అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2024 సేల్ తేదీలు తాజాగా అమెజాన్ ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభమవుతుందని అధికారికంగా వెల్లడించింది. అయితే ఈ సేల్ ఎప్పుడు ముగుస్తుందన్న విషయం మాత్రం చెప్పలేదు. ఈ సేల్‌లో భాగంగా అనేక స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఉంటాయని అమెజాన్ తెలిపింది. రియల్మీ, వన్‌ప్లస్, పోకో,శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు తగ్గింపు ధరలతో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
అమెజాన్ వెబ్సైట్లో ల్యాండింగ్ పేజీ ప్రకారం… 5G స్మార్ట్ ఫొన్లు అతి తక్కువ ధరకే రూ.8999కే ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. కిచెన్వెర్ మీద 70శాతం వరకు డిస్కౌంట్ లభించనుండగా, హోమ్ డెకరేషన్ వస్తువులపై 50% డిస్కౌంట్ అయితే పొందవచ్చు. ఇక క్లాతింగ్, బ్యూటీ ఉత్తత్తులపై 50-80శాతం వరకు డిస్కౌంట్ లభించనున్నట్లు అమెజాన్ ధృవీకరించింది. డైలీ నీడ్ ఉత్పత్తులైన ప్యాంపర్స్, వాషింగ్ మిషిన్ లిక్విడ్స్, ప్రొటిన్ పౌడర్స్ 70 శాతం వరకు డిస్కౌంట్స్ లభిస్తాయి. హెల్త్ హౌజ్ హోల్డ్ ప్రొడక్ట్స్‌పై 50శాతం వరకు డిస్కౌంట్స్ ఉండగా, ఫుడ్ & బేవరేజ్ ఉత్పత్తులపై 70% వరకు డిస్కౌంట్స్ అయితే అందుబాటులో ఉండనున్నాయి.
అలాగే అమెజాన్ ఫ్రెష్ ప్రొడక్ట్స్‌పై 50శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. వంట సామాగ్రిపై 40 శాతం వరకు, హౌస్ హోల్డ్ క్లీనింగ్ ఉత్పత్తులపై 30 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది.
వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 12R, వన్‌ప్లస్ 11R, వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్, వన్‌ప్లస్ నార్డ్ CE 4, రియల్‌మి GT 6T, నార్జో 70 ప్రో వంటి మోడళ్లపై గొప్ప తగ్గింపులు లభిస్తాయి. అలాగే, ఐకూ 12, ఐకూ నియో 9 ప్రో, ఐకూ Z9 లైట్, ఐకూ Z9, ఐకూ Z9s ప్రో వంటి ఐకూ మోడళ్లను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఇంకా, శామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ M15, షియోమీ వంటి స్మార్ట్ఫోన్లపై కూడా ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఒప్పో, వివో, హానర్, టెక్నో వంటి ఇతర బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా గొప్ప డిస్కౌంట్లు ఉంటాయి. స్మార్ట్‌ఫోన్ విడిభాగాలపై 80 శాతం తగ్గింపు, ల్యాప్‌టాప్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. కేవలం ₹6,999 నుంచే స్మార్ట్ టీవీలు కొనుగోలు చేయవచ్చు. వాషింగ్ మెషిన్లపై 60 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, సెమీ ఆటోమేటిక్ మోడళ్లు అందుబాటులో ఉంటాయి. రిఫ్రిజిరేటర్లపై 55 శాతం తగ్గింపుతో సింగిల్ డోర్, డబుల్ డోర్, సైడ్ బై సైడ్ డోర్ మోడళ్లు అందుబాటులో ఉంటాయి.
ఎయిర్ కండిషనర్లపై 55 శాతం వరకు తగ్గింపులు ఉంటాయి. ఈ సేల్‌లో స్ప్లిట్, విండో, ఇన్వర్టర్ AC మోడళ్లు అందుబాటులో ఉంటాయి.
ఇక స్మార్ట్‌వాచ్‌లు కేవలం ₹799 నుండే ప్రారంభం కానున్నాయి, హెడ్‌ఫోన్స్ ₹699 నుండి అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ఉత్తత్తులపైన ఎకో స్పీకర్లు, ఫైర్ టీవీ స్టిక్స్ వంటి ఉత్పత్తులు ₹1,999 నుండి అందుబాటులో ఉంటాయి.
SBI బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేసినప్పుడు 10 శాతం తక్షణ తగ్గింపు పొందవచ్చు.
ఇక ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ సెప్టెంబర్ 27 నుండి ప్రారంభమవుతోంది. ప్లస్ మెంబర్లకు 26నుంచే సేల్ లభ్యమవుతుంది. HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డులతో కొనుగోలు చేసినప్పుడు అదనంగా డిస్కౌంట్లు పొందవచ్చు.
Product Category | Discount/Offer |
Smartphone Accessories | Up to 80% off |
Laptops | Up to 40% off |
Smart TVs | Starting at ₹6,999 |
Washing Machines | Up to 60% off |
Refrigerators | Up to 55% off |
Air Conditioners | Up to 55% off |
Smartwatches | Starting from ₹799 |
Headphones | Starting from ₹699 |
Amazon Devices | Starting from ₹1,999 |
SBI Bank Cards | 10% Instant Discount |
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?