ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. కే.ఎల్ రాహుల్ (KL Rahul) తన కమ్‌బ్యాక్ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన సత్తా ఏంటో మరోమారు నిరూపించుకున్నాడు. దీనిపై అతడి భార్య అతియా శెట్టి ప్రశంసలు కురిపించింది.
అతియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌ను అభినందిస్తూ ఆసక్తిక పోస్టు పెట్టింది. ‘చీకటి కూడా రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ముగుస్తుంది. సూర్యుడు తప్పకుండా మళ్లీ ఉదయిస్తాడు. మీరే నాకు సర్వస్వం, నేను నిన్ను ఆరాధిస్తాను. హ్యష్‌టాగ్ వన్ (#1)’ అని ఆమె పోస్ట్ చేసింది.
అతియా పోస్టుపై కేఎల్ రాహుల్ స్పందించాడు. ‘ఐ లవ్ యూ’ అంటూ లవ్ ఎమోజీని పోస్టు చేశాడు. బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ పోస్టుపై తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. అనిల్ కపూర్, వాణి కపూర్ దీనిపై ప్రతిస్పందిస్తూ క్లాప్ ఎమోజీలతో రాహుల్‌ను అభినందించారు.
అతియా శెట్టి వాళ్ల నాన్న, ప్రముఖ బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సైతం లవ్ ఎమోజీతో కూతురు పోస్టుకు మద్దతు తెలిపాడు. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ సైతం ‘ఏయ్..’ అంటూ లవ్ ఎమోజీ పోస్టు చేశాడు. అలాగే మరో హీరో అయుష్మాన్ ఖురానా.. ‘వాట్ ఏ కమ్ బ్యాక్’ అంటూ రాహుల్‌ను ప్రశంసించాడు.
ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అతియా శెట్టి. టీంఇండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కొద్దిరోజులుగా డేటింగ్‌లో ఉండి ఈ ఏడాదిలోనే వివాహం చేసుకున్నారు. 2015లో రొమాంటిక్ యాక్షన్ చిత్రం ‘హీరో’ సినిమాతో అతియా శెట్టి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆమె చివరి సారిగా ‘మోతీచూర్ చక్నాచూర్’ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన నటించింది. ఫుట్‌బాల్ క్రీడాకారుడు అఫ్షాన్ ఆషిక్ బయోపిక్ ‘హోప్ సోలో’లో ఆమె ప్రధాన పాత్రలో నటించనుంది.
ఇక కేఎల్ రాహుల్ ప్రదర్శన విషయానికొస్తే నిన్నటి మ్యాచ్‌లో అతడు ఓ ఫీట్ సాధించాడు. విరాట్ కోహ్లీతో కలిసి ఆసియా కప్ చరిత్రలో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఏకంగా 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!