• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రైల్వే ట్రాక్‌పైకి వచ్చి చేరిన నీరు

    TS: భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటికి కాజీపేట రైల్వే స్టేషనులోని ట్రాక్‌పై నీరు వచ్చి చేరింది. ట్రాక్ మీద రెండు అడుగుల మేర నీరు నిల్వ ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసి, దారి మళ్లించింది. ఇప్పటికే 6 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, పది రైళ్లను దారి మళ్లించింది. వర్షపు నీరు తొలగించడానికి స్టేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు. Never seen #Kazipet Railway Station this way where … Read more

    కుమారుడి వద్దే కుప్పకూలిన MLA

    TS: కుమారుడి మృతితో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అచలమయ్యారు. పెద్ద కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి లేడన్న భావన ఆయన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. ఈ క్రమంలో కుమారుడి పార్థివ దేహం వద్దే కూర్చుని లోలోపల కుమిలిపోయారు. బోరున విలపించడంతో సొమ్మసిల్లి అక్కడే కుప్పకూలిపోయారు. స్థానిక నేతలు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని పక్కకి తీసుకెళ్లారు. గత కొంత కాలంగా విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. కొడుకు మృతదేహం చూసి సొమ్మసిల్లి పడిపోయిన … Read more

    సచివాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత

    TS: జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించారు. సెక్రెటరేట్ గేటు ఎదుట బైఠాయించి జీవోను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022 నోటిఫికేషన్లో కానిస్టేబుల్ నియామకాలను పాత పద్ధతిలోనే పూర్తి చేసి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ సెక్రెటరేట్‌ను ముట్టడించిన కానిస్టేబుల్ అభ్యర్థులు. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్. సెక్రెటరేట్ … Read more

    పవన్, సాయితేజ్‌తో తమన్ మాస్ స్టెప్పులు

    బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ ఫ్యాన్స్‌కి చిన్న ట్రీట్ ఇచ్చాడు. గుడుంబా శంకర్ సినిమాలోని ‘కిల్లీ కిల్లీ’ సాంగ్‌కి సాయితేజ్, పవన్ కళ్యాన్‌లతో కలిసి మాస్ స్టెప్పులు వేసిన వీడియోను పంచుకున్నాడు. ఈ వీడియోను స్టేజిపైనే రిలీజ్ చేయించాడు. ఇందులోని స్టెప్పులను చూస్తుంటే వింటేజ్ పవన్ కళ్యాణ్‌ని చూసినట్టే ఉందని ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మీరూ చూసేయండి.

    పామును వదిలి స్థానికుడి నిరసన

    TS: హైదరాబాద్ పరిధిలోని అల్వాల్ డివిజన్‌ స్థానికుడు వినూత్నంగా నిరసన తెలిపాడు. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తండగా వరద ప్రవాహానికి తన ఇంట్లోకి ఓ పాము వచ్చింది. వరదను తొలగించాలని అధికారులకు విన్నవించినా పరిష్కారం కాలేదు. దీంతో అల్వాల్ వార్డ్ కార్యాలయంలో సదరు వ్యక్తి ఆ పామును తీసుకొచ్చాడు. ఆఫీసులోకి పామును వదిలేశాడు. టేబుల్‌పై తిరుగుతున్న పాము వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. A resident releases a snake that entered his home due to rain, in a … Read more

    హెన్రిచ్ క్లాసెన్ వీరోచిత ఇన్నింగ్స్

    సన్‌రైజర్స్ తరఫున వీరోచిత పోరాటం చేసిన హెన్రిచ్ క్లాసెన్ మరోసారి అదరగొట్టాడు. మేజర్ లీగ్‌ క్రికెట్‌లో 44 బంతుల్లోనే 110 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు బౌలర్లను ఊచకోత కోశాడు. 9 ఫోర్లు, 7 సిక్సర్లతో పట్టపగలే చుక్కలు చూపించాడు. రషీద్ ఖాన్‌ని సైతం వదలకుండా ఒకే ఓవర్‌లో 26 పరుగులు బాదాడు. దీంతో సియాటెల్ ఆర్కాస్ 2 వికెట్లు మిగిలి ఉండగానే 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. Heinrich Klaasen smashed 6,6,2,4,6 against Rashid … Read more

    టీజీ వెంకటేశ్ స్పీచ్ వీడియో వైరల్

    బ్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కజిన్ బీజేపీ నేత టీజీ వెంకటేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర బృందం పేర్లను పలకడంలో కాస్త తడబడ్డారు. డైరెక్టర్ సముద్రఖనికి బదులు సముద్రాల అని; సాయితేజ్‌ని ధర్మతేజ; తమన్‌ని తమన్నా అని, కేతిక శర్మను కీర్తి శర్మ.. అంటూ ఉచ్ఛరించారు. దీంతో ఆడిటోరియంలో ఉన్న ఫ్యాన్స్ ఘొల్లున అరిచారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ??? pic.twitter.com/rDDW5PfmH5 — Vijay Prince (@iam_VijayPrince) July 25, 2023

    సిమెంట్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం

    TS: మేళ్ల చెరువులోని మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. 500 అడుగుల ఎత్తులో కాంక్రీట్ వర్క్ చేస్తుండగా లిఫ్ట్ కూలి కాంట్రాక్ట్ కార్మికులు కిందపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందినట్లుగా సమాచారం. బాధితులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారుగా తెలుస్తోంది. అనుమతి లేకుండా నూతనంగా నిర్మిస్తున్న యూనిట్-4 ప్లాంట్ వద్ద ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. ప్రమాదంపై మై హోమ్ యాజమాన్యం గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మేళ్ల చెరువులోని మై హోం సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం.. ఐదుగురు మృతి మృతుల … Read more

    బ్రో థీమ్ సాంగ్ వచ్చేసింది

    పవన్ కళ్యాణ్, సాయితేజ్ మల్టీస్టారర్ ‘బ్రో’ సినిమాలోని థీమ్ సాంగ్‌ని చిత్రబృందం రిలీజ్ చేసింది. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకుంది. సముద్రఖని దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో నిర్మితమవుతోంది. ఈ నెల 28న సినిమా రిలీజ్ కానుంది.

    ట్రాఫిక్ నియంత్రణకు పరిష్కారం లేదా?

    TS: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. అయితే, వర్షం పడినప్పుడు ఇది మరింత తీవ్రంగా మారుతోంది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి హైటెక్ సిటీలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఉద్యోగులంతా ఒక్కసారిగా బయటకు రావడంతో వాహనాలు బారులు తీరాయి. అయితే, ఉద్యోగులకు సాఫ్ట్‌వేర్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం కల్పిస్తే కొద్ది మేరకు సమస్య పరిష్కారం కావొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు కంపెనీలు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్? వర్షాకాలంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం … Read more