దర్శకుడు పూరి జగన్నాథ్ తన తాజా ‘పూరి మ్యూజింగ్స్’ వీడియోలో ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు. ఈసారి ఆయన ప్రాధాన్యం కలిగిన ‘ఆటోఫజీ’ అనే ప్రక్రియపై తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎలా పనిచేస్తుందనే దానిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు.
ఆటోఫజీ అంటే ఏమిటి?
‘‘ఆటోఫజీ’’ అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. ఇందులో ఆటో అంటే స్వయం, ఫజీ అంటే తినడం అని అర్థం. దీన్ని స్వీయాహారం లేదా సెల్ఫ్ ఈటింగ్ అని అంటారు. పూరి వివరించనుసారంగా, ఇది శరీరంలో జరిగే సహజమైన రీసైక్లింగ్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో శరీరం తనలోని పనికిరాని, దెబ్బతిన్న కణాలను తినేసి, అవి శక్తిగా మారతాయి. అంతేకాదు, శరీరంలో హానికరమైన పదార్థాలను బయటకు పంపించి, ఆరోగ్యకరమైన కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.
ఆటోఫజీ ప్రయోజనాలు
- మెటబాలిజం పెరుగుతుంది – శరీరం శక్తివంతంగా మారి, మరింత పనిచేస్తుంది.
- వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి – చర్మం కాంతివంతంగా ఉంటుంది.
- క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది – హానికరమైన కణాలను తొలగించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని అందిస్తుంది.
- ఇమ్యూనిటీ మెరుగుపడుతుంది – రోగ నిరోధక శక్తి పెరిగి శరీరాన్ని రక్షిస్తుంది.
- శరీరం స్వయంగా హీలింగ్ అవుతుంది – దెబ్బతిన్న టిష్యులను రిపేర్ చేస్తుంది.
ఆటోఫజీ ఎప్పుడు యాక్టివేట్ అవుతుంది?
పూరి జగన్నాథ్ ఈ ప్రక్రియను యాక్టివేట్ చేయడానికి ఉపవాసం, వ్యాయామం, చన్నీటి స్నానాలు ముఖ్యమని చెప్పారు.
- ఉపవాసం
– పెద్దలు ప్రతినెలా ఉపవాసం చేయమని చెప్పిన పద్ధతి వెనుక ఉన్న విజ్ఞానం ఇది.
– అప్పుడప్పుడు ఆహారం తీసుకోకుండా ఉండడం వల్ల శరీరం పనికిరాని కణాలను తొలగిస్తుంది. - వ్యాయామం
– రోజూ వ్యాయామం చేయడం ద్వారా శరీరం మునుపటి కంటే ఆరోగ్యకరంగా మారుతుంది. - చన్నీటి స్నానాలు
– హీట్ అండ్ కోల్డ్ థెరపీ ద్వారా శరీరం పునరుత్తేజం అవుతుంది.
ఆటోఫజీని కనుగొన్న శాస్త్రవేత్త
జపాన్‌కు చెందిన యష్నోరి ఓసుమి అనే శాస్త్రవేత్త ఈ ఆటోఫజీ ప్రక్రియను గమనించి, దీని ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఈ పరిశోధనకు అతడికి నోబెల్ ప్రైజ్ లభించింది.
జీవితాన్ని మార్చే ప్రయోజనాలు
పూరి మాట్లాడుతూ, ఈ ఆరోగ్యకరమైన ప్రక్రియ మన జీవితాలను ఎలా మారుస్తుందో వివరించారు. ఉపవాసం, వ్యాయామం, చన్నీటి స్నానాలు వంటి ప్రాచీన పద్ధతులను అనుసరిస్తే, ఆరోగ్యం మెరుగుపడి, జీవితకాలం పెరుగుతుందని తెలిపారు.
Celebrities Featured Articles Movie News
Niharika Konidela: ‘ప్రాణం పోవడం పెద్ద విషయం’.. బన్నీపై నిహారిక షాకింగ్ కామెంట్స్!