• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ginna Movie Full Review: మంచువారి అబ్బాయిని ఈ సినిమా గట్టెక్కించిందా?

    కెరీర్ ఆరంభంలో విజయాలే దక్కినా.. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో మంచు విష్ణు. తాజాగా ఈ నటుడు ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. శ్రీను వైట్ల శిష్యుడు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. హీరోయిన్లుగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందా? విష్ణు మళ్లీ హిట్ కొట్టాడా? అనే అంశాలను ఈ రివ్యూలో చూద్దాం.

    కథేంటి..?

    వ్యాపారిగా ‘జిన్నా’(విష్ణు) జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటుంది. హీరోయిన్‌తో పరిచయంతో సరదాగా సాగిపోతున్న జిన్నాకు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. వాటిని జిన్నా ఏ విధంగా అధిగమించాడు? అందుకోసం ఎలాంటి సాహసాలు చేశాడు? మధ్యలో సన్నీ లియోన్ పాత్రేంటి? హీరోకు, సన్నిలియోన్‌కు మధ్య విరోధం ఎందుకు ఏర్పడింది? చివరికి జిన్నా ఏం చేశాడు? అన్నదే మిగతా సినిమా కథ. వీటిని తెరపై చూస్తేనే బాగుంటుంది. 

    ఎవరెలా చేశారు..?

    హీరోగా మంచు విష్ణు ఫర్వాలేదనిపించాడు. ఢీ సినిమాలోని కామెడీ టైమింగ్‌ని మరోసారి చూపించాడు. పాటల్లో స్టెప్పులేశాడు. ఇక పాయల్ రాజ్‌పుత్ మరోసారి అందాల విందుకే పరిమితమైంది. తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడంతో ఎక్స్‌పోజింగుతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఈ సినిమాలో ముఖ్యంగా చర్చించుకోవాల్సిన పాత్ర ‘సన్నీ లియోన్’దే. ఒకరకంగా సినిమాకు ఈ బ్యూటీ మరో హీరోలా కనిపిస్తుంది. సన్నీ చుట్టూరానే కథ తిరుగుతుంది. అందచందాలతో సన్నీ ఆకట్టుకున్నా.. అభినయం పండించలేక పోయింది. కొన్ని సీన్లలో సన్నీ తేలిపోయింది. నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో ఈ బాలీవుడ్ బ్యూటీ తన పరిధి మేరకు ప్రదర్శన చేసింది. ఇక కామెడీ విషయానికి వస్తే వెన్నెల కిశోర్ ఒక్కడే కాస్త నవ్వించగలిగాడు. అక్కడక్కడా వేసే జోకులు ప్రేక్షకుడిని నవ్విస్తాయి. సునీల్, రఘుబాబు, చమ్మక్ చంద్ర తమ స్థాయికి తగ్గట్టు చేశారు. 

    బలాలు- బలహీనతలు

    త్రిల్లింగ్ అంశాలతో కూడుకున్న కథ ఇది. దీనికి యాక్షన్, కామెడీని జోడించిన దర్శకుడి ఆలోచన మంచిదే. కానీ, ఈ ఆలోచనను తెరపై అంతే ప్రభావవంతంగా చూపించగలగాలి. దర్శకుడు దీనిపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేదేమో అని అనిపిస్తుంది. కోన వెంకట్ కథనంలో కాస్త పదును తగ్గింది. పవర్‌ఫుల్ క్యారెక్టర్‌గా సన్నీ పాత్రను ప్రొజెక్ట్ చేసినప్పటికీ.. డబ్బింగ్‌కి లిప్ సింక్ కాకపోవడంతో సంభాషణలు కాస్త వెగటుగా కనిపిస్తాయి. ఎవరో వెనకాల మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లు కృత్రిమంగా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్టు బాగానే ప్లాన్ చేశారు. క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందనే హింట్‌ని ఇచ్చారు. సన్నీ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంది. ఇక ఈ సినిమాకి సంగీతం అందించిన అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతంతో ఫర్వాలేదనిపించాడు. సన్నీ పాత్ర కోసం డిజైన్ చేసిన ట్యూన్ కాస్త బాగుంటుంది. 

    ఫైనల్‌గా.. హీరో విష్ణు అయినప్పటికీ సన్నీలియోన్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.

    రేటింగ్ 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv