• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చౌరస్తాలో మందుకొట్టిన యువకులు

    TS: హైదరాబాద్ పరిధిలోని సైబర్ టవర్స్ వద్ద అల్లరి మూకలు బరితెగించాయి. సైబర్ టవర్స్ సిగ్నల్ వద్ద ఉన్న ట్రాఫిక్ బూత్‌లో ఇద్దరు యువకులు మందు కొట్టారు. అందరూ చూస్తుండగానే వారు తాపీగా మద్యం సేవించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆకతాయిలను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. ఈ వీడియోను నెట్టింట పోస్ట్ చేయగా యువకులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మందు తాగడానికి అడ్డగా మారిన ట్రాఫిక్ బూత్#madhapur #hitechcity@CPCyberabad @cyberabadpolice @CYBTRAFFIC @TelanganaDGP pic.twitter.com/XqE8WI4I8Q — HEMA (@Hema_Journo) … Read more

    టమాటాలు తినడం మానేయండి: మంత్రి

    దేశంలో టమాట ధరలు భగ్గుమంటున్న వేళ యూపీ మహిళా మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టమాటా ధరలు పెరుగుతున్నాయని అడిగితే ‘టమాటా ధరలు పెరిగితే తినడం మానేయండి. టమాటాలకు బదులు నిమ్మకాయలు వాడండి. లేదంటే ఇంట్లోనే పండించుకోండి. ఎవరూ తినకుండా ఉంటే ధరలు వాటంతట అవే దిగి వస్తాయి కదా’ అంటూ చెప్పుకొచ్చారు. మంత్రి ప్రతిభా శుక్లా చెప్పుకొచ్చారు. ఈమె వ్యాఖ్యలపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. యూపీ ప్రభుత్వంలో ఈమె మహిళా, శిశు, పోషకాహార శాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. టమాటా … Read more

    చెత్తను ఏరివేసిన మంత్రి హరీశ్

    TS: మంత్రి హరీశ్ రావు ఉదయం సిద్దిపేటలో పర్యటించారు. ఈ సందర్బంగా 18వ వార్డులో స్వచ్ఛ పట్టణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వతహాగా డ్రైనేజీలోని చెత్తను ఏరేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. నడుస్తూ చెత్తను తొలగించే కార్యక్రమంలో పట్టణ పౌరులుగా, సామాజిక బాధ్యతగా ప్రజలందరు భాగస్వామ్యం కావాలన్నారు. చెత్త కుండీ లేని సిద్దిపేట గా మారుద్దామని పిలుపునిచ్చారు. డ్రైనేజీలో చెత్త తీసి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన … Read more

    బస్సు టైర్ కింద తల పెట్టి ఆత్మహత్య

    TS: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చావును కొని తెచ్చుకున్నాడు. కదులుతున్న ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లి వెనక చక్రాల కిందికి దూరాడు. చాకచక్యంగా డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ శరీరంపైకి కొద్దిమేర టైర్ ఎక్కింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. మృతుడిని వెస్ట్ బెంగాల్‌కు చెందిన బిసు రాజాబ్‌గా గుర్తించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆత్మహత్యగా ధ్రువీకరించారు. బస్సు టైర్ కింద తల పెట్టి ఆత్మహత్య … Read more

    స్లిప్‌లో రహానె అద్భుత క్యాచ్

    అజింక్య రహానె ఫీల్డింగ్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, స్లిప్‌లో ఈ టీమిండియా ఫీల్డర్ పనితనం ఎంతో చురుగ్గా ఉంటుంది. తక్కువ ఎత్తులో వచ్చే బంతుల్ని ఒక్క చేత్తోనే ఒడిసి పట్టుకోవడంలో దిట్ట. తాజాగా, వెస్టిండీస్ మ్యాచ్‌లోనూ ఇది నిరూపితమైంది. జడేజా వేసిన బంతిని బ్యాటర్ బ్లాక్‌వుడ్‌ డిఫెండ్ చేయబోయాడు. కానీ, ఎడ్జ్‌కి తగిలి స్లిప్ దిశగా దూసుకెళ్లింది. కీపర్‌ని దాటుకుని వెళ్తుండగా ఆఫ్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రహానె ఎడమచేత్తో ఒడిసి పట్టాడు. Marvelous Ajinkya Rahane in … Read more

