• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Beautiful Cricketers Wives: ఇర్పాన్ పఠాన్ భార్యతో పాటు ఈ భారత క్రికెటర్ల భార్యలు ఎంత ఫేమస్సో తెలుసా?

  భారత మాజీ క్రికెటర్‌ ‘ఇర్ఫాన్ పఠాన్‌’ (Irfan pathan) పేరు నెట్టింట వైరల్‌ అవుతోంది. తాజాగా తన 8వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఇర్ఫాన్‌.. తొలిసారి తన భార్య ముఖాన్ని ప్రపంచానికి చూపించాడు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో ఇర్ఫాన్‌ (#IrfanPathan) పేరు వైరల్‌ అవుతోంది. ఇర్ఫాన్‌ భార్యను తొలిసారి చూసిన వారంతా ఫీదా అవుతున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే ఇర్ఫాన్‌ భార్య సఫా బేగ్ ఓ సెలబ్రిటీ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆమె లాగే టీమిండియాకు చెందిన పలువురు క్రికెటర్ల భార్యలు కూడా భర్తతో సమానంగా ఫేమ్‌ను కలిగి ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 

  సఫా బేగ్ w/o ఇర్ఫాన్ పఠాన్ 

  టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌.. 2016లో సఫా బేగ్‌ను పెళ్లి చేసుకున్నాడు ఆమె మోడల్‌ & జర్నలిస్టు. పలు ఫ్యాషన్‌ మ్యాగజైన్స్‌కు ఆమె ఆర్టికల్స్‌ రాశారు. అయితే ఇర్ఫాన్‌ జంట తాజాగా తమ 8వ ఏట వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తొలిసారి భార్య ఫొటోను ఇర్ఫాన్ రివీల్‌ చేశాడు. ఆమె తన ఫ్రెండ్‌, మూడ్‌ లిఫ్టర్‌, ట్రబుల్‌ మేకర్ అంటూ వ్యాఖ్యానించారు. 

  కేఎల్‌ రాహుల్‌ w/o అతియా శెట్టి

  బాలీవుడ్ నటి అతియా శెట్టిని.. స్టార్‌ క్రికెటర్‌ కేఎల్ రాహుల్‌ 2023 (Most Beautiful Cricketers Wives) వరల్డ్‌ కప్‌నకు ముందు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు కొంత డేట్‌ చేసిన ఈ జంట చివరకీ పెళ్లి బంధంతో ఒక్కటైంది. వీరి పెళ్లికి భారత క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు. 

  శార్దుల్‌ ఠాకూర్‌ w/o మిట్టాలి పరుల్కర్‌

  టీమిండియా ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌.. మహారాష్ట్రకు చెందిన తన ప్రేయసి మిట్టాలి పరుల్కర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రముఖ ఎంటర్‌ప్రెన్యూర్‌. 2020లో Jazz Luxury Bakes పేరుతో మిట్టాలి వ్యాపారాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం అది విజయవంతంగా సాగుతోంది. 

  హార్దిక్ w/o న‌టాషా స్టాంకోవిక్‌

  టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా గతేడాది వాలెంటైన్స్‌ డే రోజున భార్య న‌టాషా స్టాంకోవిక్‌ను మ‌ళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఉద‌య్‌పూర్‌లో వైభ‌వంగా వీళ్ల వివాహం జ‌రిగింది. నటాషా.. మోడల్‌ & సెర్బియన్‌ డ్యాన్సర్‌. సత్యాగ్రహ అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 

  రుతురాజ్‌ – ఉత్కర్ష 

  యంగ్‌ క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌.. గతేడాది ఉత్కర్ష పవార్‌ను (Most Beautiful Cricketers Wives) వివాహం చేసుకున్నాడు. ఆమె ఒక దేశవాళి క్రికెటర్‌. మహారాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుంటుంది. 

  సంజనా గణేషన్ w/o జస్ప్రిత్ బుమ్రా

  క్రీడా వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు సుపరిచితమైన వ్యక్తి ‘సంజనా గణేషన్’. మాటలతోనే కాకుండా, తన వ్యక్తిత్వంతో టీమిండియా పేసర్ బుమ్రాని బౌల్డ్ చేసింది. 2021లో వీరిద్దరికీ పెళ్లయింది. సంజనా గణేషన్‌కు ప్రత్యేకంగా అభిమానులున్నారు.

  యువరాజ్‌ w/o హజెల్‌ కీచ్‌

  యువరాజ్‌ భార్య హజెల్‌ కీచ్‌.. ఒక మోడల్‌. ఆమె పలు చిత్రాలు, టీవీ ప్రొగ్రామ్స్‌లో నటించారు. తన కష్టకాలంలో హజెల్‌ ఎంతో అండగా నిలిచిందని పలు సందర్బాల్లో యువరాజ్‌ చెప్పుకొచ్చాడు. 

  హర్భజన్‌ w/o గీతా బస్రా

  టీమిండియా మాజీ బౌలర్‌ హర్భజన్ భార్య గీతా బస్రా (Most Beautiful Cricketers Wives) కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఆమె పలు హిందీ చిత్రాల్లో నటించారు. 2006లో ‘దిల్‌ దియా హై’ చిత్రం ద్వారా ఆమె తెరంగేట్రం చేసింది. ఇందులో ఇమ్రాన్‌ హష్మీ హీరోగా చేశారు. 

  అనుష్క శర్మ w/o విరాట్ కోహ్లీ

  అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు ‘అనుష్క శర్మ’. ఈ బాలీవుడ్ నటికి ముందు నుంచే అశేష అభిమానులున్నారు. కోహ్లీని ప్రేమించి 2017లో పెళ్లిచేసుకుంది. విరుష్క జంటకు ముద్దుల కుమార్తె ఉంది. పెళ్లి తర్వాత అనుష్క శర్మ సినిమాలు చేయడం తగ్గించింది.

  స్టువర్ట్‌ బిన్ని vs మయంతి లంగర్‌

  భారత మాజీ క్రికెటర్‌ స్టువర్ట్‌ బిన్నీ.. ఫేమస్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ మయంతి లంగర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పలు ఐసీసీ ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరించారు. 2012లో వీరి వివాహం జరిగింది. 

  రోహిత్‌ w/o రితికా 

  టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ భార్య కూడా పెళ్లికి ముందు (Most Beautiful Cricketers Wives) గౌరవప్రదమైన ఉద్యోగం చేశారు. ఆమె ప్రొఫెషన్‌ స్పోర్ట్స్‌ మేనేజర్‌గా కొంతకాలం పనిచేశారు. ఆమె తన గ్రాడ్యూయేషన్‌ తర్వాత కార్నర్‌స్టోన్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. ఆరేళ్ల  డేటింగ్‌ తర్వాత 2015లో రోహిత్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.

  సాగరికా ఘట్గే w/o జహీర్ ఖాన్

  తన అందచందాలతో బాలీవుడ్ నటి సాగరికా ఘట్గే అభిమాన గణాన్ని సొంతం చేసుకుంది. 2017లో టీమిండియా స్వింగ్ మాస్టర్ జహీర్ ఖాన్‌ని మనువాడింది. ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.  

  ఊతప్ప w/o షీతల్‌ గౌతమ్

  ఊతప్ప భార్య షీతల్‌ గౌతమ్‌ టాలెంటెడ్‌ టెన్నీస్ ప్లేయర్‌. తన భర్త జట్టులో స్థానం కోల్పోయిన సందర్భాల్లో ఆమె ఎంతో అండగా నిలిచారు. ఐపీఎల్‌లో చెన్నై తరపున రాణించడంలోనూ ఆమె పాత్ర ఉందని పలు వేదికలపై ఊతప్ప చెప్పాడు.

  ఉమ్మే అహ్మద్ శిశిర్ w/o షకిబ్ అల్ హసన్

  భారత ఉపఖండంలో తనకంటూ ఫ్యాన్ బేస్‌ని క్రియేట్ చేసుకున్న మరో వనిత ‘ఉమ్మే అహ్మద్ శిశిర్’. నెం.1 ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ భార్య. 11ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. వీరి అనుబంధానికి ప్రతిరూపంగా ఒక కుమారుడు జన్మించాడు. 

  జస్సిం లోరా w/o ఆండ్రూ రస్సెల్ 

  వెస్టిండీస్ భీకర ఆల్‌రౌండర్ అండ్రూ రస్సెల్‌ని తన అందంతో పడేసిన అమెరికా మోడల్ జస్సిమ్ లోరా. 2016లో వీరిద్దరికీ వివాహమైంది. వీరికి కూతురు ఉంది. అయితే, ఈ మోడల్‌కి సోషల్ మీడియా అభిమానులు కోకొల్లలుగా ఉన్నారు. 

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv