దేశం గర్వించతగ్గ పారిశ్రామిక వేత్తల్లో రతన్ టాటా (Ratan Naval Tata) కచ్చితంగా టాప్ ప్లేస్‌లో ఉంటారు. బిజినెస్ టైకూన్‌గా గుర్తింపు పొందిన ఆయన తన జీవిత కాలంలో సమాజ శ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అటువంటి ఆయన కన్నుమూతతో కోట్లాది మంది ప్రజలు తల్లడిల్లిపోయారు. గొప్ప వ్యక్తిని దేశం కోల్పోయిందంటూ సోషల్ మీడియా వేదికగా లక్షలాది పోస్టులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రతన్ టాటాకు సంబంధించి ఓ అంశం తెరపైకి వచ్చింది. గొప్ప చరిత్ర కలిగిన రతన్ టాటా జీవితాన్ని బయోపిక్‌లా తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు హీరోల్లో ఆయన బయోపిక్ ఎవరు చేస్తే బాగుటుంది? ఏ హీరో బాగా సూట్ అవుతారు? అంచనావేసే ప్రయత్నం చేద్దాం.
ఎవరు న్యాయం చేస్తారు?
రతన్ టాటా జీవితం ముందు నుంచి పూలపాన్పు కాదన్న సంగతి అందరికి తెలిసిందే. ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొని టాటా ఈ స్థాయికి ఎదిగారు. అతని జీవితం ఎన్నో భావోద్వేగాల ప్రయాణంగా చెప్పవచ్చు. అటువంటి పాత్ర చేయాలంటే సాధారణమైన విషయం కాదు. ప్రస్తుత హీరోల్లో ఆ పాత్ర చేయగల సామర్థ్యం(Ratan Tata Biopic) ఎవరికి ఉందని చూస్తే రామ్‌చరణ్ (Ramcharan) ముందుగా తెరపైకి వస్తాడు. బిజినెస్ టైకూన్‌గా అతడి లుక్ బాగా సెట్ అవుతుంది. మేకప్‌తో కొద్ది మార్పులు చేస్తే చరణ్ ఫేస్ సరిగ్గా రతన్ టాటాగా సరిపోతుంది. అలాగే హీరో నాని (Nani) కూడా రతన్ టాటా పాత్రకు న్యాయం చేస్తాడని అనిపిస్తోంది. టాటా జీవితంలోని భావోద్వేగ గట్టాలను నాని బాగా రక్తికట్టించగలడని చెప్పవచ్చు. అలాగే మహేష్ బాబు (Mahesh Babu) కూడా రతన్ బయోపిక్‌కు సెట్ అయ్యేలా కనిపిస్తున్నాడు. ‘మహర్షి’ సినిమాలో మల్టీనేషనల్ కంపెనీ సీఈవోగా అతడి లుక్ చాలా బాగుంది. బయోపిక్‌లకు కేరాఫ్‌గా మారిన అడివి శేష్ (Adivi Sesh) కూడా ఈ పాత్రకు న్యాయం చేస్తాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పాత్రకు తగ్గట్లు తనను తాను రూపాంతరం చేసుకోవడంలో అడివి శేష్ దిట్ట అని గుర్తుచేస్తున్నారు. ఓవరాల్‌గా రతన్ టాటా బయోపిక్‌కు తెలుగులో చాలానే ఆప్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు.
బయోపిక్‌పై గతంలో రూమర్లు!
రతన్ టాటా బయోపిక్ తెరకెక్కించే విషయమై బాలీవుడ్‌లో ఎప్పటి నుంచే చర్చ జరుగుతోంది. హీరో ఎంపిక జరిగిపోయిందని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోందంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర ఈ దార్శనికుడి బయోపిక్ తీయనున్నట్లు 2022లో భారీగా కథనాలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ (Akshay Kumar) లేదా అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)లలో ఒకరు రతన్ టాటా పాత్ర చేయబోతున్నట్లు గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ ప్రచారాన్ని సుధా కొంగర ఖండించారు. ‘రతన్ టాటా అంటే నాకు ఎంతో ఇష్టం, గౌరవం. ప్రస్తుతానికి ఆయన బయోపిక్ తీయడం లేదు’ అని ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.
గతంలోనే డాక్యుమెంటరీ
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటాపై ఇప్పటికే ఓ డాక్యుమెంటరీ రూపొందింది. ప్రముఖ ఓటీటీ సంస్ధ డిస్నీ + హాట్‌స్టార్ ఆయనపై ఓ ఎపిసోడ్ చేసింది. ‘మెగా ఐకాన్స్’ సీజన్ 2 (Mega Icons Season 2) రెండో ఎపిసోడ్‌లో రతన్ టాటా అతిథిగా హాజరై తన ప్రయాణానికి సంబంధించిన కొన్ని విశేషాలను పంచుకున్నారు. తక్కువ ధరకే కారు తీసుకురావాలన్న తన ఆలోచనలను ఈ ఎపిసోడ్‌లో పంచుకున్నారు. రతన్ టాటాకు సంబంధించిన (Ratan Tata Biopic) విశేషాలను తెలుసుకోవాలని భావించే వారు ఓటీటీలో ఈ ఎపిసోడ్‌ను వీక్షించవచ్చు. ఇది ప్రస్తుతం ఐద భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, తమిళ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యూమెంటరీ ఆసియా టెలివిజన్ అవార్డుకు సైతం నామినేట్ అయ్యి ఉత్తమ డాక్యుమెంటరీగా టైటిల్ గెలవడం విశేషం.
వ్యాపారవేత్తల బయోపిక్ కొత్తేం కాదు!
గత కొంతకాలంగా క్రీడాకారులకు సంబంధించిన బయోపిక్‌లే వరుసగా రిలీజ్ అవుతూ వచ్చాయి. ‘ఎం.ఎస్.ధోని’, ‘సైనా’, ‘మేరీ కోమ్’, ‘మైదాన్’, ‘గోల్డ్’, ‘83’, ‘బాగ్ మిల్కా బాగ్’ వంటి ప్రముఖ క్రీడాకారుల బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ సాధించాయి. అయితే వ్యాపారవేత్తల బయోపిక్‌లు మాత్రం చాలా అరుదుగా వచ్చాయి. దివంగత వ్యాపారవేత్త ధీరూభాయ్ అంబానీ లైఫ్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘గురు’ పేరుతో హిందీలో బయోపిక్ చేశారు. అభిషేక్ బచ్చన్ లీడ్‌రోల్‌తో మూడు గంటల్లో ఆయన గురించి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో గొప్ప విజయాన్ని సాధించలేదు. కానీ, మణిరత్నం కెరీర్‌లో ఒక మైలురాయిగా మాత్రం నిలిచిపోయింది. అదే తరహాలో రతన్ టాటాని కూడా స్క్రీన్‌పై చూపించేందుకు దర్శక నిర్మాతలు ముందుకు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈ బయోపిక్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!