

అల్లరి నరేష్
జననం : జూన్ 30 , 1982
ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం (ప్రస్తుత చెన్నై)
అల్లరి నరేష్ ప్రముఖ డైరెక్టర్ దివంగత ఇ వి వి సత్యనారాయణ రెండవ కుమారుడు. రవి బాబు డైరెక్షన్లో వచ్చిన 'అల్లరి' సినిమాతో సినీరంగప్రవేశం చేశాడు. ఈ సినిమా హిట్ కావడంతో "అల్లరి" పేరునే తన ఇంటిపేరుగా స్థిరపడిపోయింది. అల్లరి నరేష్ కెరీర్లో ఎక్కువగా కామెడీ చిత్రాల్లోనే నటించాడు. ఈతరం రాజేంద్ర ప్రసాద్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం యాక్షన్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నాడు. తెలుగులో 50కి పైగా చిత్రాల్లో నటించాడు. గమ్యం చిత్రంలో గాలి శీను, శంభో శివ శంభో సినిమాలో మల్లి పాత్ర నరేష్ నటనా ప్రతిభకు మచ్చుతునకలు. జూనియర్స్, నేను, డేంజర్, కితకితలు, సీమశాస్త్రి, బెండు అప్పారావు R.M.P., బ్లేడ్ బాబ్జీ, మహర్షి, లడ్డుబాబు, నాంది, ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం, నా సామి రంగ వంటి చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. తన విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు.
అల్లరి నరేష్ వయసు ఎంత?
అల్లరి నరేష్ వయసు 42 సంవత్సరాలు
అల్లరి నరేష్ ముద్దు పేరు ఏంటి?
సెడన్ స్టార్, కామెడీ కింగ్
అల్లరి నరేష్ ఎత్తు ఎంత?
6' 2'' (188cm)
అల్లరి నరేష్ అభిరుచులు ఏంటి?
క్రికెట్ ఆడటం, మ్యూజిక్ వినడం
అల్లరి నరేష్ ఏం చదువుకున్నారు?
బీకాం
అల్లరి నరేష్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
చెట్టినాడ్ విద్యాశ్రమం, చెన్నై
అల్లరి నరేష్ రిలేషన్లో ఉంది ఎవరు?
దీక్షా పంత్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌తో డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి. వీరిద్దరు కలిసి కొన్ని వీడియో అల్బమ్స్ చేశారు.
అల్లరి నరేష్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
2024 వరకు 54 సినిమాల్లో నటించాడు.
అల్లరి నరేష్ Childhood Images
అల్లరి నరేష్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
- Mufasa Collections: ‘ముఫాసా’, ‘యూఐ’ తొలి రోజు కలెక్షన్స్.. టాప్ ఏదంటే?క్రిస్మస్ కానుకగా ఈ వారం నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విడుదలయ్యాయి. హాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ డిస్నీ (Disney) నిర్మించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ శుక్రవారం (డిసెంబర్ 20) గ్రాండ్‌గా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో రూపొందిన ‘యూఐ’ విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకుంది. వీటితో పాటు తెలుగులో అల్లరి నరేష్ నటించిన బచ్చలమల్లి, తమిళ నటుడు విజయ్ సేతుపతి నటించిన ‘విడుదల 2’ కూడా రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. మరి ఈ చిత్రాల తొలి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కలెక్షన్స్ పరంగా ఏ సినిమా టాప్‌లో ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం. ‘ముఫాసా’ డే 1 కలెక్షన్స్.. ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King) లైవ్ యానిమేషన్ చిత్రంగా రూపొందింది. ఈ మూవీ తెలుగు వెర్షన్‌కు సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) డబ్బింగ్ చెప్పాడు. మహేష్ వాయిస్ ఓవర్‌తో పంచ్‌లు, ప్రాసలు అదిరిపోయాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇండియాలో తొలి రోజు కలెక్షన్స్ విషయాన్ని వస్తే ఈ చిత్రం రూ.10 కోట్ల గ్రాస్ (Mufasa: The Lion King Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఇంగ్లీషు వెర్షన్లో రూ.4 కోట్లు, హిందీలో రూ.3 కోట్లు, తెలుగులో రూ.2 కోట్లు, తమిళంలో రూ.కోటి గ్రాస్ తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో ఈ మూవీ కలెక్షన్స్ అమాంతం పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. క్రిస్మస్ సెలవులు కూడా ఉండటంతో మంచి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి. కాగా, తొలి వీకెండ్లో ‘ముఫాసా’ వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం 180 మిలియన్ డాలర్లు (రూ.1529 కోట్లు) వసూలు చేస్తుందని హాలీవుడ్ వర్గాలు అంచనా వేశాయి. ‘యూఐ’ కలెక్షన్స్ ఎంతంటే ఉపేంద్ర (Upendra) హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైంటిఫిక్ థ్రిల్లర్ ‘యూఐ’ (UI) శుక్రవారం పాన్ ఇండియా స్థాయిలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం కనెక్ట్ అయితే పక్కా ఎంటర్టైన్ చేస్తుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం రూ.Rs 6.75 కోట్ల గ్రాస్ (UI Movie Day 1 Collections) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క కర్ణాటకలోనే రూ.6 కోట్లు తన ఖాతాలో వేసుకుందని పేర్కొన్నాయి. తెలుగు బాక్సాఫీస్ వద్ద రూ.70 లక్షలు, తమిళంలో రూ.4 లక్షలు, హిందీ రీజియన్‌లో రూ.లక్ష వసూలు చేసినట్లు తెలిపాయి. యూత్‌లో ఈ సినిమా పెద్ద ఎత్తున అటెన్షన్ రావడంతో వీకెండ్లో ‘యూఐ’ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేశాయి. ‘విడుదల 2’ కలెక్షన్స్.. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ రూపొందించిన ‘విడుదల 2’ (Vidudala 2) చిత్రం డిసెంబర్ 20న రిలీజై యావరేజ్ టాక్ తెచ్చుకుంది. విజయ్ సేతుపతి నటన, వ్యవస్థల లోపాలను దర్శకుడు ఎత్తిచూపిన విధానం బాగుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.9 కోట్ల గ్రాస్ (Vidudala 2 Movie Day 1 Collections) సాధించినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.8 కోట్లు వసూలైనట్లు తెలిపాయి. తెలుగులో రూ.60 లక్షల వరకూ కలెక్షన్స్ వచ్చినట్లు తెలిపాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.3.5 కోట్లు వచ్చి చేరాయని వివరించాయి. మూవీకి వచ్చిన టాక్‌ను బట్టి కలెక్షన్స్ పెరగడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ‘బచ్చల మల్లి’ వసూళ్లు.. అల్లరి నరేష్ (Allari Naresh) మాస్ రోల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే అల్లరి నరేష్ మాస్ పర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటూ ప్రశంసలు వచ్చాయి. ఇదిలా ఉంటే తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.80 లక్షల (Bachchala Malli Day 1 Collections) వరకూ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఇండియా నెట్ కలెక్షన్స్ రూ.60 లక్షల వరకూ ఉండొచ్చని చెప్పాయి. యావరేజ్ టాక్ నేపథ్యంలో వీకెండ్స్‌లో ఈ సినిమా ప్రభావం అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాయి.డిసెంబర్ 21 , 2024
- Bachhala Malli Review: మూర్ఖుడిగా అల్లరి నరేష్ సూపర్బ్.. ‘బచ్చలమల్లి’తో హిట్ కొట్టాడా?నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు కథ, దర్శకత్వం: సుబ్బు మంగదేవి సంగీతం: విశాల్ చంద్రశేఖర్ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్.నాథన్ ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్ నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్ విడుదల తేదీ: డిసెంబర్ 20, 2024 అల్లరి నరేష్ (Allari Naresh) మాస్ రోల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా డిసెంబర్ 20న (Bachhala Malli Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నరేష్ నటన బాగుందా? అతడి ఖాతాలో మరో విజయం పడిందా? ఇప్పుడు తెలుసుకుందాం. కథేంటి కథ 1995 - 2005 మధ్య (Bachhala Malli Review) తుని, సూరవరం ప్రాంతంలో సాగుతుంటుంది. బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పుడు చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి తండ్రి గర్వపడేలా చేస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం మల్లిని ఎంతగానో బాధిస్తుంది. దాంతో చదువుకు స్వస్థి పలికి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ట్రాక్టర్ నడుపుతూ మూర్ఖుడిగా మారిపోతాడు. మద్యం తాగుతూ ఊరిలో ఏదోక గొడవలో తలదూరుస్తూ బేవర్స్‌గా మారిపోతాడు. అప్పుడే అతడి లైఫ్‌లోకి కావేరి (అమృత అయ్యర్) వస్తుంది. ఆమె రాకతో మల్లీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఇంతకీ ఏంటా మార్పులు? కావేరితో అతడి ప్రేమ కథ ఎలా మెుదలైంది? చివరికీ సుఖాంతం అయ్యిందా? లేదా? అసలు తండ్రితో మల్లికి ఉన్న సమస్య ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే బచ్చల మల్లి పాత్రలో అల్లరి నరేష్ (Bachhala Malli Review) పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. గమ్యం సినిమాలో చేసిన గాలి శీను పాత్ర తరహాలో బచ్చలమల్లి రోల్ కూడా అతడి కెరీర్లో గుర్తుండిపోతుంది. మూడు వేరియేషన్స్ కలగలిసిన ఆ పాత్రలో నరేష్ అదరగొట్టాడు. హావ భావాలు చక్కగా పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో పరిణితి చూపించాడు. హీరోయిన్ కావేరి పాత్రలో అమృత అయ్యర్ (Amritha Aiyer) బాగా చేసింది. అమాయకంగా కనిపిస్తూనే మంచి నటన కనబరిచింది. రావు రమేశ్ (Rao Ramesh) పాత్ర సినిమాకి కీలకం. అల్లరి నరేష్‌తో వచ్చే సీన్స్‌లో ఆయన అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రావు రమేష్ నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాదాసీదాగా కనిపిస్తూనే విలనిజం బాగా పండించాడు. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు బలమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సుబ్బు మంగదేవి కంచెలు తెంచుకున్న మూర్ఖుడి కథగా 'బచ్చలమల్లి'ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచే హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. చాలా రఫ్‌గా ఉండే హీరో ప్రేమలో పడిన విధానం, ప్రేయసి రాకతో అతడి లైఫ్‌లో వచ్చిన మార్పులు చక్కగా చూపించాడు. తన మూర్ఖత్వంతో ఏమేమి తప్పులు చేశానో హీరో రియలైజ్ అయ్యే సీన్స్ మెప్పిస్తాయి. బంధాలు తెంచుకోవడం చాలా తేలిక.. నిలుపుకోవడంలోనే మన గొప్పతనం దాగుందన్న సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. అయితే స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. కొన్ని సీన్స్‌కు లాజిక్స్ ఉండవు. హీరో పాత్రను ప్రభావితం చేసే సన్నివేశాలు చాలా పేవలంగా అనిపిస్తాయి. మూడు పార్శ్వాలుగా కథ చెప్పడం కాస్త గందరగోళానికి గురిచేసింది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ మాత్రం హృదయాలకు హత్తుకుంటుంది. సాంకేతికంగా.. టెక్నికల్ విషయాలకు వస్తే (Bachhala Malli Review) సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటల్లో ‘మా ఊరి జాతర్లో’ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రిచర్డ్ ఎమ్.నాథన్ కెమెరా పనితనం గ్రామీణ నేపథ్యాన్ని పక్కాగా ఆవిష్కరించింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ కనిపించవు. ప్లస్ పాయింట్స్ నరేష్ నటనకథా నేపథ్యంసంగీతం మైనస్ పాయింట్స్ ఆసక్తిలేని కథనంలాజిక్స్కు అందని సీన్స్అక్కడక్కడ పండని ఎమోషన్స్ Telugu.yousay.tv Rating : 2.5/5 డిసెంబర్ 20 , 2024
- Best Comedy Films in Telugu: ఆన్ లైన్లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్లైన్లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్ ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్ నాని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్లైన్లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్ తరుణ్ పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ: హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ- యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ- జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది. ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి. ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్ ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్. మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్మే 23 , 2024

అల్లరి నరేష్(Allari Naresh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
అల్లరి చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన అల్లరి నరేష్.. రాజేంద్ర ప్రసాద్ తర్వాత ఆ స్థాయి కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కితకితలు, బ్లేడ్ బాబ్జీ వంటి కామెడీ హిట్ చిత్రాలతో స్టార్ డం సంపాదించాడు. నాంది చిత్రం వంటి సూపర్ హిట్ తర్వాత యాక్షన్ చిత్రాల వైపు తన పంథాను మార్చుకున్నాడు. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేష్ గురించి కొన్ని టాప్ సీక్రెట్స్ మీకోసం.
అల్లరి నరేష్ అసలు పేరు?
ఎడారా నరేష్
అల్లరి నరేష్ ముద్దు పేరు?
సడెన్ స్టార్
అల్లరి నరేష్ ఎత్తు ఎంత?
6 అడుగులు
అల్లరి నరేష్ తొలి సినిమా?
రఘుబాబు డైరెక్షన్లో వచ్చిన అల్లరి అతని మొదటి చిత్రం. ఈ చిత్రం పేరే తర్వాత అతని ఇంటి పేరుగా మారిపోయింది.
అల్లరి నరేష్ ఎక్కడ పుట్టాడు?
చెన్నై, తమిళనాడు
అల్లరి నరేష్ పుట్టిన తేదీ ఎప్పుడు?
జూన్ 30, 1982
అల్లరి నరేష్‌కు వివాహం అయిందా?
విరూప కంటమనేనితో (2015) అల్లరి నరేష్‌కు పెళ్లి జరిగింది.
అల్లరి నరేష్ ఫస్ట్ క్రష్ ఎవరు?
ఫర్జానా. ఈమె అల్లరి నరేష్‌తో కలిసి సీమశాస్త్రి సినిమాలో నటించింది.
అల్లరి నరేష్ ఫెవరెట్ హీరో?
నాగార్జున
అల్లరి నరేష్ తొలి హిట్ సినిమా?
తొలి చిత్రం అల్లరి మంచి గుర్తింపు తెచ్చింది. బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్, నాంది, కితకితలు చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి.
అల్లరి నరేష్‌కు ఇష్టమైన కలర్?
వైట్ అండ్ బ్లాక్
అల్లరి నరేష్‌కు ఇష్టమైన సినిమా?
గీతాంజలి
అల్లరి నరేష్ తల్లిదండ్రుల పేర్లు?
సరస్వతి కుమారి, ఈవీవీ సత్యనారాయణ
అల్లరి నరేష్‌కు ఇష్టమైన ప్రదేశం?
అమెరికా
అల్లరి నరేష్ చదువు?
B.com
అల్లరి నరేష్ ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 54 సినిమాల్లో నటించాడు.
అల్లరి నరేష్‌కు ఇష్టమైన ఆహారం?
చేపల పులుసు
అల్లరి నరేష్ సినిమాకి ఎంత తీసుకుంటాడు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.2.5 నుంచి రూ.3 వరకు తీసుకుంటున్నాడు
అల్లరి నరేష్ అభిరుచులు?
క్రికెట్ ఆడటం, మ్యూజిక్ వినడం
అల్లరి నరేష్ ఫెవరెట్ డైరెక్టర్?
రఘుబాబు
https://www.youtube.com/watch?v=L6NPy-viALo
మార్చి 21 , 2024
Bachhala Malli Review: మూర్ఖుడిగా అల్లరి నరేష్ సూపర్బ్.. ‘బచ్చలమల్లి’తో హిట్ కొట్టాడా?
నటీనటులు: అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు
కథ, దర్శకత్వం: సుబ్బు మంగదేవి
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎమ్.నాథన్
ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
నిర్మాతలు: రాజేష్ దండా, బాలాజీ గుత్తా
నిర్మాణ సంస్థ: హాస్య మూవీస్
విడుదల తేదీ: డిసెంబర్ 20, 2024
అల్లరి నరేష్ (Allari Naresh) మాస్ రోల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా డిసెంబర్ 20న (Bachhala Malli Movie Review) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? నరేష్ నటన బాగుందా? అతడి ఖాతాలో మరో విజయం పడిందా? ఇప్పుడు తెలుసుకుందాం.
కథేంటి
కథ 1995 - 2005 మధ్య (Bachhala Malli Review) తుని, సూరవరం ప్రాంతంలో సాగుతుంటుంది. బచ్చలమల్లి (అల్లరి నరేశ్) చిన్నప్పుడు చదువులో బాగా చురుగ్గా ఉండేవాడు. పదో తరగతిలో మంచి మార్కులు సాధించి తండ్రి గర్వపడేలా చేస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం మల్లిని ఎంతగానో బాధిస్తుంది. దాంతో చదువుకు స్వస్థి పలికి చెడు వ్యసనాలకు బానిసవుతాడు. ట్రాక్టర్ నడుపుతూ మూర్ఖుడిగా మారిపోతాడు. మద్యం తాగుతూ ఊరిలో ఏదోక గొడవలో తలదూరుస్తూ బేవర్స్‌గా మారిపోతాడు. అప్పుడే అతడి లైఫ్‌లోకి కావేరి (అమృత అయ్యర్) వస్తుంది. ఆమె రాకతో మల్లీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఇంతకీ ఏంటా మార్పులు? కావేరితో అతడి ప్రేమ కథ ఎలా మెుదలైంది? చివరికీ సుఖాంతం అయ్యిందా? లేదా? అసలు తండ్రితో మల్లికి ఉన్న సమస్య ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
బచ్చల మల్లి పాత్రలో అల్లరి నరేష్ (Bachhala Malli Review) పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. గమ్యం సినిమాలో చేసిన గాలి శీను పాత్ర తరహాలో బచ్చలమల్లి రోల్ కూడా అతడి కెరీర్లో గుర్తుండిపోతుంది. మూడు వేరియేషన్స్ కలగలిసిన ఆ పాత్రలో నరేష్ అదరగొట్టాడు. హావ భావాలు చక్కగా పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో పరిణితి చూపించాడు. హీరోయిన్ కావేరి పాత్రలో అమృత అయ్యర్ (Amritha Aiyer) బాగా చేసింది. అమాయకంగా కనిపిస్తూనే మంచి నటన కనబరిచింది. రావు రమేశ్ (Rao Ramesh) పాత్ర సినిమాకి కీలకం. అల్లరి నరేష్‌తో వచ్చే సీన్స్‌లో ఆయన అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో రావు రమేష్ నటన ఆకట్టుకుంటుంది. కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ సాదాసీదాగా కనిపిస్తూనే విలనిజం బాగా పండించాడు. రోహిణి, బలగం జయరామ్, హరితేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు బలమైన పాత్రల్లో కనిపించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు సుబ్బు మంగదేవి కంచెలు తెంచుకున్న మూర్ఖుడి కథగా 'బచ్చలమల్లి'ని తెరకెక్కించారు. సినిమా ప్రారంభం నుంచే హీరో పాత్రను ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. చాలా రఫ్‌గా ఉండే హీరో ప్రేమలో పడిన విధానం, ప్రేయసి రాకతో అతడి లైఫ్‌లో వచ్చిన మార్పులు చక్కగా చూపించాడు. తన మూర్ఖత్వంతో ఏమేమి తప్పులు చేశానో హీరో రియలైజ్ అయ్యే సీన్స్ మెప్పిస్తాయి. బంధాలు తెంచుకోవడం చాలా తేలిక.. నిలుపుకోవడంలోనే మన గొప్పతనం దాగుందన్న సందేశాన్ని దర్శకుడు ఇచ్చాడు. అయితే స్టోరీ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలోనే దర్శకుడు తడబడ్డాడు. కొన్ని సీన్స్‌కు లాజిక్స్ ఉండవు. హీరో పాత్రను ప్రభావితం చేసే సన్నివేశాలు చాలా పేవలంగా అనిపిస్తాయి. మూడు పార్శ్వాలుగా కథ చెప్పడం కాస్త గందరగోళానికి గురిచేసింది. అయితే క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ టచ్ మాత్రం హృదయాలకు హత్తుకుంటుంది.
సాంకేతికంగా..
టెక్నికల్ విషయాలకు వస్తే (Bachhala Malli Review) సినిమా ఉన్నతంగా ఉంది. విశాల్ చంద్రశేఖర్ అందించిన పాటల్లో ‘మా ఊరి జాతర్లో’ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. రిచర్డ్ ఎమ్.నాథన్ కెమెరా పనితనం గ్రామీణ నేపథ్యాన్ని పక్కాగా ఆవిష్కరించింది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాలు మంచి పనితీరుని కనబరిచాయి. నిర్మాణం పరంగా లోటుపాట్లేమీ కనిపించవు.
ప్లస్ పాయింట్స్
నరేష్ నటనకథా నేపథ్యంసంగీతం
మైనస్ పాయింట్స్
ఆసక్తిలేని కథనంలాజిక్స్కు అందని సీన్స్అక్కడక్కడ పండని ఎమోషన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 20 , 2024
Ugram Movie Review : పోలీసు ఆఫీసర్‌గా అల్లరి నరేష్ ఓకే! మరి ఉగ్రం హిట్టా? ఫట్టా?
నటినటులు: అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శరత్ లోహితష్వా, కౌషిక్ మెహతా, నాగ మహేష్, రమేష్ రెడ్డి
దర్శకత్వం: విజయ్ కనకమేడల
నిర్మాతలు: సాహు గారపాటి, పెద్ది హరీష్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ జాదవ్
సంగీతం: సాయిచరణ్ పాకాల
