• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమేజాన్ ప్రైమ్‌లో ‘మార్క్ ఆంటోనీ’

    కోలీవుడ్ హీరో విశాల్ నటించిన ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజైన ‘మార్క్ ఆంటోనీ’ మంచి విజయం సాధించి విశాల్ కెరీర్‌లో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో విశాల్‌తో పాటు డెరెక్టర్ ఎస్‌జే సూర్య నటించాడు.

    ఓటీటీలోకి మార్క్ ఆంటోని సినిమా

    తమిళ్ స్టార్ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. SJ సూర్య విలక్షణ పాత్రలో నటించాడు. డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ‘మార్క్ అంథోని’ని తెరకెక్కించారు. తమిళ్‌లో భారీ వసూళ్లు సాధించింది ఈ సినిమా. విశాల్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది.

    ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ

    విశాల్, ఎస్‌జే సూర్య కాంబోలో వచ్చిన సినిమా మార్క్‌ ఆంటోని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షుకలు తమ అభిప్రాయలను ట్వీట్ చేస్తున్నారు. సినిమాలో ఎస్‌జే సూర్య కామెడీ టైమింగ్ అదిరింది. విశాల్ యాక్షన్‌ పార్ట్‌లో అద్భుతంగా నటించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండాఫ్ సీన్లు ఆకట్టుకుంటాయి. రూ.100 కోట్లు కొల్లగొడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పూర్తి రివ్యూ మరికాసేపట్లో #MarkAntony review First half interesting ?Second half verithanam ?Screenplay?Music?Vishal ?SJ.Suryah … Read more

    వినూత్నంగా ‘మార్క్ ఆంథోని’ ట్రైలర్!

    కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించిన ‘మార్క్ ఆంథోని’ సినిమా ట్రైలర్‌ను మూవీ మేకర్స్ లాంఛ్ చేశారు. ట్రైలర్‌ను బట్టి చూస్తే టైమ్ ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ మూవీపై ప్రస్తుతం విడుదలైన ఈ టీజర్ అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో విశాల్ డ్యూయెల్ రోల్ పోషించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీని అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు.

    చావు తప్పించుకున్న హీరో విశాల్‌

    [VIDEO](url):హీరో విశాల్‌ త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన హీరోగా దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్ దర్శకత్వంలో ‘మార్క్‌ ఆంటోని’ ఓ సినిమా షూటింగ్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. సీన్‌లో భాగంగా విశాల్‌ నేలపై పడిపోగా అదే సమయంలో ఓ భారీ ట్రక్కు దూసుకొచ్చింది. సాంకేతిక లోపం కారణంగా తలెత్తిన ఈ ప్రమాదం నుంచి విశాల్‌ రెప్పపాటులో బయటపడ్డారు. కొన్ని ఇంచుల దూరంలో చావును చూశా అంటూ విశాల్‌ ప్రమాదపు వీడియోను షేర్‌ చేశారు. … Read more