TS: భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీటికి కాజీపేట రైల్వే స్టేషనులోని ట్రాక్‌పై నీరు వచ్చి చేరింది. ట్రాక్ మీద రెండు అడుగుల మేర నీరు నిల్వ ఉంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసి, దారి మళ్లించింది. ఇప్పటికే 6 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, పది రైళ్లను దారి మళ్లించింది. వర్షపు నీరు తొలగించడానికి స్టేషన్ అధికారులు సమాయత్తం అవుతున్నారు.
-
Courtesy Twitter:@krishna0302
-
Courtesy Twitter:@krishna0302