• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చర్చనీయాంశం అవుతున్న రనౌట్

    యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదో టెస్టులో థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ నిర్ణయం చర్చనీయాంశం అయింది. ఆసీస్ బ్యాటింగ్ చేస్తుండగా స్టీవ్ స్మిత్ రనౌట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు. స్మిత్ కూడా మైదాన్ని వీడటం ప్రారంభించాడు. అయితే, థర్డ్ అంపైర్ నితిన్ మీనన్ ఈ రనౌట్‌ని నాటౌట్‌గా ప్రకటించాడు. క్రీజు ఆవల ఉన్న సమయంలో బంతి వికెట్లను తాకినప్పటికీ బుయిల్స్ విడిపోలేదన్న కారణంతో ఔట్ ఇవ్వలేదు. అయితే, మరో యాంగిల్‌లో బెయిల్స్ ఎగురుతున్నట్లు స్పస్టంగా కనిపిస్తోంది. Johnny Bairstow is … Read more

    హెలికాప్టర్ లేకే ప్రాణాలు పోయాయ్: సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో 8 మంది గల్లంతై మృతి చెందారు. దీంతో వీరి మరణానికి కారణం అలసత్వమేనని ఆరోపించారు. సమయానికి హెలికాప్టర్‌ని పంపించి ఉంటే కనీసం ప్రాణాలైనా కాపాడుకునే వారమని ఆవేదన చెందారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని సీతక్క డిమాండ్ చేశారు. కాగా, జంపన్నవాగు ఉప్పొంగడంతో కొండాయి గ్రామం అతలాకుతలం అయింది. My heart broke to see 8 members lost their … Read more

    సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ VS బీఆర్‌ఎస్‌

    TS: పార్టీల మధ్య వివాదం సోషల్ మీడియాకెక్కింది. వరదలతో ధ్వంసమైన రోడ్ల ఫొటోలను షేర్ చేస్తూ ‘అవినీతితో వేసిన రోడ్లపై బంగారు తెలంగాణ ఇదిగో’ అంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. దీనికి బీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. అవినీతి గురించి ‘ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ’ మాట్లాడటం విడ్డూరమంటూ రిప్లై ఇచ్చింది. కాగా, చిల్లర రాజకీయాలు మానుకొని పార్టీలకతీతంగా సహాయక చర్యల్లో పాల్గొనాలని నెటిజన్లు సూచిస్తున్నారు. What an irony!The King of Corruption – 'All Indian Corruption Committee' is talking about corruption. … Read more

    కర్ణాటకలో శునకానికి సీమంతం

    పెంపుడు జంతువులను కన్న బిడ్డలతో సమానంగా సాకడం మనం చూస్తుంటాం. వాటికి నిత్యం సపర్యలు చేస్తూ జంతు ప్రేమికులు పెంచుతుంటారు. అయితే, కర్ణాటకలో ఓ శునకానికి ఏకంగా సీమంతం చేశారు. గదగ్ జిల్లాలో జంతు ప్రేమికుడు అశోక్ తన పెంపుడు జంతువుకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెగ్యులర్‌గా చేసే సీమంతం మాదిరే ఇరుగు పొరుగు వారిని పిలిచి వేడుకలా జరిపించారు. శునకానికి దండ వేసి, బొట్టు పెట్టి, వస్త్రం వేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కుక్కకు సీమంతం కర్ణాటకలోని గదగ్ జిల్లాలో … Read more

    నా ఫేవరేట్ జూ. ఎన్టీఆర్: జపాన్ మంత్రి

    ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో అద్భుత విజయాన్ని సాధించింది. ప్రమోషన్లలో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ జపనీస్‌లో మాట్లాడి అక్కడి ప్రజలను ఆశ్చర్యపరిచాడు. తాజాగా జపాన్ విదేశాంగ మంత్రి యొషిమస హయాషి ఇండియాకొచ్చారు. తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని రివీల్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. తారక్ చెరిష్మాకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆర్ఆర్ఆర్‌కు ఆస్కార్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. Minister Of Foreign Affairs Of #Japan — Mr. #YoshimasaHayashi says he … Read more

