• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చర్చనీయాంశం అవుతున్న ఊర్వశి ట్వీట్

    బ్రో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది ఊర్వశి రౌటేలా. రేపు ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ట్వీట్ చేసిందీ బ్యూటీ. అయితే, ఇందులో పవన్ కళ్యాణ్‌ని.. ఎస్టీమ్డ్(Esteemed) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ సంబోధించింది. దీంతో ఈ [ట్వీట్](URL Here) చర్చనీయాంశం అయింది. ఈ పదానికి ‘సరిపోలే/గౌరవీనయులై/ పూజ్యులైన’ అనే అర్థాలు వస్తాయి. మరి, ఊర్వశి ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్ వేసిందోనని డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ ట్వీట్‌తో జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తుండగా వైసీపీ అనుకూల యూజర్లు నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. Delighted … Read more

    మణిపుర్ ఘటన.. బీజేపీ నేత రాజీనామా

    మణిపుర్‌లో హింసకు ప్రధాని మోదీ, సీఎం బీరెన్ సింగ్‌లే కారణమని ఆరోపిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి వినోద్ శర్మ రాజీనామా చేశారు. ‘ఇకనైనా మోదీ నిద్ర లేవాలి. మహిళలను నగ్నంగా ఊరేగించడంతో అంతర్జాతీయంగా భారత్ పరువు పోయింది. బేటీ బచావో, సనాతన ధర్మం గురించి మాటలు చెప్తారు. మహిళలను ఇలా అవమానించి చంపమని సనాతన ధర్మంలో ఉందా? నేను ఢిల్లీలో 5 రోజులు ఉన్నా. నన్ను ఈ ఘటనలో సమర్థిస్తూ మాట్లాడమని చెప్పారు. దీంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా ’ అని చెప్పారు. నరేంద్ర … Read more

    భారత్ విజృంభణ.. 114కే విండీస్ ఆలౌట్

    వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. కరేబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ని పేకమేడల్లా కూల్చేశారు. బౌలింగ్‌కు తోడు అద్భుత ఫీల్డింగ్ వెస్టిండీస్ బ్యాటింగ్ కొంప ముంచింది. దీంతో వెస్టిండీస్ 114 పరుగులకే చాప చుట్టేసింది. కెప్టెన్ షై హోప్(43) మినహా మిగతా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో కుల్‌దీప్ 4, జడేజా 3 వికెట్లతో వెస్టిండీస్ నడ్డి విరిచారు. ముకేశ్ కుమార్, పాండ్యా, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసుకున్నారు. స్లిప్‌లో విరాట్ కోహ్లీ అందుకున్న క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. What a … Read more

    భావోద్వేగానికి గురైన ఎమ్మెల్యే సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క కంటతడి పెట్టారు. వరదలతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారని ఆవేదన చెందారు. ‘దయచేసి కేటీఆర్‌ గారిని అడుగుతున్నా. ఒక్క హెలికాప్టర్ పంపించండి. రెస్క్యూ టీం శాయాశక్తులా ప్రయత్నిస్తున్నా తరలింపు చర్యలు పూర్తి కావట్లేదు. 9 గంటల నుంచి హెలికాప్టర్ కోసం వేడుకుంటున్నాం. ఇకనైనా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి’ అంటూ సీతక్క కోరారు. ఏటూరు నాగారం మండలంలో కొండై గ్రామస్థులు దాదాపు 100 మంది ప్రాణాలతో పోరాడుతున్నారని ఆమె తెలిపారు. Please send helicopters to save our … Read more

    ప్రభుత్వమే బాధితుల్ని ఆదుకోవాలి: సీతక్క

    TS: ములుగు ఎమ్మెల్యే సీతక్క వరద ప్రభావిత ప్రాంత ప్రజలను పరామర్శించారు. ఆయా గ్రామాల్లో పర్యటించి బాధితులను ఓదార్చారు. నియోజకవర్గంలో పరిస్థితి మరింత దిగజారిందని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వరదలల కారణంగా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. ఈ వరదలతో ఎంత మేరకు ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందో చెప్పలేమని సీతక్క వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా రక్షణ చర్యలు చేపట్టాలని సీతక్క విన్నవించారు. ట్విటర్‌లో వీడియోను షేర్ చేశారు. Situation is very dangerous in my … Read more

