ఇండియాలో ఉన్న కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు సిద్ధమైంది ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్. ఇందులో బాగంగా టేక్ టెన్ అనే కాన్సెప్ట్‌ను ప్రకటించింది. యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కు ఒక కాంపిటీషన్ పెట్టి ఉత్తమ ప్రదర్శన కనబరిచినవారికి..అవార్డు గ్రహీతలైన క్రియేటర్స్ నిర్వహించే వర్క్‌షాప్‌లో పాల్గొనే అవకాశం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు నెట్‌ఫ్లిక్స్ స్వయంగా 10,000 డాలర్లు ఖర్చు చేసి షార్ట్ ఫిల్మ్ తీసే ఆఫర్‌ను అందిస్తుంది. వారు తీసిన ఆ షార్ట్ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తారు.
దేశంలోని విభిన్న ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్నమైన నేపథ్యాలు కలిగిన వారు వారి ఆలోచనల ఆధారంగా కొత్త కాన్సెప్ట్‌తో ముందుకువచ్చేందుకు ప్రోత్సహిస్తుంది.
అయితే దీనికోసం దరఖాస్తు చేసుకునేవాళ్లు 18 ఏళ్లు పైబడిన భారత పౌరులు, ఇక్కడే స్థిరపడినవారై ఉండాలి. రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమవుతుంది. మీరు ఎంచుకున్న టాపిక్‌ను 2 నిమిషాల వీడియోలో మొబైల్‌తో షూట్ చేసి ఆ వీడియోను పంపించాల్సి ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్‌లో వారు ఏ విభాగానికి చెందినవారో చెప్పాలి. అందులో బెస్ట్ వీడియోస్ చేసిన పది మందిని సెలక్ట్ చేస్తారు.
టేక్ టెన్ క్రియేటివ్ ఈక్విటీ కోసం నెట్‌ఫ్లిక్స్ ఫండ్ స్పాన్సర్ చేయనుంది. ఐదు సంవత్సరాలకుగాను..ఏడాదికి 100 మిలియన్ డాలర్లు కేటాయించనుంది. వేర్వేరు కమ్యూనిటీల నుంచి వచ్చే ఈ తరం ఔత్సాహికులకు ఇది మద్దతుగా ఉండనుంది.
టేక్ టెన్‌తో ఎక్కడినుంచైనా కొత్త కథలు రావొచ్చని, యంగ్ ఫిల్మ్‌మేకర్స్ అత్యుత్తమ క్రియేటర్స్ వద్ద శిక్షణ పొందవచ్చని Netflix విదేశాంగ వ్యవహారాల ఆసియా పసిఫిక్ హెడ్ అమీ సవిట్టా లెఫెవ్రే చెప్పారు.
పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