TS: చినుకు పడితేనే కరెంట్ పోయే పరిస్థితి. చుట్టూ వరద నీరుంటే అటు వైపే వెళ్లలేం. అలాంటిది ఓ విద్యుత్ ఉద్యోగి చూపిన అంకితభావం ప్రశంసలు అందుకుంటోంది. సూర్యాపేట జిల్లా పాతర్ల పహాడ్ గ్రామ హెల్పర్ కొప్పుల సంతోష్ సాహసం చేశారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో గ్రామంలో కరెంటు పోయింది. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ స్తంభం చుట్టూ వరద ఉన్నా లెక్కచేయకుండా ఈదుకుంటూ వెళ్లారు. మరమ్మతులు చేసి విద్యుత్‌ని పునరుద్ధరించారు.
-
Courtesy Twitter:@TeluguScribe
-
Courtesy Twitter:@TeluguScribe