• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • RRRను కాదని ఆస్కార్స్‌కు గుజరాతీ సినిమా..కారణం ఇదేనా!

    ప్రపంచానికి భారతీయ సినిమా ఖ్యాతిని చాటిన సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌. రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌ ఇలా అందరిపేర్లు విశ్వవ్యాప్తంగా మార్మోగాయి. ఈ సారి ఆస్కార్‌ బరిలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో పాటు ఎన్టీఆర్, రామ్‌ చరణ్ పేర్లు కూడా ఉంటాయని ఎంతోమంది ప్రముఖ సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ చివరికి అందరికీ నిరాశే మిగిలింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుజరాతీ సినిమా ‘చెల్లో షో’(the last film show)ను ఇండియా నుంచి ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక చేసింది. అంత బజ్ క్రియేట్ చేసిన … Read more

    ఏ బిడ్డా.. ఇక బాలీవుడ్‌కు హైదరాబాద్ అడ్డా..!

    అది ఓ అవార్డుల ఫంక్షన్. బాలీవుడ్ హేమాహేమీలు అంతా అక్కడే ఉన్నారు. ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ నుంచి మన మెగాస్టార్‌కి ఆహ్వానం అందింది. ఆ పిలుపుతో ముంబయి వెళ్లిన ఆనందం చిరుకి ఎక్కువ సేపు నిలవలేదు. కారణం అక్కడ ఏ దక్షిణాది హీరో కటౌట్ లు, ఫోటోలు లేకపోవడం. దీనిపై మెగాస్టార్ విస్మయం చెందారు. ఉండబట్టలేక నేరుగా అక్కడే అడిగేశారు మా సౌత్ హీరోల ఫొటోలు ఒక్కటి కూడా లేవే అని! దక్షిణాది చిత్రాలంటే వారికి లేక్కలేదు. దక్షిణాది హీరోలని వాళ్లు పట్టించుకోరు. … Read more

    భారత్‌ను వెంటాడుతున్న బౌలింగ్ సమస్య.. ఆస్ట్రేలియా గడ్డపై పరిస్థితేంటి?

    ఆసియా కప్ లో భారత బౌలింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ 4 మ్యాచుల్లో బౌలింగ్ దళం తన స్కోరును కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు చేతులెత్తేశారు. అయితే, ఇప్పుడు కళ్లన్నీ రానున్న టీ20 ప్రపంచకప్ మీదే. ఆస్ట్రేలియా గడ్డపై జరగనున్న ఈ టోర్నీకి అత్యుత్తమ బౌలింగ్ దళం కావాలి. మరి టీమిండియా ప్రస్తుత పరిస్థితి ఏంటి? కంగారూల పిచ్ లపై మన బౌన్స్ ప్రభావమెలా ఉండబోతోందనేది చర్చనీయాంశం.  జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్ త్రయం టీమిండియా బౌలింగ్ … Read more

    ఊర్వశీని చూడగానే.. ‘పంత్.పంత్‌…’ అరుపులు.. వీరి మధ్య ఎఫైర్ నిజమేనా?

    దేశవ్యాప్తంగా వినాయకచవితి ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. సినీతారలు ఉత్సాహంగా వేడుకలు జరుపుకొంటున్నారు. బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా ఇలాగే ముంబయిలో ఉత్సవాలలో పాల్గొంది. లెహంగాతో అందంగా ముస్తాబై ఈ వేడుకకు వచ్చింది. హుషారుగా అక్కడ కాసేపు గడిపింది. ఆ తర్వాత ఇంటికెళ్లి.. ఓ పోస్టు పెట్టింది. ‘ఈ మ్యాటర్‌ని ఇంతటితో వదిలేయండి. లేకపోతే….’ అంటూ అందులో రాసుకొచ్చింది. ఇంతకీ ఏమైంది! వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న ఊర్వశీకి చేదు అనుభవం ఎదురైంది. ఊర్వశీని చూడగానే.. అక్కడి ప్రజలు రిషభ్ పంత్.. రిషభ్ పంత్ అని అరవడం … Read more

    పూరీ జ‌గ‌న్నాథ్ మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌స్తాడా?

    పూరీ జ‌గ‌న్నాథ్ ఒక మాస్ డైరెక్ట‌ర్‌గా గ‌తంలో బెస్ట్  డైరెక్ట‌ర్స్‌గా నిలిచాడు. ముఖ్యంగా హీరోయిజం చూపించాలంటే, హీరోల‌తో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ చెప్పించాలంటే అది పూరీనే. ఇండ‌స్ట్రీకి వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రూ ఆయ‌న‌తో ఒక్క సినిమా చేయాల‌ని అనుకునేవారు. పూరీ హీరోల ఎలివేష‌న్ మామూలుగా ఉండ‌దు. ర‌వితేజ‌, అల్లు అర్జున్‌, మ‌హేశ్ బాబును మాస్ హీరోలుగా మార్చింది పూరీ అనే చెప్పుకోవాలి. ఇక టెంప‌ర్‌లో కూడా ఎన్‌టీఆర్ ఒక విభిన్న‌మైన పాత్ర‌లో చూపించాడు. పోకిరి సినిమాను స‌ల్మాన్‌ఖాన్ హిందీలో వాంటెడ్‌గా తెర‌కెక్కించాడు.  ఆ సినిమాతో స‌ల్మాన్ … Read more

    పవర్ స్టార్ వద్దన్న సినిమాలు.. ఇండస్ట్రీ హిట్లు..!