    ఈటెల సీఎం అంటూ నినాదాలు

    TS: బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటెల రాజేందర్ పార్టీలో కీలక నేతగా మారారు. నేడు ఆయన షాద్‌నగర్‌లో పర్యటించగా అక్కడి నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేశారు. దీంతో వెంటనే ఈటెల స్పందించి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ‘ష్ ష్’ అంటూ వేలిని నోటిపై వేసి సైగ చేశారు. దీంతో నాయకులు నినాదాన్ని మార్చారు. అయితే, ఈ వీడియో వైరల్ కావడంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. షాద్ నగర్ … Read more

    ప్రసాద్స్‌కి 20 ఏళ్లు.. జక్కన్న ఎమోషనల్

    హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌ ఎంతో ఫేమస్. ప్రతి శుక్రవారం ఇక్కడొక జాతరే. ఈ ఐమ్యాక్స్ ఏర్పాటు చేసి 20 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పెషల్ ట్వీట్ చేశారు. ‘ఎన్నో శుక్రవారాలు ఇక్కడే గడిచాయి. ప్రతి శుక్రవారం 8.45కే వచ్చి సీటులో కూర్చునేవాళ్లం. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఇందులో చూసిన ప్రతి సినిమా నాకో పాఠాన్ని నేర్పించింది. అప్పుడే నీకు 20 ఏళ్లు పూర్తయ్యాయా? డియర్ ప్రసాద్స్.. నువ్వు సినిమావి మాత్రమే కాదు. నా క్లాస్‌రూంవి. థాంక్యూ’ అంటూ … Read more

    భోళా శంకర్ ట్రైలర్ వచ్చేసింది

    మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ ట్రైలర్ వచ్చేసింది. రామ్‌చరణ్ ఈ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ మూవీలో తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ నటించారు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించగా మహతి స్వరసాగర్ మ్యూజిక్ అందించాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. కాగా, ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మరి, మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

    భారీ వరదలు.. తెగిపోయిన కనెక్టివిటీ

    TS: వరంగల్, హనుమకొండ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. హంటర్ రోడ్, నయీంనగర్ పూర్తిగా నీట మునగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. బాధితులు భవనాలపై తలదాచుకుంటున్నారు. వరద నీరు బీభత్సంతో వాహనాలు కొట్టుకు పోయాయి. శివనగర్ బస్తీల్లో నీరు వచ్చి చేరింది. వరంగల్ రైల్వే స్టేషన్ సైతం నీటితో నిండిపోయింది. రాష్ట్ర విపత్తు స్పందన అధికారులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. #Warangalfloods full of storm water enter tricities. #Warangalrains #Warangalfloods #TelanganaRains #TelanganaFloodspic.twitter.com/FheMkUtkP6 — Hi Warangal (@HiWarangal) … Read more

    హార్దిక్‌ని గేలి చేసిన విరాట్

    నేడు వెస్టిండీస్‌తో భారత్ తొలి వన్డే ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. నెట్స్‌లో విరాట్ బ్యాటింగ్ చేస్తుండగా హార్దిక్ బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఈ క్రమంలో హార్దిక్‌ని విరాట్ గేలి చేశాడు. హార్దిక్ వేసిన బంతిని కవర్స్ దిశగా బాది ఫోర్ వెళ్తుందన్నట్లుగా సిగ్నల్ ఇస్తూ ఎద్దేవా చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బార్బడోస్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. Virat Kohli having fun in nets with Hardik Pandya. pic.twitter.com/2KQ9BHHLkK — Mufaddal Vohra (@mufaddal_vohra) … Read more