• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముగిసిన నామినేషన్ల పర్వం

    తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. నిర్ణీత సమయంలోగా మిగిలి ఉన్న వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ నెల 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నవంబర్ 30న ఎన్నికలు, డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుంది.

    కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్‌

    సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడ గురునానక్‌ కాలనీలోని కేడీజీవో పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని హీరో కమల్‌హాసన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత దేవినేని అవినాష్‌, పెద్ద ఎత్తున కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులు పాల్గొన్నారు. ‘ఇండియన్‌-2’ సినిమా చిత్రీకరణ కోసం కమల్‌హాసన్‌ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    భాజపా నాలుగో జాబితా ప్రకటన

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల నాలుగో జాబితాను భాజపా విడుదల చేసింది. ఇప్పటికే మూడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన కమలం పార్టీ.. తుది జాబితాను ఖరారు చేసింది. టికెట్‌ ఖరారైన అభ్యర్థులకు భాజపా ముఖ్యనేతలు ఇప్పటికే ఫోన్‌ చేసి సమాచారమందించారు. కంటోన్మెంట్‌-కృష్ణ ప్రసాద్‌, నాంపల్లి-రాహుల్‌ చంద్ర, శేరిలింగంపల్లి-రవికుమార్‌ యాదవ్‌, మల్కాజ్‌గిరి-రామచందర్‌రావు, పెద్దపల్లి-ప్రదీప్ కుమార్, మేడ్చల్-విక్రమ్ రెడ్డికి కేటాయించినట్టు భాజపా ఓ ప్రకటనలో తెలిపింది.

    కేసీఆర్‌ ఆస్తుల విలువ ఎంతంటే?

    TG: సీఎం కేసీఆర్ తన పేరిట రూ.58.7 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ. 35.42 కోట్ల విలువైన చరాస్తులు (నగదు, బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు), రూ.23.50 కోట్ల విలువైన స్థిరాస్తులు (ఇళ్లు, ఫాంహౌస్‌, ప్లాట్లు) ఉన్నాయని ప్రకటించారు. తన పేరిట సొంత భూమి, కార్లు, బైక్‌, ఇతర వాహనాలు లేవని పేర్కొన్నారు. తన పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, కుటుంబం పేరు మీద రూ.7.23 కోట్ల అప్పు ఉందని అఫిడవిట్లో వెల్లడించారు. సంవత్సర ఆదాయం రూ.1.60 కోట్లు అని … Read more

    కేటీఆర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

    మంత్రి కేటీఆర్‌కు తృటిలోొ ప్రమాదం తప్పింది. కేటీఆర్ ప్రచార వాహనంలో ఉండగా డైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో ప్రచారరథం రెయిలింగ్ విరగడంతో మంత్రి ముందుకు పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కేటీఆర్‌ను పట్టకున్నారు. ఈ ప్రమాదంలో ఎంపీ సురేష్ రెడ్డి వాహనంపై నుంచి జారి కిందపడటంతో స్వల్ఫ గాయాలయ్యాయి. ఆర్మూరు ర్యాలీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

    వీల్‌చైర్‌లో వచ్చి ఎంపీ నామినేషన్‌

    మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ దాఖలు చేశారు. దుబ్బాకలో అంబులెన్స్‌ దిగి వీల్‌చైర్‌లో రిటర్నింగ్‌ కార్యాలయానికి వచ్చి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అయితే ఇటీవల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ యువకుడి చేతిలో కత్తిపోటుకు గురైన ఆయనకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

    గజ్వేల్‌లో కేసీఆర్ నామినేషన్

    సీఎం కేసీఆర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గజ్వేల్‌లోని సమీకృత భవనంలో రిటర్నింగ్‌ అధికారికి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను అందజేశారు. కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్న కేసీఆర్.. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి ఆయన సమర్పించారు.

    రోడ్డు ప్రమాదంలో తల్లీ, కుమార్తెలు మృతి

    TS: మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలంnలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి తన ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తుండగా ఓ వాహనం వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు. మేడ్చల్‌ నుంచి తూప్రాన్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

    ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి: KCR

    ఎన్నికల్లో ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందన్నారు. ఎన్నికలు అవగానే ఇచ్చిన హామీని ఆ పార్టీ విస్మరించిందని చెప్పారు. బీఆర్‌ఎస్ పోరాటానికి భయపడి కాంగ్రెస్‌ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని తెలిపారు.

    బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతు: పవన్

    తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి జనసేన సంపూర్ణ మద్దతిస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వం రావాలని ఆకాంక్షించారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో కలిసి పవన్‌ పాల్గొన్నారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే మాటకు బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. మోదీలాంటి ప్రధాని ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకోవడానికి ఉన్న అవకాశాలను రెండు రాష్ట్రాల నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సాధనలో విజయం సాధించాం కానీ.. రాష్ట్ర అభ్యున్నతిలో సాధించాలేదని పవన్‌ అన్నారు.