• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Sreeleela: బాలీవుడ్‌ స్టార్‌ హీరో కొడుకుతో శ్రీలీల.. వీడియో వైరల్‌!

    తక్కువ కాలంలో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ సంపాదించిన కథానాయికల్లో శ్రీలీల (Sreeleela) ఒకరు. ‘పెళ్లిసందD’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు తన అందం, అభినయం, డ్యాన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనేే మహేష్‌, బాలకృష్ణ, రవితేజ వంటి  స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. రీసెంట్‌గా ‘పుష్ప 2’ చిత్రంలో కిస్సిక్‌ అనే ఐటెం సాంగ్‌లో మెరిసి పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరో కుమారుడితో కనిపించి శ్రీలీల అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

    శ్రీలీల వీడియో వైరల్‌..

    బాలీవుడ్‌ అగ్ర కథానాయకుల్లో సైఫ్ అలీఖాన్‌ (Saif Ali Khan) ఒకరు. ఇటీవల ఆయన ‘దేవర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమయ్యారు. ఆయన కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ (Ibrahim Ali Khan) కూడా ఫిల్మ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్‌ బ్యూటీ శ్రీలీల, ఇబ్రహీం అలీఖాన్‌ ఒకే చోట కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఓ ఆఫీసు నుంచి బయటకు వస్తూ కెమెరాలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వారిద్దరు ఒకే చోట ఎందుకు ఉన్నారని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ వారు రిలేషన్‌లో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

    కొత్త పెయిర్ షురూ!

    స్టార్ హీరోయిన్‌ శ్రీలీల త్వరలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. వాటిని నిజం చేస్తూ తాజాగా శ్రీలీల ముంబయిలో ప్రత్యక్షమైంది. సైఫ్ అలీఖాన్‌ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌తో శ్రీలీల కనిపించడానికి కారణం త్వరలో చేయబోయే కొత్త సినిమానే అని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్‌ ఫిల్మ్స్‌ ఇబ్రహీంతో తీయబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఈ క్రమంలో మూవీపై చర్చించేందుకు మడాక్‌ ఫిల్మ్స్‌ ఆఫీసుకు శ్రీలీల, ఇబ్రహీం వెళ్లారని టాక్‌. అలా బయటకు వస్తున్న సందర్భంలో వచ్చినదే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనని బీటౌన్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీరి కాంబోలో మూవీపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. 

    మరో ప్రాజెక్ట్‌ సైతం రెడీ!

    ఇబ్రహీం ఖాన్‌ మూవీ కంటే ముందే శ్రీలీల బాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌ అయినట్లు సమాచారం. బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆర్యన్‌ కార్తీక్‌ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంపికైనట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ శర్మ నిర్మిస్తారని సమాచారం. దీనికి సమీర్‌ విద్వాన్‌ దర్శకత్వం వహిస్తారని బీటౌన్‌లో టాక్‌. ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీపై మాట్లాడిన ఆర్యన్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే తాను మూడుసార్లు ప్రేమలో పడి విఫలమయ్యాయని.. ఇప్పుడు మరోసారి ప్రేమలో పడబోతున్నట్లు చెప్పారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ హీరో తో ప్రేమలో పడబోతుందా? ఆల్రెడీ ప్రేమలో పడిందా? అంటూ రూమర్స్‌ మెుదలయ్యాయి. 

    చేతి నిండా ప్రాజెక్ట్స్‌..

    నితీన్‌ లేటెస్ట్‌ చిత్రం ‘రాబిన్‌హుడ్‌’లో  శ్రీలీల హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ డైరెక్టర్‌ కార్తీక్‌ దండు తెరకెక్కించనున్న ‘NC24’ ప్రాజెక్టుకు ఈ భామనే ఎంపికైనట్లు సమాచారం. అలాగే పవన్‌- హరీశ్‌ శంకర్‌ కాంబోలో రానున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’లోనూ శ్రీలీలనే హీరోయిన్‌. రవితేజ హీరోగా నటిస్తోన్న ‘మాస్‌ జాతర’లోనూ ఈ అమ్మడు నటిస్తోంది.  అలాగే కోలీవుడ్‌లో శివకార్తికేయన్ హీరోగా చేస్తున్న ‘SK25’ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటిస్తోంది. ఇవి కాకుండా ప్రస్తుతం చర్చల దశలో మరో మూడు ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. అఖిల్ అక్కినేని అప్‌కమింగ్‌ ఫిల్మ్‌లోనూ కథానాయికగా శ్రీలీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అలాగే నవీన్‌ పోలిశెట్టి తీయబోయే నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌లోనూ శ్రీలీల నటించే ఛాన్స్ ఉందంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా రానున్న ‘కోహినూర్‌’ (Kohinur) చిత్రానికి సైతం శ్రీలీల (Sreeleela) ఎంపిక దాదాపుగా ఖరారైనట్లు టాక్‌ ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv