• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హైదరాబాద్‌లో దంచికొడుతున్న వానలు.. ఈ పనులు మాత్రమే చేయండి! తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ!

    హైదరాబాద్‌లో గత రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాన నీరు రోడ్లపైకి రావడంతో పలు చోట్ల పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఉదయం 8 గంటల నుంచి హైదరాబాద్ రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు వానలో తడుస్తూ ఇబ్బంది పడ్డారు.  వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ క్లియర్ అయ్యేవరకు వర్షంలో తడుస్తూ కాలం వెల్లదిశారు. పంజాగుట్ట నుంచి హైటెక్ సిటీ వెళ్లే రూట్‌లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి … Read more

    Pawan Kalyan: వాలంటీర్లపై పవన్ కామెంట్స్.. వైసీపీకి అనుకూలంగా మారాయా?

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నిరేపాయి. వాలంటీర్లు సేకరించే సమాచారం వల్లే యువతులు అదృశ్యమవుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలకు రాష్ట్రంలో వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు రెండున్నర లక్షల మంది వాలంటీర్లు పవన్​ దిష్టి బొమ్మలను దగ్దం చేస్తూ నిరసన తెలిపారు. వీరికి వైసీపీ నేతలు సైతం మద్దతు ఇస్తున్నారు. కొందరు వైసీపీ నేతలైతే పవన్ వ్యాఖ్యలకు క్షమాపణలు కోరుతూ వారంటీర్ల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటున్నారు. దీంతో … Read more

    Daggubati Purandeswari: జూ. ఎన్టీఆర్‌ను దువ్వే పనిలో బీజేపీ.. అందుకే పురంధేశ్వరికి అధ్యక్ష పగ్గాలు… ఇవిగో ప్రూఫ్స్!

     తెలుగు రాష్ట్రాల్లో రాజకీయపరంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులను తొలగిస్తూ  ఆ పార్టీ అధిష్ఠానం సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. వ్యూహాత్మ ఎత్తులకు బీజేపీ సమాయత్తం అయింది. తొలుత ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరిని నియమిస్తున్నట్లు బీజేపీ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే  ఏపీ బీజేపీ చీఫ్‌గా ఉన్న సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా తనను … Read more

    KTR as CM: వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా కేటీఆర్… వ్యూహం మార్చిన కేసీఆర్!

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో రాజకీయం వేడెక్కింది. అధికార, విపక్షాలు ఎన్నికల సమరానికి మెల్లిమెల్లిగా రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలో క్యాడర్ బలోపేతంపై బీజేపీ, కాంగ్రెస్ ఫోకస్ పెట్టాయి. మరోవైపు, ఇదే ఊపును కొనసాగించాలని బీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. అయితే, బీఆర్ఎస్‌లో సీఎం అభ్యర్థిత్వంపై తరచూ చర్చ జరుగుతూ వస్తోంది. సీఎం కేసీఆరే మరోసారి ముఖ్యమంత్రి అవుతారని కొందరు చెబుతుండగా, ఇతర నాయకులు, కొందరు మంత్రులు మాత్రం కేటీఆర్ పేరు వల్లిస్తున్నారు.  మంత్రి పువ్వాడ కామెంట్స్.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ … Read more

    Dimple Hayathi vs DCP: ఐపీఎస్ కారును తన్ని డింపుల్ వీరంగం.. గొడవకు కారణం ఇదే!

    ప్రముఖ హీరోయిన్ డింపుల్ హయాతి వివాదంలో చిక్కుకుంది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారుపై దాడి కేసులో ఆమెపై జూబ్లీ హిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో రాహుల్ హెగ్డే, డింపుల్ హయాతి ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయమై వీరి మధ్య తరచూ గొడవ జరుగుతున్నట్లు సమాచారం. డీసీపీ రాహల్ ఏమన్నారంటే.. కాగా, డింపుల్ హయాతిపై నమోదైన కేసుపై  ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే స్పందించారు. తనకు హీరోయిన్ డింపుల్‌కు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్నారు.  పార్కింగ్ … Read more

    GOOGLE BARD: చాట్‌జీపీటీని మించేలా గూగుల్‌ బార్డ్‌… ఏకంగా కోడింగ్‌ రాసేలా రూపకల్పన

    ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్‌ ఇంటిలిజెన్స్‌ పోటీ నెలకొంది. ప్రస్తుతం చాట్‌జీపీటీ హవా నడుస్తుంటే.. పోటీగా ఓపెన్‌ ఏఐని తీసుకువచ్చేందుకు చాలా సంస్థలే పనిచేస్తున్నాయి. ఇందులో గూగుల్‌ మెుదటి స్థానంలో ఉంది. కంపెనీకి సంబంధించిన చాట్‌బాట్‌ బార్డ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే టెస్టింగ్‌ దశలో ఉండగా.. ఇందులో సరికొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అవేంటో ఓ సారి తెలుసుకుందాం. గూగుల్ బార్డ్‌ గూగుల్‌ అభివృద్ది చేస్తున్న ఓపెన్‌ ఏఐ బార్డ్‌. ఇది పాత చాట్‌బాట్‌ అయినప్పటికీ దీన్ని చాట్‌జీపీటీకి పోటీగా మెరుగుపరుస్తున్నారు. ఇప్పటికే టెస్టింగ్‌ దశలో ఉంది. … Read more

