టీమిండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan)కు విడాకులు మంజూరు అయ్యాయి. ధావన్, అతడి మాజీ భార్య ఆయేషా ముఖర్జీ (Ayesha Mukherjee)కి ఢిల్లీ కోర్టు బుధవారం (సెప్టెంబర్ 5) విడాకులు మంజూరు చేసింది.
ఆయేషా ముఖర్జీ కారణంగా ధావన్ మానసిక వేదనకు గురయ్యాడని ఢిల్లీలోని పాటియాలా హౌస్ కాంప్లెక్స్‌లోని ఫ్యామిలీ కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు కోర్టు వారి విడాకులను ఆమోదించింది. ఇక తన కుమారుడిని కలవడానికి ధావన్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది.
గత రెండేళ్లుగా ఆయేషా ముఖర్జీకి శిఖర్ ధావన్ దూరంగా ఉంటున్నాడు. 2021లో విడాకుల గురించి ఆయేషా సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఈ క్రమంలో ఆయేషా తనను మానసికంగా హింసిస్తోందని ఢిల్లీ ఫ్యామిలీ కోర్టులో గబ్బర్ విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు.
ఈ కేసు నిన్న కోర్టులో విచారణకు వచ్చింది. దీంతో ధావన్ ఆరోపణలు వాస్తవమైనవని న్యాయమూర్తి హరీష్ కుమార్ అంగీకరించారు. కుమారుడితో విడిగా ఉండాలని ఆయేషా ఒత్తిడి చేయడంతో అతడు మానసిక వేదనకు గురయ్యాడని జడ్జి పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలో ధావన్ కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో 99 శాతం తన పేరిట రాయాలని ఆయేషా ముఖర్జీ ఒత్తిడి చేసిందన్న ఆరోపణను కూడా ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆయేషాను కోర్టు తప్పుబట్టింది.
అయితే ధావన్-ఆయేషాల కుమారుడు జొరావర్ (Zoravar) శాశ్వత కస్టడీపై కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ధావన్‌కు భారత్ లేదా ఆస్ట్రేలియాలో తన కుమారుడిని కలవడానికి కోర్టు అనుమతి ఇచ్చింది. వీడియో కాల్ ద్వారా కూడా తన కుమారుడితో మాట్లాడవచచ్చని తెలిపింది.
శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీల పెళ్లి విషయానికి వస్తే వారు 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి పదేళ్ల కుమారుడు జొరావర్ ఉన్నాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా ఫేస్ బుక్‌లో పరిచయం అయిన ఆయేషాకు మెుదట తానే ప్రపోస్ చేశానని ధావన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అయితే శిఖర్‌తో పరిచయం కాకముందే అయేషాకు పెళ్లి జరిగింది. ఆమెకు మెుదట భర్త కారణంగా ఇద్దరు ఆడ పిల్లలు (రియా, అలియహ్) జన్మించారు.
ఇక ధావన్ ప్రొఫెషనల్ లైఫ్‌కి వస్తే ప్రస్తుతం అతడు టీమిండియాలో స్థానం కోల్పోయాడు. అన్ని ఫార్మెట్లలోనూ ధావన్ చోటు కోల్పోయాడు. గబ్బర్.. భారత్ తరపున 167 వన్డేలు, 68 టీ20, 34 టెస్టులు ఆడాడు. ఐపీఎల్‌లోనూ 217 మ్యాచ్‌లలో బరిలోకి దిగాడు.
Celebrities Featured Articles Telugu Movies
HBD Thaman: థమన్ గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు ట్రోల్ చేయరు..!