కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) కొత్త తరహా చిత్రాలకు కేరాఫ్‌గా మారారు. ఆయన హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘A’, ‘ఉపేంద్ర’, ‘రా’, ‘ష్.’. చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా ఆ సినిమాల్లోని డైలాగ్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా ఉపేంద్ర చేసిన ‘యూఐ‘ (UI Movie) చిత్రం కూడా అదే ప్యాట్రన్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూత్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సినిమాలోనూ ఉపేంద్ర మార్క్ డైలాగ్స్ (UI Movie Dialogues In Telugu) ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
టైటిల్ కార్డ్స్ సమయంలో..
‘యూఐ’ సినిమా మెుదలవ్వగానే (UI Movie Dialogues In Telugu) అందులో మరో సినిమాను చూపించారు. దాని పేరు కూడా ‘యూఐ’నే. టైటిల్స్ కార్డ్స్ సమయంలో వచ్చే డిస్‌క్లైమర్ అందరినీ షాక్‌కు గురిచేస్తుంది.
‘మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే.. వెంటనే థియేటర్ నుంచి బయటకు వెళ్లండి’
‘మీరు ఫూల్ అయితేనే.. సినిమా మెుత్తం చూడండి’
‘తెలివైన వాళ్లు సినిమా చూసి ఫూల్స్ అవుతారు.. ఫూల్స్ తెలివైనవారిగా మారిపోతారు’
సెన్సార్ సభ్యుడి డైలాగ్
‘యూఐ’ చూసిన ఆడియన్స్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ మూవీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు సైతం మెుదలవుతాయి. అసలు ఈ సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది ఎవరని ఉన్నతాధికారి ప్రశ్నిస్తాడు. అప్పుడు సెన్సార్ సభ్యుడు ఇచ్చే వివరణ ఆసక్తికరంగా ఉంటుంది.
‘సార్.. ఈ సినిమా సెన్సార్ అయ్యి చాలా డేస్ అయ్యింది. మన టీమ్ వారు 25 టైమ్స్ చూశారు’
‘మేము అడల్ట్ సినిమాకు A సర్టిఫికేట్, ఫ్యామిలీ అయితే U, వైలెన్స్ ఉంటే U/A ఇస్తాం సార్’
‘కానీ ఈ సినిమాకు UI ఇచ్చాం సార్. అంటే యూనివర్శల్ ఇంటిలిజెంట్ సర్టిఫికెట్’
ఉపేంద్ర ఇంట్రడక్షన్ సీన్..
సత్య (ఉపేంద్ర) ఇంట్రడక్షన్ సీన్‌లో రౌడీలు అతడ్ని కొడుతుంటారు. ఓ వ్యక్తి చేసిన తప్పుకు వారి చేతుల్లో తన్నులు తిని వెళ్లిపోతాడు. అప్పుడు స్థానికుల నుంచి ఓ వ్యక్తి చెప్పే డైలాగ్ ఇప్పటి హీరోలకు సెటైరికల్‌గా అనిపిస్తుంది.
‘నలుగురిని కొట్టి బిల్డప్ ఇచ్చే ఈ కాలంలో అదే నలుగురి కోసం కొట్టించుకునే దమ్ము, ధైర్యం ఉన్న అతడేరా (ఉపేంద్ర) నిజమైన హీరో’
మంచి, చెడుల ఉపేంద్ర మార్క్ డైలాగ్
ఇందులో కల్కి (UI Movie Dialogues In Telugu) అనే మరో క్రూరమైన పాత్రలో ఉపేంద్ర నటించాడు. మంచి విలువలతో జీవించే వారిని టార్గెట్ చేస్తూ చంపేస్తాడు. ఈ క్రమంలో మంచి తల్లిదండ్రులను చంపేస్తాడు. అనంతరం వారి బిడ్డతో చెప్పే డైలాగ్ థియేటర్లలో విజిల్స్ వేయించాయి.
‘ఒక్క విషయం గుర్తు పెట్టుకో.. మంచోడు అవ్వాలంటే రోజు చస్తూ బతకాలి’
‘నువ్వు నీలా బతకాలంటే చెడ్డోడివి అవ్వు.. నాలాగా. చెడ్డపనులు చేస్తూ సంతోషంగా ఉండు. జనం కూడా నీకు జేజేలు కొడతారు’
‘ఫ్యామిలీ హీరో అవ్వాలనీ ట్రై చేయకు.. కమర్షియల్ మాస్ హీరో అవ్వు’
వేశ్యలతో చెప్పే డైలాగ్
కల్కి (ఉపేంద్ర) ఓ వేశ్య ఇంటిపై దాడి చేసి అక్కడ ఉన్న పురుషులు అందర్నీ చంపేస్తాడు. అనంతరం అక్కడ వైశ్యలను తీసుకెళ్లి బందిస్తాడు. ఆ సమయంలో వేశ్యలతో చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది.
