• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Virat Kohli: ప్రపంచ రికార్డుకు 2 సెంచరీల దూరంలో కింగ్‌ కోహ్లీ.. క్రికెట్‌లో అత్యధిక శతకాలు బాదింది వీరే!

    ప్రపంచకప్‌ 2023లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ అదరగొట్టాడు. సెంచరీతో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేశాడు. గురువారం (అక్టోబర్‌ 19) జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ 97 బంతుల్లో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సెంచరీతో కోహ్లీ వన్డేల్లో తన 48వ శతకాన్ని నమోదు చేశాడు. సచిన్‌ పేరిట ఉన్న వన్డే శతకాల రికార్డు (49)కు కోహ్లీ మరింత చేరువయ్యాడు. ఇంకో రెండు సెంచరీలు చేస్తే విరాట్‌ వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ నేపథ్యంలో క్రికెట్‌లో టీ20, వన్డే, టెస్టు ఫార్మెట్లు కలిపి అత్యధిక సెంచరీలు బాదిన బ్యాటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

    1. సచిన్‌ టెండూల్కర్‌ 

    క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ (Sachin Tendulkar) క్రికెట్‌లో 100 సెంచరీలు బాది ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఆయన వన్డేల్లో 49 సెంచరీలు నమోదు చేశారు. అటు ఏకంగా 96 అర్ధశతకాలు సచిన్‌ ఖాతాలో ఉన్నాయి. 1998 ఏడాదిలో సచిన్‌ 9 శతకాలు చేయడం గమనార్హం.

    2. విరాట్‌ కోహ్లీ

    ప్రస్తుతం విరాట్‌ (Virat Kohli) 78 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న క్రికెటర్లలో కోహ్లీకి దారిదాపుల్లో ఎవరూ లేరు. కోహ్లీ కంటే ముందు జోయి రూట్‌ (Joe Root) 46 సెంచరీలు (అన్ని ఫార్మట్లు కలిపి)తో ఉన్నాడు. అయితే ఒక్క వన్డేల్లోనే కోహ్లీ 48 సెంచరీలు చేయడం విశేషం. సచిన్ 463 మ్యాచ్‌ల్లో 49 సెంచరీలు చేయగా.. కోహ్లీ మాత్రం కేవలం 285 మ్యాచుల్లోనే 48 శతకాలు బాదాడు. అయితే ఈ ప్రపంచకప్ టోర్నీలోనే ఆ రికార్డును బ్రేక్ చేయాలని కోహ్లీ చూస్తున్నాడు. 

    3. రికీ పాంటింగ్‌

    కోహ్లీ తర్వాతి స్థానమైన నెంబర్‌ 3 పొజిషన్‌లో ఆసీస్‌ దిగ్గజం రికీ పాంటింగ్‌ (Ricky Ponting) ఉన్నాడు. అతడు అన్ని ఫార్మట్లు కలిపి 71 సెంచరీలు బాదాడు. ఆస్ట్రేలియాకు విజయవంతమైన కెప్టెన్‌గాను పాంటింగ్‌ సేవలు అందించాడు. 

    4. కుమార సంగక్కర

    ఒకప్పటి శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ కుమార సంగక్కర (Kumar Sangakkara) 63 సెంచరీలతో తాజా జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆయన 2000-2015 సంవత్సరాల మధ్య తన క్రికెట్‌ కెరీర్‌ను కొనసాగించారు. కెప్టెన్‌గా శ్రీలంక విజయాల్లో సంగక్కర కీలక పాత్ర పోషించాడు. 

    5. జాక్వెస్‌ కలిస్‌ 

    దక్షిణాఫికా దిగ్గజ ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ (Jacques Kallis) అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇతడు తన కెరీర్‌లో 62 శతకాలు బాదాడు. బౌలర్‌గా వందల కొద్ది వికెట్లను పడగొట్టాడు. ప్రస్తుమున్న చాలా మంది ఆల్‌రౌండర్లకు కలిస్‌ ఎంతో ఆదర్శం.

    6. హషీం ఆమ్లా

    సౌతాఫ్రికా నుంచి మరో బ్యాటర్‌ సైతం అత్యధిక శతకాల జాబితాలో ఉన్నాడు. దిగ్గజ బ్యాటర్‌ హషీం ఆమ్లా (Hashim Amla).. 55 సెంచరీలతో ఆరో స్థానాన్ని దక్కించుకున్నాడు. 

    7. మహేల జయవర్థనే

    శ్రీలంక స్టార్‌ బ్యాటర్‌ మహేల జయవర్థనే (Mahela Jayawardene) 54 సెంచరీలతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడు టెస్టుల్లో 11,814, వన్డేల్లో 12,650, టీ20 ఫార్మెట్‌లో 1,493 పరుగులు చేశాడు. 

    8. బ్రెయిన్‌ లారా

    వెస్టిండీస్‌ నుంచి అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా బ్రెయిన్‌ లారా (Brian Lara) నిలిచాడు. ఆయన తన కెరీర్‌లో వన్డేలు, టెస్టులు కలిపి 53 సెంచరీలు చేశాడు. 1990–2007 మధ్య విస్టిండీస్‌ విశేష సేవలు అందించాడు. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 

    9. రాహుల్‌ ద్రవిడ్‌

    భారత్‌ నుంచి అత్యధిక శతకాలు బాదిన మూడో క్రికెటర్‌గా రాహుల్‌ ద్రవిడ్ (Rahul Dravid) ఉన్నాడు. ఓవరాల్‌ అతడు తన కెరీర్‌లో 48 సెంచరీలు బాదాడు. తద్వారా ప్రస్తుత జాబితాలో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్ వ్యవహరిస్తున్నాడు. 

    10. ఏబీ డివిలియర్స్‌

    ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన పదో ఆటగాడిగా సౌతాఫ్రికా బ్యాటర్‌ ఏబీ డివిలియర్స్‌ (AB de Villiers) ఉన్నాడు. 2004–2018 మధ్య అతడు 47 శతకాలు బాదాడు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv