• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కాలేజీల్లో ‘లైక్,షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ టీం

    ‘లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ మూవీ టీం ప్రచారంలో జోరు పెంచింది. తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీల్లో తిరుగుతూ సినిమా గురించి ప్రమోట్ చేసుకుంటున్నారు. విద్యార్థుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది. రాజమండ్రిలోని ఐఎస్‌టీఎస్ కళాశాల విద్యార్థులతో చిత్రబృందం మమేకమైంది. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తమ స్టెప్పులతో కాసేపు అలరించారు. విద్యార్థులతో కలిసి సెల్ఫీలు దిగారు. తమ సినిమాను ఆదరించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కాగా, ఈ మూవీ రేపు విడుదలవుతోంది. Team #LikeShareSubscribe had a Blasting … Read more

    వైరల్ అవుతున్న SKY సైగలు

    ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై భారత్ పైచేయి సాధించింది. అయితే మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాళ్లలో ఉత్సాహం కలిగించేందుకు సూర్య కుమార్ యాదవ్ చేసిన సైగలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 12వ ఓవర్లో లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సూర్య చాలా.. అంతకుముందు పట్టిన రెండు క్యాచ్‌లతో హుషారుగా కనిపించాడు. ఈ క్రమంలో తన జెర్సీపై ఉన్న ఇండియా పేరును పలకాలని సంజ్ఞ ద్వారా ఫ్యాన్స్‌కి సూచన చేశారు. గట్టిగా వినపడేలా చెప్పాలన్నట్టుగా సైగ చేశాడు. ఈ వీడియో ను ఐసీసీ షేర్ చేసింది. … Read more

    SUPER: చిన్నారిని కాపాడిన పోలీసు

    రైలు ఎక్కుతుండగా కాలుజారి ప్లాట్ ఫాం గ్యాప్‌లో ఇరుక్కుపోయిన తల్లీబిడ్డలను పోలీసులు అధికారి కాపాడారు. మహారాష్ట్రలోని మన్‌కర్డ్ రైల్వే స్టేషనులో ఈ ఘటన జరిగింది. నిన్న మధ్యాహ్నం ఓ మహిళ తన బిడ్డతో కలిసి రైలు ఎక్కుతుండగా పట్టు కోల్పోయింది. రైలు కదలడంతో అప్రమత్తమైన పోలీసు అధికారి వెంటనే బిడ్డను బయటకు తీశాడు. సీసీ ఫుటేజీ వైరల్ కావడంతో అధికారిని మెచ్చుకుంటున్నారు. ఈ [వీడియో](url) వైరల్‌గా మారింది. #MissionJeevanRaksha आज अपराध शाखाके अक्षय सोये द्वारा मानखुर्द रेलवे स्टेशनके प्लेटफार्म 2 … Read more

    షారూక్ ఖాన్ ‘పఠాన్’ టీజర్ విడుదల

    బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ‘పఠాన్’ మూవీ తెలుగు టీజర్ విడుదలైంది. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో కూడుకున్న ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హుషారెత్తిస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ సమర్పణలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. దీపిక పదుకొనె షారూక్‌తో కలిసి నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్ర పోషిస్తున్నాడు. విశాల్ అండ్ శేఖర్ సంగీతం అందిస్తున్నారు. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25కు థియేటర్లలో విడుదల చేస్తున్నారు.

    సమంత డెడికేషన్‌కి స్టంట్ మాస్టర్ ఫిదా

    సమంత డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయానని యశోద సినిమా స్టంట్ కొరియోగ్రఫర్ యానిక్ బెన్ వెల్లడించాడు. ఈ మేరకు స్టంట్ కొరియోగ్రఫర్ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘సాధ్యమైనంత వరకు మేం యాక్టర్ భద్రతకు ప్రాధాన్యమిస్తాం. ముందుగా ఫైట్ మాస్టర్లతో కంపోజ్ చేసి నటీనటులకు ట్రైనింగ్ ఇస్తాం. దీంతో వారికి టైమింగ్ గుర్తుంటుంది. సులువుగా చేయగలరు. సమంత ది బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది. అలాంటి వారితో పనిచేయడం మంచి అనుభూతిని కల్గిస్తుంది. ఇందులో ఫైట్లన్నీ సహజంగా ఉంటాయి’ అని చెప్పాడు.

    గన్‌తో బెదిరించి.. కారు ఎత్తుకెళ్లి..!

    గన్‌తో యజమానిని బెదిరించి ఎస్‌యూవీ కారును దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై కారుని నిలిపేందుకు యజమాని వచ్చాడు. అప్పటికే బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు అక్కడ వేచిచూస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి జేబులోంచి తుపాకీని తీశాడు. పైగా మరో ఇద్దరు దుండగులు వచ్చి వ్యక్తిని చుట్టుముట్టారు. దీంతో సదరు యజమాని భయపడి కారును అప్పగించేశాడు. ఇదే అదనుగా ఆ ముగ్గురు వ్యక్తులు కారులో పరారయ్యారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. दिल्ली … Read more

    గుజరాత్‌లో కూలిన కేబుల్ బ్రిడ్జి

    గుజరాత్‌లోని మోర్బీ పట్టణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తీగల వంతెన నదిలో కూలడంతో సుమారు 100మందికి పైగా నదిలో పడిపోయారు. ప్రమాదం జరిగే సమయంలో వంతెనపై 500మంది ఉన్నట్లు సమాచారం. కాగా, సామర్థ్యానికి మించి సందర్శకుడు వంతెనపైకి చేరుకోవడమే ఇందుకు కారణమైనట్లు తెలుస్తోంది. చిన్నారులు, మహిళలు ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. శరవేగంగా సహాయక చర్యలు చేపట్టాలని సీఎంకు ఆదేశించారు. गुजरात के मोरबी में केबल पुल टूट गया। करीब 400 लोग नदी … Read more

    6వేల మందితో చిరు చిత్రం

    మెగాస్టార్ చిరంజీవిపై ఉన్న అభిమానాన్ని విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. తమ మైదానంలో మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థులు చిరు ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని డ్రా చేసి.. ఆరు వేల మంది ఆ లైన్‌పై కూర్చున్నారు. ‘క్యాన్సర్‌పై పోరాటం’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లిన చిరుకి ఈ వీడియో చూపించి సర్‌ప్రైజ్ చేశారు. ఈ వీడియో చూసిన చిరు ఎంతో మురిసిపోయి విద్యార్థులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వీడియోను చిత్ర దర్శకుడు బాబీ ట్విటర్‌లో షేర్ చేయగా.. వావ్ సూపర్ అటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. వీడియో … Read more

    LIVE: ప్రీ రిలీజ్ ఈవెంట్

    అల్లు శిరీశ్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాకేశ్ శశి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నవంబరు 4న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి. కాగా, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్, అచ్చు ఇద్దరు సంగీతం అందించారు.

    పాదయాత్రలో రాహుల్ రన్నింగ్

    తెలంగాణలో భారత్ జోడో యాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కాసేపు పరుగెత్తి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రేవంత్ రెడ్డి కూడా రాహుల్‌తో పాటు కలిసి పరిగెత్తే ప్రయత్నం చేశారు. కర్ణాటకలోనూ రాహుల్ గాంధీ ఈ విధమైన ఫిట్‌నెస్ ఫీట్లను నాయకులతో కలిసి చేశారు. పుష్ అప్స్ తీయడం, పరుగెత్తడం వంటివాటితో నాయకులను ఉత్తేజపరుస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతోంది. వీడియో కోసం Watch On గుర్తుపై క్లిక్ చేయండి. Out for a marathon, but let's … Read more