• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరోసారి గరిట పట్టిన బిల్‌గేట్స్‌

    [VIDEO](url): మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మరోసారి చెఫ్‌గా మారారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి గరిట తిప్పారు. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన సలహా మేరకు ఈసారి తృణధాన్యాలతో వంటకం చేసి దాన్ని రుచిచూశారు. అనంతరం ‘శ్రీ అన్న కిచిడీ’ని కొంతమంది చిన్నారులకు స్వయంగా తినిపించారు. ఈ వీడియో, ఫొటోలను స్మృతి ఇరానీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. Recognising the Super Food of India and its POSHAN … Read more

    FPO విత్ డ్రాపై వివరణ ఇచ్చిన అదానీ

    పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(FPO)ని ఉపసంహరించుకోవడంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఇన్వెస్టర్లను ఉద్దేశించి అదానీ చేసిన ప్రసంగించారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. మార్కెట్ అస్థిరతల దృష్ట్యా FPOను కొనసాగించడం నైతికత కాబోదని అభిప్రాయపడ్డారు. కంపెనీ బ్యాలన్స్‌షీట్ పక్కాగా ఉందని వెల్లడించారు. మార్కెట్ పరిస్థితులన్నీ మెరుగు పడ్డాక క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌పై దృష్టి సారిస్తామని తెలిపారు.

    వెయిటర్ స్కిల్‌కి ఆనంద్ మహీంద్రా ఫిదా

    సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌‌గా ఉండే వ్యాపారవేత్త ‘ఆనంద్ మహీంద్రా’ తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఓ హోటల్‌లో సర్వర్ నైపుణ్యాన్ని చూసి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యపోయారు. డజనుకు పైగా ప్లేట్లను ఒకేసారి తీసుకెళ్తుండటం చూసి.. ‘వెయిటర్ ప్రొడక్టివిటీ’లో ఒలింపిక్ అవార్డు పోటీలు పెడితే ఈ వ్యక్తి తప్పకుండా స్వర్ణం గెలవగలడని అభిప్రాయపడ్డాడు. ‘‘వెయిటర్ ప్రొడక్టివిటీ’ అనే ఓ ఒలింపిక్ స్పోర్ట్‌ని మనం కొత్తగా తీసుకురావాలి. అప్పుడు మనోడు కచ్చితంగా గోల్డ్ మెడల్ రేసులో ఉంటాడు’’ అని ట్వీట్‌లో ఆనంద్ మహీంద్రా తెలిపారు. … Read more