సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకునేందుకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. సొంతూళ్లకు టికెట్లు బుక్ చేసుకునే పనిలో తెలుగు ప్రజలు బిజీగా ఉన్నారు. మరోవైపు ఎప్పటిలాగే ఈ సంక్రాంతిని మరింత వినోదాత్మకంగా మార్చేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సిద్ధమైంది. ప్రేక్షకులను అలరించేందుకు పలువురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచారు. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు..
గేమ్ ఛేంజర్ (Game Changer)
రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అన్నిటికంటే ముందుగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటించింది. అంజలి, శ్రీకాంత్, ఎస్.జే. సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ.400 కోట్ల బడ్జెట్‌తో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, టీజర్, పాటలు ఆకట్టుకుంటున్నాయి.
డాకూ మహారాజ్ (Daku Maharaj)
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకూ మహారాజ్‘ ఈ సంక్రాంతికి వినోదాన్ని పంచనుంది. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కానుంది. ఇందులో శ్రద్దా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా చేశారు. బాబీ దేవోల్, చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసేంది. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూర్చారు.
సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam)
ఈ సంక్రాంతికి రాబోతున్న మరో స్టార్ హీరో చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ కుటుంబ కథలో క్రైమ్ కోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాను రూపొందించారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు..
బచ్చలమల్లి (Bachchala Malli)
అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బచ్చలమల్లి‘. ఈ చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 9 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సుబ్బు మంగాదేవి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హనుమాన్ బ్యూటీ అమృతా అయ్యర్ హీరోయిన్‌గా చేసింది. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.
నీలి మేఘ శ్యామ (Neeli Megha Shyama)
విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధా కృష్ణ జంటగా నటించిన చిత్రం ‘నీలి మేఘ శ్యామ’. రవి. S. వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఆహా వేదికగా జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘35 చిన్న కథ కాదు‘లో నటించిన విశ్వదేవ్ రాచకొండ ఇందులో లీడ్ రోల్‌లో నటించడంతో ఈ మూవీపై ఆసక్తి ఏర్పడింది. ‘ఓ ట్రెక్కింగ్ యువకుడి జీవితాన్ని ఏ విధంగా మార్చింది’ అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది.
Title | Category | Language | Platform | Release Date |
Black Warrant | Series | Hindi | Netflix | Jan 10 |
Legend of Fluffy | Comedy Show | English | Netflix | Jan 07 |
Jerry Springer | Documentary | English | Netflix | Jan 07 |
The unshop 6 | Series | English | Netflix | Jan 09 |
Goos Bumps | Series | English | Netflix | Jan 10 |
Sabarmati Report | Movie | Hindi | Zee5 | Jan 10 |
Roadies Double Cross | Reality Show | English | Jio Cinema | Jan 11 |
Focus | Movie | English | Amazon | Jan 10 |
Shark Tank India 4 | Reality Show | Hindi | SonyLIV | Jan 06 |
Celebrities Featured Articles Telugu Movies
Chiranjeevi: ‘టాలెంట్ ఒక్కటే సరిపోదు.. ప్రవర్తన ముఖ్యం’.. బన్నీకి చిరు ఇండైరెక్ట్ పంచ్!