ఈ తరం కామెడీ హీరోలు అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు ఈ నటుడు. అల్లరి, కితకితలు, బెండు అప్పారావు, బ్లేడ్ బాబ్జీ, బొమ్మనా బ్రదర్స్ చందనా సిస్టర్స్ వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఇచ్చాడు. తద్వారా మినిమమ్ గ్యారంటీ హీరోగా అల్లరి నరేష్ పేరు సంపాదించాడు. అయితే ఒకే తరహా సినిమాలు చేస్తుండటంతో నరేష్ చిత్రాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి సన్నగిల్లినట్లు కనిపించింది. ఫలితంగా నరేష్‌పై వరుస ప్లాపులు వచ్చి పడ్డాయి. దీంతో నరేష్ తన పంథా మార్చారు. మాస్ హీరో ఇమేజ్ తెచ్చే సీరియస్ సబ్జక్ట్స్ ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నాంది, ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం సినిమాలు వచ్చాయి. తాజాగా ఆయన నటించిన ఉగ్రం కూడా ఇవాళ ప్రేక్షకుల మందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? పోలీసు ఆఫీసర్‌గా నరేష్ హిట్ కొట్టాడా? లేదా?. పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి:
నగరంలో మానవ అక్రమ రవాణా విపరీతంగా జరుగుతుంటుంది. పెద్ద మెుత్తంలో ఆడపిల్లలు ఈ ఉచ్చులో చిక్కుకొని కనబడకుండా పోతుంటారు. ఈ మాఫియాకు సీఐ శివకుమార్(అల్లరి నరేష్) ఫ్యామిలీ కూడా బలి అవుతుంది. అదే సమయంలో శివకుమార్‌కు ఓ భయంకరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. అసలు ఈ శివకుమార్ ఎవరు?. హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా వెనక ఎవరున్నారు? ఈ ముఠాకు అల్లరి నరేష్ ఎలా చెక్ పెట్టాడు? అనేది అసలు కథ ఇది తెలియాలంటే ఉగ్రం సినిమా చూడాల్సిందే..
ఎవరెలా చేశారంటే:
సీరియస్ పోలీసు ఆఫీసర్ రోల్లో అల్లరి నరేష్ మెప్పించాడు. ఈ సినిమాలో నరేష్ చాలా కొత్తగా కనిపిస్తాడు. పాత్రలో పూర్తిగా లీనమై అద్భుతంగా నటించాడు. సినిమా చూస్తున్నంత సేపు శివకుమార్ పాత్ర మాత్రమే కనిపిస్తుంది. తన బాడీ లాంగ్వేజ్, హావభావాలతో పోలీస్ ఆఫీసర్ పాత్రకు నరేష్ పూర్తిగా న్యాయం చేశాడు. అటు హీరోయిన్ మిర్నా మీనన్ సైతం తనదైన నటనతో ఆకట్టుకుంది. అల్లరి నరేష్‌తో పోటీ పడి మరీ నటించింది. ఇంద్రజ, శరత్ లోహితష్వా, కౌషిక్ మెహతా తదితరులు తమ పాత్ర మేరకు నటించి మెప్పించారు.
సాంకేతికంగా:
దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకున్న స్టోరీ లైన్ బాగానే ఉంది. దాని కోసం ఆయన చేసిన సెటప్ కూడా మెప్పిస్తుంది. అయితే చాలా సీన్లు మరీ రొటిన్‌గా అనిపిస్తాయి. పూర్తిగా కమర్షియల్ ఎలిమెంట్స్ దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేషన్ సన్నివేశాలతో నింపేశారు. ప్రేక్షకుల్లో నెక్స్ట్ సీన్ ఏంటీ అన్న ఆసక్తిని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. సాంకేతికంగా ఉగ్రం పర్వాలేదు, అయితే సిద్ధార్థ్ ఛాయాగ్రహణం అక్కడక్కడా బాగున్నప్పటికీ.. చాల వరకు ఎక్కువ కలర్స్‌ని వాడారు. ఇక సాయి చరణ్ పాకాల పాటలు జస్ట్ ఓకే, నేపధ్య సంగీతం పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
నరేష్ నటననేపథ్య సంగీతంయాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్
రొటీన్ సీన్స్‌సాగదీతపాటలు
రేటింగ్: 2.75/5
https://telugu.yousay.tv/mirna-menon-another-beautiful-star-who-shined-in-tollywood.html
మే 05 , 2023
Aa Okkati Adakku Review: వింటేజ్ అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్ కొట్టినట్లేనా?
నటీ నటులు : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, జామీ లివర్, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు..
డైరెక్టర్ : మల్లీ అంకం
సినిమాటోగ్రాఫర్ : సూర్య
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : రాజీవ్ చిలక
నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్
విడుదల తేదీ: 3 మే, 2024
అల్లరి నరేష్ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
గణపతి పాత్రలో అల్లరి నరేష్ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్ ఎక్స్ప్రెషన్స్, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే రాజ్ సుందర్ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
అల్లరి నరేష్ నటనకామెడీ
మైనస్ పాయింట్స్
కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 03 , 2024
.jpeg)
అల్లరి
డ్రామా , రొమాన్స్
10 మే 2002 న విడుదలైంది

తొట్టి గ్యాంగ్
హాస్యం
06 డిసెంబర్ 2002 న విడుదలైంది

కితకితలు
హాస్యం
05 మే 2006 న విడుదలైంది

గమ్యం
డ్రామా
29 ఫిబ్రవరి 2008 న విడుదలైంది

బ్లేడు బాబ్జీ
హాస్యం
24 అక్టోబర్ 2008 న విడుదలైంది

బెండు అప్పారావు RMP
హాస్యం
16 అక్టోబర్ 2009 న విడుదలైంది

సీమా శాస్త్రి
హాస్యం
16 నవంబర్ 2007 న విడుదలైంది

సుడిగాడు
హాస్యం
24 ఆగస్టు 2012 న విడుదలైంది
.jpeg)
మహర్షి
యాక్షన్ , రొమాన్స్
09 మే 2019 న విడుదలైంది

నాంది
యాక్షన్ , క్రైమ్ , థ్రిల్లర్
19 ఫిబ్రవరి 2021 న విడుదలైంది

బచ్చల మల్లి
20 డిసెంబర్ 2024 న విడుదలైంది

ఆ ఒక్కటీ అడక్కు
03 మే 2024 న విడుదలైంది

నా సామి రంగ
14 జనవరి 2024 న విడుదలైంది
.jpeg)
ఉగ్రం
05 మే 2023 న విడుదలైంది

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
25 నవంబర్ 2022 న విడుదలైంది

నాంది
19 ఫిబ్రవరి 2021 న విడుదలైంది

బంగారు బుల్లోడు
23 జనవరి 2021 న విడుదలైంది
.jpeg)
మహర్షి
09 మే 2019 న విడుదలైంది

సిల్లీ ఫెలోస్
06 సెప్టెంబర్ 2018 న విడుదలైంది

మేడ మీద అబ్బాయి
08 సెప్టెంబర్ 2017 న విడుదలైంది

ఇంట్లో దెయ్యం నాకేం భయం
30 డిసెంబర్ 2016 న విడుదలైంది

సెల్ఫీ రాజా
15 జూలై 2016 న విడుదలైంది
అల్లరి నరేష్ తల్లిదండ్రులు ఎవరు?
టాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ దివంగత ఈవీవీ సత్యనారాయణ, సరస్వతి కుమారి దంపతులకు అల్లరి నరేష్ జన్మించాడు. తండ్రి ఈవీవీ.. 51 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలావరకూ హాస్య కథా చిత్రాలే. హాస్య నటులు రాజేంద్ర ప్రసాద్‌తో.. 'ఆ ఒక్కటి అడక్కు', 'అప్పుల అప్పారావు', 'ఆలీబాబా అరడజను దొంగలు', నరేష్‌తో.. 'జంబలకిడి పంబ' వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను ఈవీవీ తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌లతోనూ చిత్రాలు చేశారు.
అల్లరి నరేష్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
అల్లరి నరేష్‌కు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు ఆర్యన్ రాజేష్. అతడు కూడా పలు తెలుగు చిత్రాల్లో హీరోగా చేశాడు. 'ఎవడిగోల వాడిది' ఆర్యన్ చేసిన బ్లాక్ బాస్టర్ చిత్రం. ఆర్యన్ రాజేష్.. ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదు.
అల్లరి నరేష్ పెళ్లి ఎప్పుడు అయింది?
ఆర్కిటెక్ట్ విరూపాను 29 మే, 2015లో అల్లరి నరేష్ వివాహం చేసుకున్నాడు.
అల్లరి నరేష్ కు పిల్లలు ఎంత మంది?
అల్లరి నరేేష్కు ఓ పాప ఉంది. పేరు అయానా ఇవిక.
అల్లరి నరేష్ Family Pictures
అల్లరి నరేష్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
తొలి చిత్రం 'అల్లరి'లో తన కామెడీ టైమింగ్‌తో నరేష్ అదరగొట్టాడు. ఆ తర్వాత నుంచి వరుసగా హాస్య చిత్రాలు చేసి కామెడీ స్టార్‌గా మారిపోయాడు.
అల్లరి నరేష్ లీడ్ రోల్లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
అల్లరి(2002)
తెలుగులో అల్లరి నరేష్ ఫస్ట్ హిట్ మూవీ ఏది?
అల్లరి(2002)
రూ.100 కోట్ల క్లబ్లో చేరిన అల్లరి నరేష్ తొలి చిత్రం ఏది?
అల్లరి నరేష్ కెరీర్లో అత్యత్తుమ పాత్ర ఏది?
గమ్యంసినిమాలోని గాలి శీను పాత్ర ఇప్పటివరకూ అల్లరి నరేష్ చేసిన రోల్స్‌లో అత్యుత్తమమైనది.
అల్లరి నరేష్ బెస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ వీడియోలు?
Allari Naresh best stage performance
అల్లరి నరేష్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Allari Naresh best dialogues
అల్లరి నరేష్ రెమ్యూనరేషన్ ఎంత?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.5-8 కోట్లు తీసుకుంటున్నాడు.
అల్లరి నరేష్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
చేపల పులుసు
అల్లరి నరేష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
అల్లరి నరేష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు
అల్లరి నరేష్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?
అల్లరి నరేష్ ఫెవరెట్ సినిమా ఏది?
గీతాంజలి(1989)
అల్లరి నరేష్ ఫేవరేట్ కలర్ ఏంటి?
తెలుపు, నలుపు
అల్లరి నరేష్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
అల్లరి నరేష్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
అమెరికా
అల్లరి నరేష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
KIA’s EV6 GT
అల్లరి నరేష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ. 21 కోట్లు
అల్లరి నరేష్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
3 లక్షల మంది ఫాలోవర్లు
అల్లరి నరేష్ సోషల్ మీడియా లింక్స్
అల్లరి నరేష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డు - 2008
'గమ్యం' చిత్రానికి గాను బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరిలో నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డు - 2010
'శంభో శివ శంభో' మూవీకి గాను ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొందాడు
జీ సినీ అవార్డ్, సైమా అవార్డ్, సంతోషం అవార్డ్ - 2019
'మహర్షి' మూవీకి గాను బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరిలో జీ సినీ అవార్డ్, సైమా అవార్డ్, సంతోషం అవార్డ్ అందుకున్నాడు.
సైమా అవార్డు - 2021
'నాంది' చిత్రానికి ఉత్తమ నటుడు కేటగిరిలో సైమా అవార్డుకు నామినేట్ అయ్యాడు.
అల్లరి నరేష్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?
అల్లరి నరేష్‌కు ఎలాంటి వ్యాపారాలు లేవు. ఆయన ఫోకస్ మెుత్తం సినిమాలపైనే ఉంది.
అల్లరి నరేష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అల్లరి నరేష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.