టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్-చిప్ స్టార్ట్-అప్ న్యూరాలింక్ మరో విప్లవాత్మక ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. ఈ సారి, పుట్టుకతో కంటి చూపు లేని వ్యక్తులకు చూపును పునరుద్ధరించగల పరికరాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ నూతన ప్రాజెక్టుకు(Neuralink) సంబంధించిన పరికరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన అనుమతిని న్యూరాలింక్ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) నుండి పొందింది.
బ్లైండ్‌సైట్ పరికరం
న్యూరాలింక్ అభివృద్ధి చేయబోయే పరికరం పేరు ‘బ్లైండ్‌సైట్’. ఈ పరికరం కంటి చూపు కోల్పోయిన వారికి ఉపయోగకరంగా ఉంటుంది. మస్క్ చెప్పిన ప్రకారం, ఈ పరికరం ఆప్టిక్ నర్వ్తో అనుసంధానమై పని చేస్తుంది. కాబట్టి పుట్టుకతో అంధులైనా, కంటి చూపు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టుకతో అంధులైన వారు కూడా ఈ పరికరాన్ని వాడి ప్రపంచాన్ని చూడగలుగుతారని మస్క్ X వేదికగా తెలిపారు.
బ్లైండ్‌సైట్ వినియోగం
మొదట ఈ పరికరం ద్వారా కంటి చూపు కొంతమేరకు పరిమితంగా ఉండొచ్చు, కానీ కొంతకాలానికే ఇది సహజ కంటి(Neuralink చూపుకంటే మెరుగైన దృష్టి సామర్థ్యాన్ని అందించగలదని న్యూరాలింక్ వెల్లడించింది. ఈ పరికరం ద్వారా వినియోగదారులు అతినీలలోహిత కిరణాలను కూడా తేలికగా చూడగలుగుతారని వివరించింది.
న్యూరాలింక్ ప్రస్తుత ప్రయోగాలు
ఇప్పటికే న్యూరాలింక్ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చడం ద్వారా వివిధ ప్రయోగాలను చేస్తోంది. మార్చిలో చిప్ అమర్చిన వ్యక్తి నోలాండ్ అర్బాగ్‌ను ప్రజలకు పరిచయం చేసింది. ఆయన తన బ్రెయిన్లో అమర్చిన చిప్ ద్వారా వీడియో గేమ్ సివిలైజేషన్ VI, చెస్ ఆడగలిగాడు. ఇది ‘ఎక్స్’లో లైవ్ స్ట్రీమ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగంలో అర్బాగ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇటీవల మస్క్, ఈ ఏడాది చివరిలో మరింత మంది రోగులకు ఈ పరికరాన్ని అమర్చే ఉద్దేశ్యం ఉందని వెల్లడించారు.
మరింత విస్తృతం
న్యూరాలింక్ త్వరలోనే మరిన్ని వినూత్న పరికరాలను పరిచయం చేయబోతోందని సమాచారం.న్యూరాలింక్ సంస్థ ఈ ఏడాది చివర్లో మరింత మంది రోగుల్లో బ్రెయిన్-చిప్ అమరికలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పక్షవాతం, దృష్టి కోల్పోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న రోగులకు సాంకేతిక పరిష్కారాలను అందించేందుకు ఈ ప్రాజెక్ట్ దూసుకుపోతుంది. అర్బాగ్ వంటి రోగులకు విజయవంతంగా ఈ చిప్ అమర్చిన తరువాత ఈ ప్రయోగాలపై ఆశలు పెరిగాయి. రోగుల మెదడు నుండి వచ్చే సిగ్నల్స్‌ను పరికరాల ద్వారా రీడ్ చేసి వాటిని వివిధ యంత్రాలకు అనుసంధానం చేయడం ద్వారా రోగి అనుకున్న పనిని చేయవచ్చు.
భవిష్యత్ ఎలా ఉంటుంది
బ్రెయిన్-చిప్ టెక్నాలజీ ద్వారా న్యూరాలింక్ చేయబోతున్న ప్రయోగాలు వాస్తవానికి, వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. మెదడు-యంత్ర సంబంధాలు మరింత సులభతరం చేయడంతోపాటు, కంటి చూపు, కదలికల పునరుద్ధరణ వంటి అంశాల్లో సాధ్యాసాధ్యాల పరిమితులను విస్తరించగలిగే స్థాయికి ఈ పరికరాలు చేరుకుంటున్నాయి. న్యూరాలింక్ కేవలం వ్యాధిగ్రస్తులకు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో ఆరోగ్యవంతులకు కూడా మెరుగైన విజ్ఞాన పరిజ్ఞానం అందించగలుగుతుందన్న అంచనాలు ఉన్నాయి.
మస్క్ చెప్పిన విధంగా, ఈ సాంకేతికత దృష్టి లోపం, పక్షవాతం ఉన్నవారికే కాదు, మెరుగైన సమాచారాన్ని అందించేందుకు, మనిషి-యంత్రాల మధ్య వాస్తవ అనుసంధానం సాధ్యపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆశిస్తున్నారు. పుట్టుకతో అంధులైన వారికి బ్లైండ్‌సైట్ పరికరం ఒక కొత్త ప్రపంచాన్ని చూపించే రోజులు సమీపంలోనే ఉన్నాయని చెప్పవచ్చు.
Featured Articles Movie News Telugu Movies
Pushpa 2: ‘పుష్ప 2’ క్రౌడ్‌పై సిద్ధార్థ్ సంచలన కామెంట్స్.. ‘క్వార్టర్, బిర్యానీ ఇస్తే ఎవరైనా వస్తారు’