    పవన్ కళ్యాణ్.. సినిమా సముద్రంలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం. ఆయన సినిమా తీస్తే.. ప్రేక్షకులకు పండగొస్తుంది. చిరునవ్వు నవ్వితే.. అందరి మొఖాల్లో ఆనందమొస్తుంది. మెడపై చేయి నిమిరితే.. అభిమానులకు కొండంత బలమొస్తుంది. సినీ ఇండస్ట్రీలో తనొక ఫైటర్. అమ్మాయిల మదిని దోచే లవర్. విలన్లకు చెమట పుట్టించే ఫయర్.  ఎన్నో ఇండస్ట్రీ హిట్లు ఆయన సొంతం. అయితే, పవన్ వద్దనుకున్న సినిమాల్లో కొన్ని బ్లాక్ బ్లస్టర్లుగా నిలిచాయి. అందులో నటించిన వారికి గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. సెప్టెంబరు 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా YouSay … Read more

    వినాయక చవితికి ఈ పాటలను అస్సలు మర్చిపోలేం..!

    ఆదిదేవుడు గణపతికి పూజ చేయకుండా కెమెరా ఆన్ కాదు. క్లాప్పింగ్ పడదు. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిత్రపరిశ్రమలో సందడే సందడి. కొత్త సినిమా ప్రకటనలతో, ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ విడుదలతో పండుగ చేసుకుంటుంది. తారల సెలబ్రేషన్స్ ఈ ఉత్సవానికి అదనపు ఆకర్షణ. అయితే, ఏకదంతుడిపై రూపొందిన కొన్ని గేయాలు ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంటాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..! దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. వినాయక చవితికి ఏ మండపం వద్ద చూసినా, ఏ వీధిలోకెళ్లినా.. తప్పక వినిపించే పాట.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. దయుంచయ్యా … Read more

    సెప్టెంబ‌ర్ 2022లో రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలు

    సెప్టెంబ‌ర్‌లో చాలా తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద క్యూ క‌డుతున్నాయి. మొత్తం 17 సినిమాలు వ‌చ్చే నెల‌లో రిలీజ్ అవుతున్నాయి. బ్ర‌హ్మాస్‌, పొన్నియ‌న్ సెల్వ‌న్ వంటి బ‌డా సినిమాల‌తో పాటు, మీడియం, చిన్న సినిమాలు కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. మ‌రి సెప్టెంబ‌ర్ నెల‌లో బాక్సాఫీస్ వ‌ద్ద అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న ఆ సినిమాల జాబితాను ఒక‌సారి ప‌రిశీలిస్తే.. రంగరంగ వైభవంగా: సెప్టెంబ‌ర్ 2 వైష్ణ‌వ్ తేజ్, కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన రంగ‌రంగ వైభ‌వంగా సినిమా సెప్టెంబ‌ర్ 2న రిలీజ్ కానుంది. ఈ ఫ్యామిలీ … Read more

    HBD ‘సెల్యూలాయిడ్ సైంటిస్ట్‌’ అక్కినేేని నాగార్జున

    అమ్మాయిలకు ‘మన్మథుడు’, కుంటుంబ ప్రేక్షకులకు అన్నమయ్య, భక్త రామదాసు, యువతకు ‘శివ’, ప్రేమికులకు ప్రకాశ్….ఇలా తనదైన స్క్రిప్ట్‌ సెలెక్షన్‌తో ప్రతి తెలుగు ప్రేక్షకుడి హృదయాన్ని తాకిన నటుడు నాగార్జున.  అక్కినేని వారి నట వారసత్వంతో సినిమాల్లోకి వచ్చినా తన  విలక్షణమైన స్క్రిప్ట్‌ సెలెక్షన్‌తో ‘సెల్యూలాయిడ్‌ సైంటిస్ట్‌’గా పేరు సంపాదించిన ‘కింగ్‌’ నాగార్జున నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. YouSay ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయన స్క్రిప్ట్‌ సెలెక్షన్‌లోని విలక్షణతను ఓ సారి చూద్దాం. అందరికీ భిన్నంగా ఉండటం వల్లే ‘కింగ్‌’  ఆగస్ట్ 29, 1959లో … Read more

    ‘8Kbలో పూర్తి సినిమా’ కానీ….ఏం జరిగింది?

    సాధారణంగా ఒక సినిమా ఫోన్‌లో స్టోర్‌ చేయాలంటే ఎంత మెమొరీ అవసరం? 500Mb నుంచి క్లారిటీని బట్టి 8Gb వరకు కూడా ఉండొచ్చు. ఫోన్‌లో తీసే ఒక్క ఫోటోనే ప్రస్తుతం 10Mb వరకు ఉంటోంది. కానీ 1995లోనే కేవలం 8Kbలో పూర్తి సినిమాను స్టోర్‌ చేయగల సాంకేతిక అభివృద్ధి చేశారని మీకు తెలుసా?! ‘స్లూట్‌ డిజిటల్ కోడింగ్‌ సిస్టమ్‌’గా పిలిచే ఈ సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసే కొద్ది రోజుల ముందే అనూహ్య పరిణామం జరిగింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ సాంకేతికత … Read more