• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • టీమిండియా చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్‌.. చెత్త రికార్డు తెలుసా?
  MS DHONI AI IMAGES: దశవతరాల్లో ధోనీని చూశారా.. నిజంగా థ్రిల్ అవుతారు!
  ICC Tourneys: వచ్చే 8 ఏళ్లలో 10 ఐసీసీ టోర్నీలు.. ఆతిథ్య దేశాలు ఇవే!
  Virat Kohli AI: విరాట్ దశావతారం.. ఎంతైనా కింగ్ కింగే..!
  See More

  ఒలింపిక్స్‌‌లో క్రికెట్

  అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్‌ను ఒలింపిక్స్‌లో చేర్చింది. వచ్చే ఏడాది (పారిస్‌) ఒలింపిక్స్‌లో కాకుండా.. లాస్‌ ఏంజెలెస్‌ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ జరగనుంది. క్రికెట్‌తో పాటు ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, బేస్‌బాల్‌, సాఫ్ట్‌బాల్‌ ఆటకు సైతం ఐఓసీ ఆమోద ముద్ర వేసింది. క్రికెట్‌ను చేర్చడం ద్వారా ఒలింపిక్స్ ఆదాయాన్ని రెట్టింపు చేయడంతో పాటు టోర్నీని మరింత విస్తృత పర్చవచ్చని ఐఓసీ భావింస్తోంది.

  2028 ఒలింపిక్ గేమ్స్‌లో క్రికెట్

  2028లో లాస్ ఏంజెల్స్‌లో నిర్వహించే ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్ సైతం ఉండనుంది. క్రికెట్‌తో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్ క్రీడలను సైతం చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ చరిత్రలో కేవలం 1900 సంవత్సరంలో ప్యారీస్‌లో జరిగిన క్రీడల్లో మాత్రమే క్రికెట్ ఉంది. మళ్లీ 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కానుంది. ఇటీవల జరిగిన ఏసియన్ గేమ్స్‌లో సైతం క్రికెట్‌ను చేర్చారు. ఒలింపిక్స్‌లో క్రికెట్ ఉంటే టీ20 ఫార్మాట్‌లో ఉండే అవకాశం ఉంది.

  నేడు తలపడనున్న టీమ్స్ ఇవే

  క్రికెట్ ప్రపంచ కప్‌- 2023లో భాగంగా నేడు ఉదయం 10:30 గంటలకు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సౌతాఫ్రికా, శ్రీలంక తలపడనున్నాయి. బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో జరగనుండగా, సౌతాఫ్రికా, శ్రీలంక మ్యాచ్ ఢిల్లీలో జరగనుంది.

  ఏది జరగాలని ఉందో అదే జరిగింది: సంజూ

  వన్డే వరల్డ్‌కప్‌-2023లో సంజూను శాంసన్ సెలక్టర్లు మొండిచేయి చూపిన విషయం తెలిసిందే. బీసీసీఐ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో అతడికి చోటివ్వలేదు. దీనిపై సంజూ స్పందిస్తూ. ‘‘ఏది జరగాలని ఉందో అదే జరిగింది. నేను మాత్రం ముందుకు సాగిపోవాలనే నిర్ణయించుకున్నాను’’ అంటూ సంజూ ట్వీట్ చేశారు. అతడు చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

  క్రికెట్‌ ప్రియులకు డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌

  క్రికెట్ ప్రియులకు ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను మొబైల్‌ యాప్‌లో ఫ్రీగా చూసేందుకు అవకాశం కల్పించింది. తాజాగా ఈ సంస్థ కొన్ని కొత్త ఫీచర్లను తీసుకువచ్చింది. దీని ద్వారా వర్టికల్‌ మోడ్‌లో (నిలువుగా; 9×14) క్రికెట్‌ను వీక్షించొచ్చు. ఒంటి చేత్తో క్రికెట్‌ ప్రసారాలను ఆనందించొచ్చు. ఈ మోడ్‌లో లైవ్‌ ఫీడ్‌ ట్యాబ్‌, స్కోర్‌ కార్డు ట్యాబ్‌ కూడా కనిపిస్తాయి. క్రికెట్ అభిమానులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు డస్నీ తెలిపింది.