    పార్లమెంట్ ఎదుట పోటాపోటీగా నిరసన

    ఉభయ సభల సమావేశాలు నేడు పున: ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంట్‌ ఎదుట అధికార, విపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. మణిపుర్ అల్లర్లపై విపక్ష పార్టీలు నిరసన చేస్తుంటే, రాజస్థాన్‌లో మహిళల ఆకృత్యాలపై బీజేపీ ప్రశ్నిస్తోంది. దీంతో పార్లమెంట్ భవనం ఎదుట ఇరు వర్గాల మధ్య పోటాపోటీ నెలకొంది. నాయకులు ధర్నాకు దిగారు. ఎవరికి వారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మణిపుర్ అల్లర్లపై ఉభయ సభల్లో ప్రధాని ప్రకటన చేయాలంటూ ఇండియా కూటమి సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. #WATCH | Opposition parties … Read more

    ‘అర్జున’ వచ్చేశాడు.. టీజర్ ఎలా ఉంది?

    వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. ఈ సినిమా టీజర్‌ని చిత్రబృందం నేడు విడుదల చేసింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు. ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్ల ముందుకు రానుంది. మరి, టీజర్ ఎలా అనిపించిందో చూసి మీరే చెప్పండి.

    చెప్పింది చెప్తావా.. పీక కోసెయ్యనా..!

    డైరెక్టర్ అనిల్ రావిపూడిని సీనియర్ నటుడు బ్రహ్మాజీ బెదిరించాడు. మెడపై కత్తి పెట్టి మరీ చెప్పిన పని చేయించుకున్నాడు. బ్రహ్మాజీ కుమారుడు హీరోగా చేసిన ‘స్లమ్‌డాగ్ హస్బెండ్’ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తన కుమారుడి సినిమాను ప్రమోట్ చేయాలని అనిల్ దగ్గరకి బ్రహ్మాజీ వచ్చాడు. దానికి అనిల్ నిరాకరిస్తాడు. ఈ క్రమంలో కత్తి పెట్టి మరీ చెప్పిస్తాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘భగవంత్ కేసరి’లో బ్రహ్మాజీ నటిస్తున్న విషయం తెలిసిందే. … Read more

    కొట్టుకుపోయిన గ్యాస్ సిలిండర్లు

    గుజరాత్ రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. జునాగఢ్, నవసారి జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. తీవ్ర వరదలకు వాహనాలు, పశువులు కొట్టుకుపోతున్నాయి. నవసారి పట్టణంలోని ఓ గ్యాస్ గోదాంలో నిల్వ ఉంచిన ఎల్పీజీ సిలిండర్లు నీటి మయమయ్యాయి. నీటిపై తేలుతూ గోదాం నుంచి బయటకి కొట్టుకొచ్చాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అటు, వరద నివారణకు ప్రభుత్వ యంత్రాంగం తగిన చర్యలను తీసుకుంటోంది. గుజరాత్ – భారీ వర్షాలకు నవ్‌సారి పట్టణంలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి.#GujaratRain #GujaratRains pic.twitter.com/SQDkRiaG4Q — Telugu Scribe (@TeluguScribe) July … Read more

    పట్టు వదలని పవన్ కళ్యాణ్

    AP: వాలంటీర్ల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పట్టు వదలట్లేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై పవన్ కళ్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. తాను అడుగుతున్న 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. ‘వాలంటీర్ల బాస్‌ ఎవరు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? ప్రజల వ్యక్తిగత డేటా సేకరించి ఎక్కడ భద్రపరుస్తున్నారు?’ అని పవన్‌ ట్వీట్ చేశారు. Everyone’s concern is same .. my dear Watson!. Data privacy laws … Read more