• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Kannappa: ‘ముఖాన బొట్టు.. చేతులకి పారాణీ ఏదీ’.. కాజల్‌పై భారీగా ట్రోల్స్‌!

    తెలుగు హీరో మంచు విష్ణు (Manchu Vishnu) ప్రస్తుతం తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘కన్నప్ప‘ (Kannappa)లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ముకేష్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్న ఈ భారీ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 24 ఫ్రేమ్స్‌ బ్యానర్స్‌పై మంచు మోహన్‌ బాబు నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 25న ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉంటే గత కొన్నిరోజులుగా ఇందులో నటిస్తున్న స్టార్‌ నటీనటుల పాత్రలను ఒక్కొక్కటిగా రివీల్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా కాజల్‌కు సంబంధించిన పార్వతి దేవి పోస్టర్‌ను మూవీ టీమ్‌ విడుదల చేసింది. అయితే ఆ లుక్‌ను నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.

    పార్వతి దేవిగా కాజల్‌..

    కన్నప్ప చిత్రానికి సంబంధించి ప్రతీ సోమవారం ఓ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేస్తామని మూవీ టీమ్‌ గతంలోనే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ప్రతీ వారం కొత్త పాత్రను పరిచయం చేస్తోంది. ఈ క్రమంలోనే కాజల్‌ పోషిస్తున్న పార్వతి దేవి రోల్‌కు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం సోమవారం (జనవరి 6) విడుదల చేసింది. ‘ముల్లోకాలు ఏలే తల్లి. భక్తుల్ని ఆదుకునే త్రిశక్తి. శ్రీకాళహస్తిలో వెలసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక’ అంటూ మూవీ టీమ్‌ పోస్టర్‌పై రాసుకొచ్చింది. కాగా కాజల్‌ ఈ పోస్టర్‌ను షేర్‌ చేస్తూ ‘నా కల నిజమైంది. దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

    ట్రోల్స్ ఎందుకంటే..

    పార్వతి దేవిగా కాజల్‌ కనిపించిన పోస్టర్‌ను పలువురు మెచ్చుకుంటుంటే మరికొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు. కాజల్‌ అసలు దేవతామూర్తిగానే లేదంటూ విమర్శిస్తున్నారు. నుదుటిన బొట్టు, చేతికి పారాణి ఎక్కడంటూ విమర్శిస్తున్నారు. ‘మెడలో ఉన్న నక్లెస్‌ వంకరగా ఉంది.. చెక్‌ చేసుకోలేదా?’ అని సెటైర్లు చేస్తున్నారు. ఆ పోస్టర్‌లో కాజల్ పార్వతి దేవిలా లేదని.. ఏదో జ్యూయలరీ యాడ్‌లాగా అనిపించిందని అంటున్నారు. మరికొందరు ఇది ఏఐ జనరేటేడ్‌ పోస్టర్‌లా ఉందంటున్నారు. పోస్టర్‌ డిజైనింగ్‌ క్వాలిటీ కూడా అసలు బాలేదని చెబుతున్నారు. జూమ్‌ చేసి చూస్తే ఒక కన్ను చిన్నదిగా, మరో కన్ను పెద్దదిగా ఉందని పోస్టులు పెడుతున్నారు. కాజల్‌పై వస్తోన్న ట్రోల్స్‌తో ఆమె పేరు నెట్టింట ట్రెండింగ్‌గా మారింది. 

    ప్రభాస్‌ స్పెషల్‌ రోల్‌..

    మంచు ఫ్యామిలీ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ‘కన్నప్ప’లో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీకి చెందిన మోహన్‌లాల్‌ సైతం కిరాట అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఆ పాత్రను గత సోమవారం రివీల్‌ చేయడం గమనార్హం. అటు మంచు మోహన్‌బాబు సైతం మహాదేవ శాస్త్రి అనే రోల్‌ పోషిస్తున్నారు. వీరితో పాటు మధుబాల, ప్రీతి ముకుందన్‌, మంచు విష్ణు కూతుర్లు అరియానా – వివియానా, బ్రహ్మానందం, సప్తగిరి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే ఆయా పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను మూవీ టీమ్‌ విడుదల చేసింది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv