ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమా
మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఆగస్టు 25న విడుదలై డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. మరి ఓటీటీలోనైనా సక్సెస్ అవుతుందేమో చూడాలి.