• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘8Kbలో పూర్తి సినిమా’ కానీ….ఏం జరిగింది?

    సాధారణంగా ఒక సినిమా ఫోన్‌లో స్టోర్‌ చేయాలంటే ఎంత మెమొరీ అవసరం? 500Mb నుంచి క్లారిటీని బట్టి 8Gb వరకు కూడా ఉండొచ్చు. ఫోన్‌లో తీసే ఒక్క ఫోటోనే ప్రస్తుతం 10Mb వరకు ఉంటోంది. కానీ 1995లోనే కేవలం 8Kbలో పూర్తి సినిమాను స్టోర్‌ చేయగల సాంకేతిక అభివృద్ధి చేశారని మీకు తెలుసా?! ‘స్లూట్‌ డిజిటల్ కోడింగ్‌ సిస్టమ్‌’గా పిలిచే ఈ సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేసే కొద్ది రోజుల ముందే అనూహ్య పరిణామం జరిగింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ సాంకేతికత గుట్టు బయటికి రాలేదు. ఇంత అద్భుతమైన సాంకేతికత ప్రజల్లోకి ఎందుకు రాలేదు? అసలు ఆ రోజు ఏం జరిగింది? 

    https://jansloot.telcomsoft.nl/

    స్లూట్‌ కోడ్‌ ఎలా పుట్టింది

    స్లూట్‌ డిజిటల్‌ కోడింగ్‌ సిస్టమ్‌ను ‘రోమ్కే జాన్ బెర్న్‌హార్డ్‌ స్లూట్‌’ 1995-1999 మధ్య అభివృద్ధి చేశాడు. 1945లో పుట్టిన స్లూట్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. చదువును కూడా మధ్యలోనే ఆపేశాడు. కొంతకాలం రేడియో స్టేషన్లో పనిచేశాడు. ఆ తర్వాత ఫిలిప్స్‌ ఎలక్ట్రానిక్స్‌, పలు ఆడియో వీడియో స్టేషన్లలో పనిచేశాడు. ఆ తర్వాత తానే సొంతంగా రిపేర్‌ సర్వీస్‌ ప్రారంభించాలనే ఉద్దేశంతో రెపాబేస్‌ అనే సర్వీస్‌ను ప్రారంభించాడు. అక్కడే డేటా స్టోరీజికి సాంప్రదాయ పద్ధతులకు ప్రత్యామ్నాయంగా ఏదైనా కనుగొనాలనే ప్రేరణ కలిగింది.1995లో 8kbలోనే పూర్తి సినిమా స్టోర్ చేయగల సామర్థ్యమున్న కోడ్‌ టెక్నాలజీని స్లూట్‌ అభివృద్ధి చేశాడు. 

    స్లూట్‌ కోడింగ్‌ సిస్టమ్ ఏంటి?

    స్లూట్‌ కోడింగ్‌ సిస్టమ్‌లో సినిమాను సినిమాలా కాకుండా కలర్స్‌, సౌండ్స్‌కి సంబంధించిన బ్లాక్స్‌లా స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే స్లూట్‌ కోడింగ్‌ సిస్టమ్‌( SDCS)కు ఓ ప్రత్యేక నంబర్‌ ఇస్తామో అది ఆ నంబర్‌ ఆధారంగా కలర్స్‌, సౌండ్స్‌ను రూపొందించి ఓ సినిమాను ఇస్తుంది. ఏ రెండు సినిమాలకు కూడా ఒకే నంబర్‌ ఉండకూడదు. స్లూట్‌ కోడింగ్‌లో నంబర్స్‌తో మాయ చేయడం ద్వారా ఒక సినిమాలో ఇంకో హీరోను కూడా చూపించవచ్చని స్లూట్‌ చెప్పేవాడు. అంటే పుష్ప సినిమా కోడింగ్ లో నంబర్స్ మార్చడం ద్వారా ఆ ప్లేసులో ప్రభాస్ ను రీప్లేస్ చేయొచ్చు అన్నమాట.

    1999లో పూర్తిగా అభివృద్ధి

    1996లో స్లూట్‌ కోడింగ్‌కు పెట్టుబడులు వచ్చాయి. అలాగే డచ్‌ ప్రభుత్వం నుంచి పేటెంట్‌ రైట్స్‌ కూడా వచ్చాయి. 1999లో మరికొంత మంది ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. అప్పుడే ఫిలిప్స్‌లో పనిచేస్తున్న పైపర్‌ అనే వ్యక్తి కూడా అక్కడ రాజీనామా చేసి వచ్చి స్లూట్‌ సంస్థలో సీఈఓగా చేరాడు. శాంపిల్ గా ఓ 20 నిమిషాల వీడియోను అతి తక్కువ స్టోరేజీ సామర్థ్యంతో స్టోర్‌ చేసి చూపించారు కూడా. మరికొద్ది రోజుల్లోనే ఇక కోడ్‌ను ప్రపంచానికి పరిచయం చేద్దామనుకున్నారు. తెల్లవారితే డీల్‌కు సంతకం చేయాల్సి ఉంది కానీ..

    ఏం జరిగింది?

    జులై 11, 1999, స్లూట్‌ తన గార్డెన్‌లో విగత జీవిగా పడిఉన్నాడు. గుండెపోటుతో చనిపోయాడు అని అంతా అన్నారు. డీల్‌కు ఒకరోజు ముందు స్లూట్‌ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృత దేహానికి పోస్టుమార్టం కూడా చేయలేదు. స్లూట్ చనిపోయాక అతని స్నేహితులు స్లూట్‌ కోడ్‌ను కొనసాగించే ప్రయత్నం చేశారు కానీ, అందుకు సంబంధించిన ఓ కీలకమైన ఫ్లాపీ డిస్క్ కనిపించకుండా పోయింది. దానికోసం నెలల తరబడి వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. కొంత మంది అతడి మరణం వెనక కుట్ర దాగి ఉందని అంటారు. సహజ మరణం కాదని కూడా చెబుతారు. కానీ ఏం జరిగిందో ఎవరికీ తెలియని రహస్యం.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv