• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హెబ్బాా పటేల్ ‘B&W’ టీజర్ విడుదల

  కుమారి 21ఎఫ్‌తో పరిచయమైన హెబ్బా పటేల్ మరో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘బ్లాక్ అండ్ వైట్’ సినిమా టైటిల్. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని రచయిత వి. విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. బటన్ నొక్కి ఆయన టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. రొమాన్స్, యాక్షన్ సీన్లతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా టీజర్ సాగుతోంది. ఎల్.ఎన్.వి సూర్యప్రకాశ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నేని నవీన్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

  బాబోయ్.. ఇదేం కొండచిలువ..!

  పాములంటే చాలామందికి భయం. మరికొందరు వీటిని ఇష్టంగా పెంచుకుంటుంటారు. సాధారణంగా ఇలా పెంచుకున్నవి ఎలాంటి హానీ చేయవు. కానీ, ఓ మహిళపై కొండచిలువ దాడి చేసింది. బోనులో నుంచి బయటకు తీద్దామని ప్రయత్నించిన సంరక్షకురాలి చేతిని నోట కరిచి చుట్టేసింది. దీంతో ఆ మహిళ చేతికి తీవ్ర గాయం కాగా, రక్తం కూడా కారింది. కొండచిలువను విడిపించడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘ఎంత భయంకరంగా ఉందో..’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Snake attacks … Read more

  భార్యను కారుతో తొక్కించిన నిర్మాత

  కారులో వేరే మహిళతో ఉండగా చూసిందని తన భార్యనే మట్టుబెట్టాలని అనుకున్నాడో సినీ నిర్మాత. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం నిర్మాత కమల్ కిశోర్ మిశ్రా తన కారులో వేరే మహిళతో ఉన్నారు. ఈ సమయంలో భర్త కోసం భార్య వెతుక్కుంటూ వచ్చింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అది తీవ్రం కావడంతో భార్య నుంచి తప్పించుకునేందుకు కారుతో ఆమెను ఢీకొట్టాడు. కిందపడినా కూడా కనికరించకుండా ఆమె కాళ్లపై నుంచి కారును పోనిచ్చాడు. దీంతో బాధితురాలకి తీవ్ర గాయాలయ్యాయి. నిర్మాత పరారీలో ఉన్నాడు. #WATCH … Read more

  ట్విటర్ ఆఫీస్‌లో ఎలన్ మస్క్

  శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధాన కార్యాలయంలో ఎలన్ మస్క్ టాయిలెట్ శింకుతో అడుగు పెట్టారు. తన బయోలో కూడా ‘చీఫ్ ట్విట్’ అని మార్చారు. ‘మొత్తానికి కార్యాలయంలోకి వచ్చేశా. ఈ శింకు ఇక్కడే ఉండనీ’ అంటూ మస్క్ అందులో రాసుకొచ్చారు. దీంతో ట్విటర్ డీల్ ఈ వారంలోనే పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 13బిలియన్ డాలర్లు ట్విటర్ చేతికి అందినట్లు సమాచారం. మార్చిలోనే 44బిలియన్ డాలర్లకు డీల్ కుదిరింది. కానీ, అనేక మలుపుల అనంతరం తిరిగి అదే ధరకు మస్క్ ట్విటర్‌ కొనుగోలుకు ఒకే … Read more

  Ginna Movie Full Review: మంచువారి అబ్బాయిని ఈ సినిమా గట్టెక్కించిందా?

  కెరీర్ ఆరంభంలో విజయాలే దక్కినా.. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో మంచు విష్ణు. తాజాగా ఈ నటుడు ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. శ్రీను వైట్ల శిష్యుడు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. హీరోయిన్లుగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందా? విష్ణు మళ్లీ హిట్ కొట్టాడా? అనే అంశాలను ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? వ్యాపారిగా ‘జిన్నా’(విష్ణు) జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటుంది. … Read more

  FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

  67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ … Read more