ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కొరియన్ కంటెంట్‌పై 2016 నుంచి పెట్టిన పెట్టుబడులు రెట్టింపు చేయనున్నారు. ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువ వస్తుండటంతో రానున్న నాలుగేళ్లలో రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. భారత్‌లోనూ ఈ సినిమాలు, సిరీస్‌లు చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మరి నెట్‌ఫ్లిక్స్‌లో చూడదగిన కొరియన్ డ్రామాలేంటో ఓసారి చూద్దాం.
1. SQUID GAME
ఈ సిరీస్ 2021లో విడుదలై సంచలనమే సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10లో దాదాపు 90 దేశాల్లో మెుదటి స్థానంలో నిలిచింది. స్క్విడ్ గేమ్ ఓ థ్రిల్లర్ సర్వైవల్ డ్రామా. ఇందులో అప్పులతో సతమతమై డబ్బుల కోసం చూస్తున్న కొంతమందిని ఓ ఆట ఆడితే ప్రైజ్ మనీ ఇస్తామని తీసుకెళతారు. ప్రతి ఆటలో ఎలిమినేట్ అయినవారిని చంపుతుంటారు. చివరకు ఎవరు మిగిలారు. వాళ్లకు డబ్బులిచ్చారా లేదా? ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది కథ. మీరు చూడకపోయి ఉంటే కచ్చితంగా ఇప్పుడు చూడండి.
2. MY NAME
మై నేమ్ కొరియన్ డ్రామా 2021లో విడుదలయ్యింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఇది మంచి ట్రీట్. గ్యాంగ్‌స్టర్ అయిన తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఓ మహిళ. ఇందుకోసం ఓ గ్యాంగ్‌లో చేరుతుంది. నకిలీ పేరుతో చలామణీ అవుతూ పోలీసులను నమ్మిస్తుంటుంది. అంతేకాదు, నార్కోటిక్స్ అమ్మే ఓ డిటెక్టివ్‌తో జతకట్టి పగ తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి.
3. MR. SUNSHINE
మిస్టర్ సన్ షైన్ లవ్ పొలిటికల్, హిస్టారికల్ డ్రామా. జోసియన్ దేశంలో బానిస కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి యూఎస్ పారిపోతాడు. తిరిగి వచ్చిన తర్వాత చిన్నప్పుడే నిశ్చితార్థం అయిన ఓ యువతితో ప్రేమలో పడతాడు. కథ మెుత్తం వీరి ప్రేమ, రాజకీయం, చరిత్రతో ముడిపడుతూ ఉంటుంది. కొరియన్ దేశానికి సంబంధించిన చరిత్ర గురించి ఈ సినిమా ద్వారా తెలుసుకోవచ్చు.
4. CRASH LANDING ON YOU
రొమాంటిక్ డ్రామాలంటే ఇష్టముండే వారికి క్రాష్ ల్యాండింగ్ ఆన్ యూ ఓ అద్భుతమైన సిరీస్. ఇది హృదయాన్ని హత్తుకునే టెలివిజన్ డ్రామా. సౌత్ కొరియా రాజకుటుంబానికి చెందిన ఓ వారసురాలు అనుకోకుండా సైనిక రహిత జోన్ మీదుగా నార్త్ కొరియాలోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఓ యువ సోల్డియర్ ఆమెను తీసుకొని వెళతాడు. ఇది కొరియాలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
5. OUR BLUES
ఈ సిరీస్ 2022లో విడుదలైన ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్. జెజూల్యాండ్ అనే ప్రాంతంలో రోజువారీ సంఘటనలు, మనుషుల జీవితాల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సిరీస్ చూస్తున్నప్పుడల్లా అందులో ఉన్నది మనమే అనే భావన కలిగేలా రూపుదిద్దుకుంది. కొరియన్ డ్రామాల్లో కాస్త రియలిస్టిక్‌గా ఉన్న సిరీస్ ఇది.
6. SIGNAL
షెర్‌లాక్, బ్రాడ్ చర్చ్ ఫ్యాన్స్ ఈ సిరీస్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు. క్రైమ్ సస్పెన్స్ నేపథ్యంలో తెరకెక్కింది. సిగ్నల్ ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించారు. ఓ క్రిమినల్ ప్రొఫైల్‌కు 2015లో ఓ వాకీ టాకీ దొరకుతుంది. దానితో అతడు 1989లోని పోలీసుతో మాట్లాడతాడు. అలా ఓ కేసును చేధిస్తారు. ఇందులో దృష్టి మరల్చలేని ట్విస్టులతో సీటు అంచుల్లో కూర్చుంటారు.
7. ALL OF US ARE DEAD
జాంబీ జోనర్‌లో వచ్చిన సిరీస్ ఇది. కొందరు విద్యార్థులు ట్రాప్ చేయబడతారు. ఓ సైన్స్ ఎక్సపర్‌మెంట్ విఫలమైన జాంబీ వ్యాప్తిలో చిక్కుకున్నారని గ్రహిస్తారు. ఇది ప్రేక్షకులను చాలా థ్రిల్ చేస్తుంది.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!