‘పండు కొరక్కముందు.. ఆడది పైట చాచకముందు.. విలువ ఎక్కువ.. గుర్తుపెట్టుకోండి’
మనిషి వ్యక్తిత్వంపై డైలాగ్
కల్కి, సత్య తొలిసారి ఎదురుపడినప్పుడు వారి మధ్య వచ్చే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉంటాయి. మనుషులు గొప్పవారని మంచి, చెడు గురించి ఆలోచిస్తారని.. పశువులు అలా కాదని మంచివాడైన సత్య అంటాడు. అప్పుడు కల్కి చెప్పే డైలాగ్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది.
‘జంతువులు ఆకలి వేస్తేనే తింటాయి.. సీజన్ వస్తేనే సెక్స్ చేస్తాయి’
‘మనిషి కడుపు నిండినా కూడా ఇంకా కావాలంటాడు. వాడి అత్యాశకు అంతే లేదు’
‘మనుషుల సెక్స్‌కు సీజన్స్ లేవు. అన్నీ సీజన్స్‌లో చేసుకుంటూనే ఉంటారు. అదీ చాలక అత్యాచారాలు, రేప్‌లు’
‘జంతు ప్రపంచంలో రేప్‌లు, హత్యలు, యాసిడ్ అటాక్స్, జాతులు, ధర్మాలు, మంచి, చెడు, చిన్న పెద్ద, పాలిటిక్స్ ఇవేమి ఉండవు’
జనాల సైకాలజీపై డైలాగ్..
ప్రజల మనస్తత్వం గురించి కల్కి (ఉపేంద్ర) ఓ సీన్‌లో సాయి కుమార్ సోదరుడు రవి శంకర్‌తో చెబుతాడు. ఆ డైలాగ్ ఏంటో ఓ లుక్కేయండి.
‘జనాల సైకాలజీ ఏంటో తెలుసా? కడుపుకి వారం రోజులు ఫుడ్ లేకపోయినా కామ్‌గా పడుంటారు.
‘అదే బ్రెయిన్‌కు ఫుడ్ లేకపోతే విలవిల లాడిపోతారు.. వాళ్ల బ్రెయిన్‌కు ఫుడ్ రెడీ చేశాను’ (అనంతరం రాసలీలల వీడియోను సోషల్ మీడియా వైరల్ చేస్తాడు)
దేవుడిపై చెప్పే డైలాగ్
దేవుడి లేని సమాజాన్ని (UI Movie Dialogues In Telugu) సత్య సృష్టిస్తాడు. అక్కడికి వెళ్లిన కల్కి దేవుడి గురించి చెప్పి ప్రశాంతంగా ఉన్న వారి మనుసులో చిచ్చుపెడతాడు. దీంతో అక్కడి ప్రజలు దేవుడ్ని చూపించాలని సత్యను నిలదీస్తారు. అప్పుడు వచ్చే డైలాగ్స్ ఆలోజింపచేసేలా ఉంటుంది.
‘దేవుడి నుండి మతం.. మతం నుంచి జాతి.. జాతి నుంచి పెద్ద, చిన్న.. ఆపై సంఘర్షణ.. ఇవన్నీ అవసరమా’
ప్రజల బాధ్యతపై వచ్చే డైలాగ్
‘జనం అచ్చం తేనేటీగలు లాగానే, డబ్బు అనే తేనే సంపాదించి గవర్నమెంట్ అనే రాణి ఈగ బ్యాంకులో దాస్తారు’
‘బ్యాంకులు మీకు 5%, 6% వడ్డీకి ఇస్తామని దానిని కార్పోరేట్ కంపెనీలకు వడ్డీకి ఇస్తే వాళ్లు దానిని విదేశాలకు ఎత్తుకు పోతారు’
దేశాన్ని పాలించడానికి మళ్లీ డబ్బు కావాలి.. అందుకోసం దానికి ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని మళ్లీ జనం దగ్గరే వసూలు చేస్తారు’
‘ఈ విషయాల నుంచి ప్రజల్ని మళ్లించడానికి వారే సృష్టించిన మీడియా వాళ్లు వేరే వేరే ఎమోషన్స్ ఉన్న కథల్ని డైలీ బేసిస్‌లో జనాలపై వదులుతూనే ఉంటారు’
సెలబ్రిటీల ప్రైవసీపై డైలాగ్..
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై (UI Movie Dialogues In Telugu) ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపడాన్ని తన దైన శైలిలో సెటైరికల్ డైలాగ్స్‌తో ‘కల్కి’ చెబుతాడు.
‘ప్రజల దగ్గర ఉన్న తేనేను తీసుకొని ఈ పెద్దోళ్లు వారి జీవితాలను చప్పగా మార్చేశారు’
‘వాళ్లకి తియ్యటి వార్తలు కావాలి. అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీల వార్తలను సొల్లు కారుస్తూ చూస్తారు’
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!