• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Allu Arjun Arrest: అల్లు అర్జున్‌ అరెస్ట్‌పై YS జగన్ ఫస్ట్ రియాక్షన్ ఇదే!

    ‘పుష్ప 2’ ప్రీమియర్స్‌ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట కేసుకు సంబంధించి హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్‌ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బన్నీ అరెస్టును ఖండిస్తూ టాలీవుడ్‌ సెలబ్రిటీలు, దర్శక నిర్మాతలు, రాజకీయ నాయకులు ఏకమయ్యారు. మెగాస్టార్‌ చిరంజీవి తన మేనల్లుడు కోసం రంగంలోకి దిగారు. మరోవైపు బన్నీ అరెస్టును BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, ఆ పార్టీ ముఖ్య నేత హరీష్ రావు సైతం ఖండించంతో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడంతో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    తీవ్రంగా స్పందించిన జగన్

    అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్ట్‌ చేయడంపై వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఆయన తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. “హైదరాబాద్‌ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్‌ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు. అల్లు అర్జున్‌ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను” అని విచారం వ్యక్తం చేశారు.

    రెవంత్ రెడ్డి బ్రదర్స్‌ను అరెస్ట్‌ చేయాలి: హరీష్ రావు

    జాతీయ అవార్డు విజేత @alluarjun అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం.
    దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవలసింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైనే. రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధింపుల వల్లే చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాసి సిఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ బ్రదర్స్ ని ఎందుకు అరెస్టులు చేయరు? రేషన్ కార్డు నిబంధనల వల్లే, రుణమాఫీ కాక ఆత్మహత్య చేసుకుంటున్నా అని సూసైడ్ లెటర్ రాసి మేడ్చల్ వ్యవసాయ కార్యాలయం వద్ద సురేందర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకుంటే కారకుడైన రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయరు? అరెస్టు చేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి సోదరులను అరెస్టు చేయాలి. ఏడాది పాలనలో రైతులను బలిగొన్నందుకు ఎవరిని అరెస్టు చేయాలి?
    ఫుడ్ పాయిజన్లతో 49 మంది విద్యార్థులు చనిపోయారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలిఫార్మా సిటీ పేరుతో లగచర్ల గిరిజన బతుకులను ఛిద్రం చేశారు. దీనికి ఎవరిని అరెస్టు చేయాలి? చట్టం అల్లు అర్జున్ విషయంలోనే కాదు ఎనుముల రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ విషయంలోనూ స్పందించాలి. చట్టం ఎవ్వరికీ చుట్టం కాకూడదు

    అంబటి రాంబాబు స్పందన

    అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. బెనిఫిట్ షోలో జరిగిన దుర్ఘటనకు ఒక్కరిని బాధ్యున్ని చేయడం సరికాదని పోలీసులను తప్పుబట్టారు.

    ఇదే అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తొక్కిసలాటలో మహిళ మృతి బాధాకరం, ఈ దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

    బన్నీ నివాసానికి మెగా బ్రదర్స్‌

    బన్నీ అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తన భార్య సురేఖతో కలిసి అల్లు అర్జున్‌ నివాసానికి వెళ్లారు. అటు సోదరుడు నాగబాబు కూడా చిరంజీవి వెళ్లిన కొద్దిసేపటి తర్వాత బన్నీ నివాసానికి చేరుకున్నారు. బన్నీ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను తోడుగా ఉన్నామని మెగా బ్రదర్స్‌ అల్లు ఫ్యామిలీకి భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.

    బన్నీ కోసం చిరంజీవి.. 

    అల్లు అర్జున్‌ (Allu Arjun Arrest) అరెస్టు నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రంగంలోకి దిగారు. ‘విశ్వంభర’ (Viswambhara) షూటింగ్‌ను ఆయన ఉన్నపళంగా క్యాన్సిల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. బన్నీని అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు మరికొద్దిసేపట్లో మెగాస్టార్‌ చిరంజీవి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అగ్రనిర్మాత దిల్‌ రాజు, మరికొందరు డైరెక్టర్స్‌తో కలిసి ఇప్పటికే పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అల్లు అర్జున్‌ తండ్రి అల్లు అరవింద్‌తో పాటు సోదరుడు అల్లు శిరీష్‌ కూడా ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం బన్నీని కోర్టులో హాజరు పరిచే అవకాశముంది. 

    బన్నీ అరెస్టుపై కేటీఆర్‌ ఫైర్‌.. 

    అల్లు అర్జున్‌ (Allu Arjun) అరెస్టుపై భారస నేత, మాజీ మంత్రి కేటీఆర్‌ (KTR) ఫైర్‌ అయ్యారు. జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని విమర్శించారు. ‘తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది. కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్‌ లాంటి వ్యక్తిని సాధారణ నేరస్థుడిగా భావించి ఇలా చేయెుద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. హైడ్రా వల్ల చనిపోయినవారి కేసులో రేవంత్‌ను కూాడా అరెస్టు చేయాలి’ అంటూ ఎక్స్‌లో కేటీఆర్‌ రాసుకొచ్చారు. 

    అరెస్టుపై సీఎం రియాక్షన్‌ ఇదే.. 

    అల్లు అర్జున్‌ అరెస్టు (Allu Arjun Arrest)పై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే అని ఆయన స్పష్టంం చేశారు. ఇందులో తన జోక్యం ఏమీ ఉండదని రేవంత్‌ తేల్చి చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పకొచ్చారు. 

    హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌

    అరెస్టు నేపథ్యంలో హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును ఆశ్రయించారు. బన్నీ తరపున అతడి లాయర్లు న్యాయస్థానంలో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. లంచ్‌ మోషన్‌ కింద తమ పిటిషన్‌ స్వీకరించి బన్నీ అరెస్టును సోమవారం వరకూ వాయిదా వేయాలని కోర్టును కోరారు. మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్‌పై హైకోర్టు  ధర్మాసనం విచారించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు వైద్య పరీక్షల అనంతరం అల్లు అర్జున్‌ను స్థానిక కోర్టులో  చిక్కడపల్లి పోలీసులు హాజరు పరిచే అవకాశముంది. ఈలోపు హైకోర్టు ధర్మాసనం తీర్పు వస్తే దాని ప్రభావం పోలీసులపై పడొచ్చు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv