• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో

    సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో యావత్తు తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సమాచారం తెలిసి సినీ నటులు శివాజీ రాజా, సాయికుమార్, విక్టరీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన్ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఏకైక కూతురు కావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

    రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గాయత్రి అంటే ఎంత ఇష్టమో పలు వేదికలపై చర్చించారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఒక్కగానొక్క కూతురు గాయత్రి ప్రేమ వివాహం చేసుకుందని ఆమెతో కొన్నేళ్లు మాట్లాడలేదని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. ఒక తల్లిలేని వాడు తన తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటాడు అని తెలిపారు. తనలో తన చనిపోయిన అమ్మను చూసుకున్నానని భావోద్వేగానికి లోనయ్యారు. తనకు తన బిడ్డ రెండో తల్లి లాంటిది అని చెప్పుకొచ్చారు. తన తల్లి చనిపోయినప్పుడు కూడా తను ఏడవలేదని కానీ తన కూతురుకు ఏమైన అయితే మాత్రం తట్టుకోలేనని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

    సినీలోకం సంతాప సందేశం

    ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి మరణం ఎంతో విచారకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ – ఏపీ మంత్రి లోకేశ్‌

    ‘‘ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ గారి కుమార్తె గాయత్రి హఠాన్మరణం తెలిసి మనసు తీవ్రంగా కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. పుత్రికను కోల్పోవడం ఎంతటి పెద్ద విషాదమో, ఈ కష్టాన్ని అధిగమించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను’’ – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌

    ‘‘కుమార్తెలో అమ్మను చూసుకున్న రాజేంద్రప్రసాద్ గారికి పుత్రిక వియోగం కావడం నిజంగా అంతులేని బాధ. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో దేవుడు వారిని ధైర్యంగా ఉండేలా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను’’ – సాయి ధరమ్ తేజ్‌

    ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి అత్యంత ఆప్తులైన గాయత్రి మరణం వ్యక్తిగతంగా ఎంతో బాధను కలిగించింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి’’ – జూ.ఎన్టీఆర్‌

    ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా గాఢ సానుభూతి. ఈ కష్టాన్ని వారికి ఎప్పటికీ తలచుకునే విషాదం. దేవుడు వారికి ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ – వరుణ్ తేజ్‌

    ‘‘గాయత్రి మరణం నిజంగా చాలా బాధాకరం. ఈ సమయంలో రాజేంద్రప్రసాద్ గారికి, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి’’ – నవదీప్‌

    ‘‘రాజేంద్రప్రసాద్ గారి కుటుంబానికి నా సానుభూతి. వారి బాధకు మాటలు సరిపోవు. చాలా బాధగా ఉంది’’ – కీర్తి సురేశ్‌

    ‘‘నా సోదరుడు రాజేంద్రప్రసాద్ గారికి సానుభూతి తెలుపుతున్నాను. వారి కుటుంబం ఈ విపత్కర సమయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నాను’’ – నరేశ్

    తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నటకిరిటీగా ప్రఖ్యాతి గాంచిన రాజేంద్ర ప్రసాద్.. బాపు డైరెక్షన్‌లో వచ్చిన స్నేహం(1977) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ‘అహ నా పెళ్లంట’, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు, ఏప్రిల్ 1 విడుదల, మాయలోడు, ‘ఆ నలుగుగురు’ చిత్రాలు మంచిపేరు తెచ్చిపెట్టాయి. ఎక్కువగా హాస్య ప్రధానమైన చిత్రాల్లో నటించాడు. కారెక్టర్ నటులు మాత్రమే కామెడీని పండిస్తున్న ఆరోజుల్లో హీరో కూడా నవ్వుల్ని పూయించగలడు అని నిరూపించాడు రాజేంద్రప్రసాద్. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవీవీ సత్యనారాయణ, బాపు లాంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత రాజేంద్రప్రసాదుది. 45 సంవత్సరాలకు పైగా తన సినీ కెరీర్‌లో రాజేంద్రప్రసాద్ 200కు పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. సహాయ నటుడిగా శ్రీమంతుడు, కౌసల్యకృష్ణమూర్తి, నాన్నకు ప్రేమతో, మహానటి వంటి హిట్ చిత్రాల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటారు. మేడమ్ సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళ పాత్ర పోషించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ ప్రముఖ నటి రమాప్రభ కూతురు విజయ చాముండేశ్వరిని వివాహం చేసుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv