TS: కుమారుడి మృతితో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అచలమయ్యారు. పెద్ద కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి లేడన్న భావన ఆయన్ను తీవ్రంగా కలచి వేస్తోంది. ఈ క్రమంలో కుమారుడి పార్థివ దేహం వద్దే కూర్చుని లోలోపల కుమిలిపోయారు. బోరున విలపించడంతో సొమ్మసిల్లి అక్కడే కుప్పకూలిపోయారు. స్థానిక నేతలు, కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేని పక్కకి తీసుకెళ్లారు. గత కొంత కాలంగా విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు.
-
Courtesy Twitter:@TeluguScribe
-
© File Photo