    బ్రో మూవీ ఫ్లెక్సీలను చించేసిన యాజమాన్యం

    AP: గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర కాసేపు గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్‌కి, యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక్కో ఫ్లెక్సీ కట్టడానికి యాజమాన్యం రూ.2500 డిమాండ్ చేయడంపై ఫ్యాన్స్ నిరసన వ్యక్తం చేశారు. సారీ చెప్పేంత వరకు స్క్రీనింగ్ జరగనివ్వబోమని మొండికేసి కూర్చోవడంతో యజమాన్యం దిగొచ్చింది. సయోధ్య కుదుర్చుకుని ఫ్లెక్సీలు కట్టేందుకు అనుమతించింది. దీంతో వివాదం సద్దుమణిగింది. వైసీపీ నేతల ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలు చించేశారని ఫ్యాన్స్ ఆరోపించారు. గూడూరులో K3K సంగం దియేటర్ దగ్గర గందరగోళం.. పవన్ కళ్యాణ్ బ్రో సినిమా … Read more

    దేవి థియేటర్ వద్ద ఫ్యాన్స్ హంగామా

    బ్రో మూవీ రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లో పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా చేశారు. భారీ ఎత్తున గుమిగూడి విడుదలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవీ 70ఎం.ఎం. థియేటర్ వద్ద అభిమానులు చిందులు వేశారు. భారీ కటౌట్లు కట్టి థియేటర్ ఎదుట బ్యాండ్‌మేళంతో డ్యాన్స్ చేశారు. కొందరైతే ఏకంగా కొబ్బరికాయలే తీసుకొచ్చారు. పవర్ స్టార్ కటౌట్ ఎదుట నిలబడి కొబ్బరికాయలను కొట్టారు. కాగా, బ్రో మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. పండుగ, ఇది @PawanKalyan పండుగ ? Celebration at Devi 70mm, … Read more

    5కి.మీ మేర నిలిచిన వాహనాలు

    TS: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచపోయాయి. హైవేపై వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపి వేశారు. హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలను కోదాడ, హుజూర్ నగర్, మిర్యాల గూడ మీదుగా మళ్లిస్తున్నారు. దీంతో కోదాడ- హుజూర్ నగర్ రహదారిపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ – విజయవాడ హైవే మీద భారీగా ట్రాఫిక్ జాం.. నిలిచిన రాకపోకలు ఐతవరం వద్ద హైవేపై … Read more

    తీరానికి కొట్టుకొచ్చిన నీలి తిమింగళం

    AP: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన నీలి తిమింగళం(బ్లూ వేల్) మృతదేహం కొట్టుకొచ్చింది. ఈ తిమింగళం సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుందని స్థానిక మత్స్యకారులు అంచనా వేస్తున్నారు. ఈ తరహా తిమింగళాలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. సముద్రంలో లోతులేని ప్రాంతంలోకి చేరి ఈ తిమింగలం చనిపోయి ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. కాగా, ఈ తిమింగళాన్ని చూడటానికి చూపరులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం … Read more

    సునామీ కన్నా తక్కువ కాదు: సీతక్క

    TS: భారీ వరదలకు ములుగు జిల్లా అతలాకుతలం అయింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సీతక్క పర్యటించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. జంపన్న వాగు ఉప్పొంగడంతో మేడారం, కొండాయి గ్రామాలు చెల్లా చెదురయ్యాయి. రోడ్లు కొట్టుకుపోయి.. బ్రిడ్జిలు కుంగిపోయాయి. ప్రాణాలను పణంగా పెట్టి కూలిన బ్రిడ్జిని సైతం దాటుకొని పర్యటించాల్సి వస్తోందని ఆమె తెలిపారు. ఈ వరద సృష్టించిన బీభత్సాన్ని ఉద్దేశించి సునామీ కన్నా తక్కువేమీ కాదని సీతక్క పోల్చారు. It’s not less than a tsunami.crossed the collapsed bridge … Read more