    BlueTick:  రోహిత్ శర్మ, కోహ్లీ, ధోని సహా సెలబ్రెటీలకు ట్విట్టర్ బిగ్ షాక్… నెట్టింట్లో ట్విట్టర్‌ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్

    ట్విటర్ బ్లూ టిక్. ప్రస్తుతం ఇదొక ట్రెండింగ్ టాపిక్. ఎందుకంటే దేశంలోని చాలామంది ప్రముఖుల ఐడీలకు ఈ బ్లూటిక్ మాయమైంది. సాధారణంగా ఫేక్ అకౌంట్లను గుర్తించడానికి ఇది సహాయపడేది. కానీ, ప్రస్తుతం ఎవరిది నిజమైన ఐడీనో తెలియని పరిస్థితి ఏర్పడింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ధోని, రజినీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్ వంటి స్టార్ల అకౌంట్లు సాదాసీదాగా మారిపోయాయి.  బ్లూటిక్‌ ఏంటీ? ట్విటర్‌లో ఫేక్‌ ఐడీలు పెరిగిపోవటంతో ఈ బ్లూటిక్‌ కాన్సెప్ట్‌ను తీసుకువచ్చారు. అసలైన అకౌంట్‌కు బ్లూటిక్‌ ఇవ్వటంతో నకిలీ ఖాతాలకు చెక్‌ పడింది. … Read more

    SOLAR ECLIPSE:ఏప్రిల్‌ 20న హైబ్రీడ్‌ సూర్య గ్రహణం..తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలు!

    ఏప్రిల్ 20 గురువారం నాడు ఆకాశంలో అద్భుతం జరగనుంది. సంపూర్ణ సూర్య గ్రహణం కనిపించనుంది. దక్షిణార్థ గోళంలో సుమారు 79 సెకన్ల పాటు సూర్యుడిని చంద్రుడు పూర్తిగా కమ్మేయనున్నాడు. ఈ గ్రహణం చూడాలనుకునే వాళ్లు పశ్చిమ ఆస్ట్రేలియాకు పయనం అవుతున్నారు. ఇలాంటి  కొన్ని మారుమూల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యాల గురించి తెలుసుకోవాల్సిందే. భారత్‌లో ఎక్కడ సూర్య గ్రహణం సంపూర్ణంగా దక్షిణార్థ గోళంలోనే కనిపిస్తుంది. భారత్‌లో హిందూ మహాసముద్రం సమీపంలోని కెర్గులెన్ దీవులు వద్ద ప్రారంభమై పశ్చిమ ఆస్ట్రేలియా, తైమూర్‌ లెస్టే, పశ్చిమ … Read more

    CHIRANJEEVI: బలగం నటుడు మెుగిలయ్యకు చిరంజీవి సాయం… కంటి చూపుకోసం ఎంత ఖర్చైనా ఇస్తానని భరోసా

    తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవ్వరికీ సాయం కావాలాన్న ముందుండేది మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీలో ఎంతోమందికి అండగా నిలబడ్డాడు చిరు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక చేయూతనందిస్తూ నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఆయన సహాయం ఇంకా ఎంతోమంది కళాకారులకు చేరుతూనే ఉంది. ఇటీవల ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్న బలగం మెుగిలయ్యకు సహాయం అందిస్తున్నాడు మెగాస్టార్. మెుగిలయ్యకు అండగా బలగం సినిమాలో నీ తోడుగా నా తోడు ఉండి అనే పాటను పాడిన మెుగిలయ్య అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపుడుతున్న … Read more

    LUCKY CHANCE: అబుదాబీ లక్కీ డ్రాలో రూ.2 కోట్లు గెలుచుకున్న హైదరాబాదీ

    అదృష్టం కలిసిరాకపోతుందా అని ఎదురుచూసే వాళ్లు ఎంతో మంది ఉంటారు. ఒక్క క్షణం అది మన సొంతమైతే జీవితం మారిపోతుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. సరిగ్గా అలాంటి రోజే యూఏఈలో నివసిస్తున్న హైదరాబాదీకి వచ్చింది. అదృష్టం ఆమెను పడిశం పట్టినట్లే పట్టింది. ప్రతీ వారం తీసే లక్కీ డ్రాలో ఏకంగా రూ. 2 కోట్లకు పైగా గెలుచుకుంది ఆ మహిళ.  లక్కీ ఛాన్స్‌ హైదరాబాద్‌కు చెందిన హమీదా బేగం అబుదాబీలో మూడేళ్లుగా నివసిస్తోంది. మెడికల్‌ కోడర్‌గా పనిచేస్తోంది. అక్కడ ప్రతీ వారం మహ్‌జూజ్‌ లక్కీ … Read more