  రోహిత్ ఫామ్‌లో ఉంటే కష్టమే: పాక్ వైస్ కెప్టెన్

  భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లో ఉంటే తట్టుకోవడం కష్టమే అని పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ అన్నారు. అలాగే బౌలర్లలో కుల్‌దీప్ మంచి ఫామ్‌లో ఉన్నాడని చెప్పారు. హైదరాబాద్ ఆతిథ్యం తమ జట్టుకు ఎంతో నచ్చిందన్నారు. తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. భారత జట్టు గెలుపుకు అత్యుత్తమైన బౌలింగ్ ప్రదర్శన దోహదపడే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే ఉప్పల్ మైదానంలో పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరగనుంది.

  వారెవ్వా.. ఇది కదా క్రీడా స్ఫూర్తి అంటే!

  బంగ్లాదేశ్-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన రెండో వన్డేలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 45.3 ఓవర్‌లో బంతి విడుదల చేయకముందే కివీస్‌ బ్యాటర్‌ ఇషా సోథి పరుగు కోసం యత్నించాడు. దీంతో బంగ్లా బౌలర్‌ హసన్‌ మహ్మద్‌ అతడిని రనౌట్‌ చేశాడు. దీంతో మైదానంలోని వారంతా షాకయ్యారు. థర్డ్‌ అంపైర్‌ సోథిని ఔట్‌గా ప్రకటించడంతో అతడు పెవిలియన్‌ వైపు సాగాడు. ఈ క్రమంలోనే బంగ్లా కెప్టెన్‌ లిట్టన్ దాస్‌తో బౌలర్‌ హసన్‌ చర్చించి తన అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో వెనక్కి వచ్చిన సోథి నేరుగా వెళ్లి … Read more

  హాట్‌స్టార్ బంపరాఫర్

  ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆసియా కప్, వన్డే వరల్డ్‌కప్‌లను ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. క్రికెట్ ప్రేమికులు తమ మొబైల్‌లో ఉచితంగా మ్యాచ్‌లు చూడవచ్చని తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. కాగా జియో సినిమా నుంచి హాట్‌స్టార్‌కు గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే జియో సినిమాలో క్రికెట్ మ్యాచ్‌లు ఫ్రీగా వీక్షిస్తున్న సంగతి తెలిసిందే. Promo by Hotstar for: Asia Cup and … Read more

  India Lost ICC Trophies: నాకౌట్స్‌లో టీమిండియా చెత్త రికార్డు.. పదేళ్లలో 8 ట్రోఫీలు ఫసక్..!

  2013 తర్వాత టీమిండియా ఏకంగా 8 ఐసీసీ ట్రోఫీలను నాకౌట్స్‌లో కోల్పోయింది. కొన్నింట్లో తుది వరకు వచ్చి ఓడిపోతే, మరికొన్నింట్లో మొదట్లోనే చేతులెత్తేసింది. 2014లో టీ20 వరల్డ్‌కప్‌‌లో మొదలైన పరాభవ ప్రస్థానం.. నిన్న మొన్నటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ వరకు కొనసాగింది. నాకౌట్స్‌లో పేలవ ఆట తీరుతో టీమిండియా అభిమానులకు నిరాశే మిగుల్చుతోంది. 2013 తర్వాత భారత్ ఇప్పటివరకు కోల్పోయిన ఐసీసీ ట్రోఫీలేంటో చూద్దాం. 2014 టీ20 వరల్డ్‌కప్.. గ్రూప్ దశలో ఓటమే ఎరుగకుండా నాకౌట్స్‌లోకి ప్రవేశించింది భారత్. సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాను మట్టికరిపించి … Read more

  ఇదేం ఫీల్డింగ్ రా బాబు: ఫీల్డర్ల అయోమయం!

  ఓ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో ఫీల్డర్లు అయోమయానికి గురై 1 పరుగుకు బదులు 3 రన్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. మన దేశంలోనే జరిగిన ఓ లోకల్ మ్యాచ్‌లో బ్యాటర్ డీప్ స్కేర్ లెగ్ వైపు బంతిని బాదాడు. ఫీల్డర్ చక్కగా బంతిని అందుకుని బౌలర్ వైపు విసిరాడు. బౌలర్ అయోమయంతో దానిని వదిలేశాడు. దీంతో బ్యాటర్లు 3 పరుగులు తీసి నాలుగో రన్‌కు పరుగెడుతుండగా ఓ బ్యాటర్‌ను రనౌట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. … Read more