• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vishal: సరిగా మాట్లాడలేని స్థితిలో విశాల్‌.. అనారోగ్యానికి కారణమిదే?

    తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించిన తమిళ నటుల్లో హీరో విశాల్‌ (Vishal) ఒకరి. కోలీవుడ్‌లో ఆయన తీసిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యి మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘పందెం కోడి’, ‘పొగరు’, ‘భరణి’, ‘పూజ’, ‘అభిమన్యుడు’, ‘డిటెక్టివ్’ తదితర చిత్రాలతో విశాల్‌ తెలుగు ఆడియన్స్‌ను విశేషంగా అలరించారు. గతేడాది ‘రత్నం’ (తమిళంలో రత్తం) సినిమాతో తెలుగు ఆడియన్స్‌ పలకరించారు. ఆ తర్వాత పెద్దగా బయట కనిపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా విశాల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన గుర్తుపట్టలేనంతగా బాగా సన్నగా మారిపోయారు. వణికిపోతూ కనిపించారు. దీంతోో ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. 

    వణుకుతున్న చేతులతో.. 

    చెన్నైలో ఆదివారం (జనవరి 5) జరిగిన ‘మదగజ రాజ’ (Madha Gaja Raja) ప్రీ రిలీజ్ ఈవెంట్​కు విశాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాల్ బాగా సన్నగా కనిపించారు. అసిస్టెంట్‌ సాయంతో చాలా నెమ్మదిగా స్టేజీపైకి వెళ్లారు. అనంతరం మైక్‌లో మాట్లాడే సమయంలో విశాల్‌ చేతులు వణికిపోయాయి. మాటల కూడా తడబడ్డాయి. చాలా నెమ్మదిగా ఎంతో ఇబ్బంది పడుతూ విశాల్‌ మాట్లాడారు. స్టేజీపైన కూర్చునే సమయంలోనూ ‘బిచ్చగాడు’ నటుడు విజయ్ ఆంటోనీ ఆయనకు సపోర్ట్ ఇచ్చారు. ఎప్పుడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండే విశాల్‌ను ఒక్కసారిగా ఇలా చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం విశాల్‌కు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. 

    అనారోగ్యానికి కారణం ఏంటీ?

    తమ అభిమాన హీరో విశాల్‌ (Vishal).. అలా వణికిపోతుండటాన్ని చూసి ఫ్యాన్స్ చలించిపోతున్నారు. ఆయనకు ఏమైందని తెగ ఆరా తీస్తున్నారు. అయితే విశాల్‌ ప్రస్తుతం హై ఫీవర్‌తో బాధపడుతున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ‘మదగజ రాజ’ చిత్రం 12 ఏళ్ల తర్వాత రిలీజ్‌ అవుతుండటంతో ఆయన హాజరు తప్పనిసరి అయ్యిందని సమాచారం. ఆరోగ్యం సహకరించకపోయిన విశాల్‌ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చారని తెలుస్తోంది. అయితే ఎంత ఫీవర్ ఉన్నా ఈ స్థాయిలో చేతులు వణకడంపై ఫ్యాన్స్‌ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనిషి బాగా తగ్గిపోయిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. నిజంగానే జ్వరమా? లేదా ఇంకేమైనా కారణం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. 

    త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు..

    సమస్య ఏదైనా నటుడు విశాల్‌ (Vishal) త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. సినీ సమస్యలపై ఎంతో ధైర్యంగా మాట్లాడే విశాల్‌ను ఇలా చూడటం బాధగా ఉందని పోస్టులు పడుతున్నారు. జ్వరంతో ఉండి కూడా తన సినిమా ప్రమోషన్‌కు రావడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాపై ఆయనకున్న నిబద్ధత మరోమారు రుజువైందని చెబుతున్నారు. మునుపటిలా విశాల్‌ ఆరోగ్యంగా ఉండేలా చేయమని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. 

    సంక్రాంతి బరిలో విశాల్‌..!

    విశాల్‌ నటించిన తాజా చిత్రం ‘మదగజ రాజ’ (Madha Gaja Raja) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12న తమిళనాట ఈ సినిమా విడుదల కానుంది. సుందర్‌ సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2013లోనే షూటింగ్‌ను కంప్లీట్‌ చేసుకుంది. ఇందులో అంజలి, వరలక్ష్మీ శరత్‌ కుమార్ కథానాయికలుగా చేశారు. కమెడియన్‌ సంతానం కీలక పాత్ర పోషించారు. బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఆంటోనీ సంగీతం సమకూర్చారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv