగా ఆరో స్థానంలో నిలిచాడు. ఇందులో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఉన్నాయి.
7. షాహిద్ అఫ్రిది
పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) కూడా భారీగానే మ్యాచ్‌లు ఆడాడు. 524 మ్యాచుల్లో పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు. కెరీర్‌లో 27 టెస్టులు మాత్రమే ఆడిన అఫ్రిది.. 398 వన్డేలు, 99 టీ20లు ఆడటం విశేషం.
8. జాక్వెస్ కలిస్
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు జాక్వెస్ కలిస్ (Jacques Kallis) తన కెరీర్‌లో 519 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 166 టెస్టులు, 328 వన్డేలు, 25 T20 మ్యాచ్‌లు ఉన్నాయి.
9. రాహుల్ ద్రవిడ్
టీమ్ ఇండియా తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఉన్నాడు. అతడు 509 మ్యాచ్‌లతో తాజా జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ద్రవిడ్.. భారత్ తరపున 164 టెస్టులు, 344 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు.
10. విరాట్ కోహ్లీ
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) విండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో 500 క్లబ్‌లో అడుగుపెట్టాడు. ఇందులో 111 టెస్టులు, 274 వన్డేలు, 115 టీ20లు ఉన్నాయి. తాజా జాబితాలోని టాప్-10 ఆటగాళ్లలో కోహ్లీ మినహా అందరూ రిటైర్ అయిన వాళ్లే.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!