• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్‌ చురకలు?

    గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) రూపొందించిన తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలవుతున్న ఈ చిత్రంపై సినీ లవర్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కియారా అద్వానీ (Kiara Advani) చేసింది. అంజలి, ఎస్‌.జె. సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌ కీలకపాత్రలు పోషించారు. ఇదిలా ఉంటే ఏపీలోని రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

    బన్నీకి పవన్‌ చురకలు!

    ‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్‌ (Allu Arjun)కు పరోక్షంగా చురకలు అంటించారు. ‘మేము మూలాలు మర్చిపోకూడదు. పవన్‌ కల్యాణ్‌ ఉన్నా.. రామ్‌చరణ్ ఉన్నా.. ఏ హీరోలు ఉన్నా గానీ దానికి మూలం మెగాస్టార్‌ చిరంజీవి గారు. మీరు ఈ రోజు కల్యాణ్‌ బాబు అనండి.. ఓజీ అనండి.. డిప్యూటీ సీఎం అనండి.. ఏది అన్న కూాడా ఆయనే ఆద్యులు (చిరంజీవి). నేను మూలాలు మర్చిపోను’ అంటూ చెప్పుకొచ్చారు. 

    ఏకైక గేమ్‌ ఛేంజర్‌ పవన్‌ కల్యాణ్‌: చరణ్‌

    ‘గేమ్‌ ఛేంజర్’ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌ మాట్లాడుతూ రాజమండ్రి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ‘గేమ్‌ ఛేంజర్‌ టైటిల్‌ శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. కానీ నిజ జీవితంలో గేమ్‌ ఛేంజర్‌ ఎవరో అందరికీ తెలుసు. కేవలం ఏపీలోనే కాదు ఇండియన్‌ పాలిటిక్స్‌కు ఉన్న ఏకైక గేమ్‌ ఛేంజర్‌ ఇవాళ పవన్‌ కల్యాణ్‌ గారు. అలాంటి ఆయన పక్కన నేను నిలబడటం చాలా అదృష్టం’ అని చరణ్‌ చెప్పుకొచ్చారు. 

    పవన్‌కు థ్యాంక్స్‌: దిల్‌రాజు

    ‘గేమ్ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నిర్మాత దిల్‌ రాజు మాట్లాడారు. ‘గేమ్‌ ఛేంజర్‌ కథ ప్రస్తుత సమాజానికి అద్ధం పడుతుంది. రామ్‌చరణ్‌ నటన నేషనల్‌ అవార్డు వచ్చే లెవల్లో ఉంటుంది. ఈ సినిమా సంక్రాంతికి అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మేము అడగ్గానే సమయాన్ని కేటాయించినందుకు పవన్‌ గారికి స్పెషల్ థ్యాంక్స్‌. టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో ఇచ్చినందుకు నా ధన్యవాదాలు’ అంటూ దిల్‌రాజు చెప్పుకొచ్చారు. 

    రెండు కొత్త సాంగ్స్ రిలీజ్‌.. 

    ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్ తమన్‌.. మెగా ఫ్యాన్స్‌కు గ్రాండ్ ట్రీట్ ఇచ్చారు. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు కొత్త పాటలను విడుదల చేశారు. ఈ సందర్భంగా థమన్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పొలిటికల్‌ గేమ్ ఛేంజర్‌ పవన్‌ కల్యాణ్‌, సినిమా గేమ్‌ ఛేంజర్‌ రామ్‌చరణ్‌ సమక్షంలో ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ వ్యాఖ్యానించారు. 

    చరణ్‌పై అంజలి కామెంట్స్‌..

    ‘గేమ్‌ ఛేంజర్‌’లో హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషించింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముందుగా పవన్‌ గురించి మాట్లాడుతూ.. ‘మీపైనా నాకు చాలా గౌరవముంది. మీతో వకీల్‌సాబ్‌లో నటించారు. మీ గ్రోత్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరింది. ఇలాగే మరిన్ని విజయాలు సాధించాలి’ అని పేర్కొంది. అలాగే చరణ్‌ గురించి ప్రస్తావిస్తూ ‘ఎలాంటి కోస్టార్స్‌తో చేస్తే కంఫర్టబుల్‌గా ఫీలవుతామో అలాంటి యాక్టర్ చరణ్‌. మీతో వర్క్‌ చేయడం అద్భుతంగా ఉంది. మీతో మరిన్ని చిత్రాలు చేయాలి’ అని అంజలి చెప్పుకొచ్చింది. 

    నేషనల్‌ అవార్డు పక్కా..

    ఏపీలోని రాజమండ్రిలో ఏర్పాటు చేసిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు భారీగా మెగా అభిమానులు తరలివచ్చారు. ముందుగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ సినిమాపై భారీగా అంచనాలు పెంచేశారు. ‘గేమ్ ఛేంజర్‌తో రామ్‌చరణ్‌కు నేషనల్‌ అవార్డ్‌ పక్కా. అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న క్యారెక్టరైజేషన్‌ ఆయనది. సీన్లు బాగా వచ్చాయి. ఎస్‌.జే సూర్య పక్కన కనిపించే పొలిటిషియన్ పాత్ర చేశా. తమిళంలోనూ నేనే డబ్బింగ్ చెప్పా’ అంటూ చెప్పుకొచ్చారు. 

    ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

    ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టికెట్‌ ధరల పెంపుతో పాటు, (Game Changer Ticket Rates) బెనిఫిట్‌ షోలకూ అనుమతి ఇచ్చింది. అర్ధరాత్రి 1గంట ప్రీమియర్‌ షో టికెట్‌ ధరను రూ.600 (పన్నులతో కలిపి) నిర్ణయించారు. అలాగే, జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకూ అనుమతి ఇచ్చారు. మల్లీప్లెక్స్‌లో అదనంగా రూ.175 (జీఎస్టీతో కలిపి), సింగిల్ థియేటర్లలో రూ.135 (జీఎస్టీతో కలిపి) వరకూ టికెట్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. జనవరి 11 తేదీ నుంచి 23 తేదీ వరకూ ఇవే ధరలతో ఐదు షోలకే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv