• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గెలిస్తే 24 గంటలూ తాగునీరు: కేటీఆర్‌

    తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ తాజ్‌ డెక్కన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. పెట్టుబడులు వస్తేనే నగరంలో సంపద పెరుగుతోందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌కు రాకపోకలు చాలా సులువుగా జరగాలన్నారు. త్వరలో ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేలా చూస్తామని చెప్పారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమించామని కేటీఆర్‌ చెప్పారు.

    శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత సంచారం

    తిరుమల శ్రీవారిమెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. భక్తులు రోడ్డు దాటుతున్న సమయంలో చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే భక్తులు టీడీపీ సెక్యూరిటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో టీటీడీ కాలినడక భక్తులను గుంపులుగా అనుమతిస్తుంది. వాటర్‌ హౌస్‌ వద్ద భక్తులను నిలిపి గుంపులుగా పంపుతున్నారు.

    మహిళలతో కాంపౌండర్‌ వికృత చేష్టలు

    అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వస్తున్న మహిళల అసభ్యకర ఫొటోలను తీసి ఓ కాంపౌండర్‌ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఈ ఘటన మార్కాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది. రామ్‌సింగ్‌ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో వైద్యుడి వద్దకు వచ్చే మహిళలకు ఇంజక్షన్లు వేసే సమయంలో రహస్యంగా తన సె‌ల్‌ఫోన్‌లో అసభ్యకర చిత్రాలను తీసేవాడు. ఈ క్రమంలో ఓ మహిళ దీన్ని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోలీసులు కేసునమోదు చేశారు.

    ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను హత్య చేశాడు

    ప్రేమించి వివాహం చేసుకున్న భార్యను, భర్త కడతేర్చాడు. ఈ ఘటన హైదరాబాద్ నేరేడ్‌మెట్‌లో చోటుచేసుకుంది. వరంగల్‌ జిల్లాకు చెందిన స్రవంతి(22), సిద్ధిపేట జిల్లాకు చెందిన మహేందర్ అనే వ్యక్తిని 2019లో ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో స్రవంతి చాలా రోజులుగా తల్లి ఇంటి వద్దే ఉంటుంది. ఓ రోజు మహేందర్‌ భార్యకు ఫోన్‌ చేసి తాము ఉంటున్న అద్దె ఇళ్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దీంతో ఆమె అద్దె ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో మహేందర్‌ … Read more

    ఆ పార్టీలు మాదిగ విరోధులు: ప్రధాని

    భారాస, కాంగ్రెస్‌ పార్టీలు.. మాదిగ విరోధులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించిన ఎస్సీ ఉపకులాల విశ్వరూప మహాసభకు ప్రధాని మోదీ హాజరై మాట్లాడారు. ‘ఎంతో ప్రేమతో నన్ను ఈ సభకు ఆహ్వానించారు. మందకృష్ణ నా చిన్న తమ్ముడు. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సామాజిక న్యాయానికి మేం కట్టుబడి ఉన్నాం. 3 దశాబ్దాల మాదిగల ఉద్యమానికి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా’ అని అన్నారు.

    మైసూరులో ‘సామిరంగ’ టీమ్

    నాగార్జున హీరోగా విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో ‘నా సామిరంగ’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే.. అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఓ పాటని కూడా తెరకెక్కించనున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. సంక్రాంతి సందర్భంగా విడుదల ఖరారు చేసుకున్న ఈ సినిమా వేగంగా చిత్రీకరణ చేసుకుంటోంది. నాగార్జున ఒక పక్క ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటూనే, మరోపక్క బిగ్‌బాస్‌ షోని నిర్వహిస్తున్నారు.

    TS Elections: రూ.1 గ్యాస్ సిలిండర్లు

    తెలంగాణలో పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో ప్రధాన పార్టీలు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. తమ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థి కుమ్మరి వెంకటేష్‌ యాదవ్‌. రూపాయికే ఉచిత విద్య, రూపాయికే వైద్యం, రూపాయికే న్యాయ సలహాలిస్తానని చెబుతున్నారు. ప్రతి వంద కుటుంబాలకు ఒక వాలంటీరును నియమిస్తామని, 70 ఏళ్లు దాటిన వారు ఎమర్జెన్సీ పానిక్‌ బటన్‌ నొక్కగానే వచ్చి సాయం అందిస్తానంటూ ప్రచారం చేస్తున్నారు.

    ఆర్టీసీ బస్సుల రద్దు.. నేతలు ఆగ్రహం

    ఎమ్మార్పీఎస్‌ నేతలు బుక్‌ చేసుకున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను అధికారులు చివరి నిమిషంలో రద్దు చేశారు. దీనిపై ఎమ్మర్పీఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం బస్సులు బుక్‌ చేసుకోగా నేటి సాయంత్రం అవి బయలుదేరాల్సి ఉంది. ఇంతలో వీటిని రద్దుచేసినట్లు నేతలకు ఆర్టీసీ సమాచారం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఆఖరి క్షణాల్లో బస్సులను రద్దు చేయడంపై డిపోల అధికారులతో వాగ్వాదం కూడా జరిగింది.

    ‘కాంగ్రెస్‌ వస్తే మళ్లీ కరెంటు కష్టాలే’

    TG: హుజురాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ పాలన వస్తే ప్రతి విషయానికి ఢిల్లీ వెళ్లాల్సిందేనని ఎద్దేవా చేశారు. ‘కర్ణాటక ఉప ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చి ఆ రాష్ట్రంలో 5 గం.ల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెబుతున్నారు. ఇక్కడ 24 గంటల కరెంటు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవు. హుజూరాబాద్‌లో భాజపా మూడో స్థానానికి పడిపోయింది. అన్ని సర్వేలలో కూడా భారాస అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తొలి స్థానంలో ఉన్నారు’ అని అన్నారు.

    చివరి నిమిషంలో బీజేపీ అభ్యర్థులు మార్పు

    తెలంగాణలో ఎన్నిక నామినేషన్ చివరి రోజు రెండు చోట్ల అభ్యర్థులను బీజేపీ మార్చింది. వేములవాడ, సంగారెడ్డి అభ్యర్థులను మార్పు చేసింది. అప్పటికి ప్రకటించి ఉన్న వారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశమిచ్చింది. వేములవాడ అభ్యర్థిగా వికాస్‌రావు, సంగారెడ్డి అభ్యర్థిగా పులిమామిడి రాజును బీజేపీ ప్రకటించింది. టికెట్‌ ప్రకటించి బీఫామ్‌ ఇవ్వకపోవడంపై సంగారెడ్డి బీజేపీ నేత దేశ్‌పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బీఫామ్‌ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆయన కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి హెచ్చరించారు.