• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు

  గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసునమోదైంది. అఫ్జల్‌గంజ్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం లేపాయి. ఈనేపథ్యంలో రాజాసింగ్‌పై సెక్షన్‌ 153, 153(ఏ) ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. రాజకీయంగా తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను తరిమికొట్టాలని రాజాసింగ్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.

  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి ఉండదు: KCR

  ధరణి పోర్టల్‌తో అద్భుత ఫలితాలు వచ్చాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేసి దందాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకుంటూ ప్రజల అవసరాల కోసం ధరణిని వినియోగిస్తున్నామని చెప్పారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడినపుడు తలసరి ఆదాయంలో రాష్ట్రం 19-20 స్థానాల్లో ఉండేదని చెప్పారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన తర్వాత 3.18లక్షల తలసరి ఆదాయంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నామని కేసీఆర్ పేర్కొన్నారు.

  హారతి పళ్లెంలో డబ్బులు.. మంత్రిపై కేసు

  తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదైంది. గూడూరులో ఎన్నికల ప్రచారం ఉన్నప్పుడు కొందరు మహిళలు ఆమెకు హారతి ఇచ్చారు. ఈ క్రమంలో సత్యవతి హారతి పళ్లెంలో రూ.4వేలు వేశారు. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకే డబ్బులిచ్చారని ఎఫ్‌ఎస్‌టీ బృందం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.

  మరో ఆరు హామీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో

  తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజా మేనిఫెస్టోలో 1) తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులకు ₹25వేల పింఛను, ఆయా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 2) ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి 250 గజాల ఇళ్ల స్థలం, 3) రైతులకు ఏకకాలంలో ₹2లక్షల పంట రుణమాఫీ, 4) రైతులకు ₹3లక్షల వడ్డీ లేని రుణాలు, ధరణీ స్థానంలో ‘భూమాత’ పోర్టల్‌, 5) వార్షిక జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ₹2లక్షల ఉద్యోగాల భర్తీ, 6) ఆడపిల్లల పెళ్లికి ₹లక్షతో … Read more

  పవన్‌ది నాది ఒకే మనస్తత్వం: బాలకృష్ణ

  జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ది.. తనది ఒకే మనస్తత్వమని ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. ఇద్దం ముక్కుసూటిగా మాట్లాడే అలవాలు ఉందన్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలవటం నవశకానికి నాంది అని పేర్కొన్నారు. కలసికట్టుగా ముందుకు సాగుదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని ఆరోపించారు. టీడీపీ పాలనలో రూ.23 కోట్లతో నిర్మించిన బసవతారకరామ మాతాశిశు ఆసుపత్రి వద్ద సెల్ఫీ తీసుకొని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్‌ విసిరారు.

  BRSకు 100 సీట్లు గ్యారంటీ: కవిత

  TS: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు 100 సీట్లు వస్తాయని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి కేసీఆర్ సీఎం అవుతారని ఆశించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోరుట్లలో తమ పార్టీ భారీ మెజారిటీ సాధిస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో ఈ పదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కవిత పేర్కొన్నారు.

  రైలు ఢీకొని ఇద్దరు మృతి

  TS: రైలు ఢీకొని ఇద్దరు మృత్యువాతపడారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో చోటుచేసుకుంది. స్థానికంగా ఉంటున్న సురేశ్‌(30), చందర్‌(40) ఇద్దరూ ద్విచక్రవాహనంపై మంచిర్యాల వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో క్యాతనపల్లి వద్ద రైల్వే గేటు పడింది. బైక్‌ను గేటు దాటించే క్రమంలో రైలు ఢీకొనడంతో సురేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. చందర్‌ మృతదేహం రైలు ఇంజిన్‌ ముందు భాగంలో ఇరుక్కుని 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది..

  కాంగ్రెస్‌లోకి విజయశాంతి.. ముహూర్తం ఫిక్స్?

  బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేపు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారని సమాచారం. పార్టీలో చేరిక తర్వాత వచ్చే ఎన్నికల్లో మెదక్ నుంచి విజయశాంతి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీబీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపారు.

  రాష్ట్రానికి కేసీఆర్ చేసిందేమి లేదు: రేవంత్

  బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పండిపడ్డారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విజయం సాధిస్తే రైతుబంధు ఆపేస్తామని కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని రేవంత్ హమీ ఇచ్చారు.

  ఓటు వేసే ముందు ఆలోచించండి: KCR

  కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తొర్రూరులో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. ఓటు వేసే ముందు ప్రజలు అన్నీ ఆలోచించి వేయాలి. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకుర్తి ఎంతో అభివృద్ధి చెందింది. పదేళ్ల ముందు పాలకుర్తి ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు అపేస్తుంది’.అని కేసీఆర్ పేర్కొన్నారు.