• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరంజీవిని మెగాస్టార్ చేసిన 5 సినిమాలు

    ‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండ‌స్ట్రీలో ఒక చిన్న న‌టుడిగా అడుగుపెట్టారు చిరంజీవి. ఆ త‌ర్వాత అంచెలంచెలుగా ఎదిగా మెగాస్టార్‌గా మారారు. మ‌రి చిరంజీవి మెగాస్టార్‌గా మారడానికి ఉప‌యోగ‌ప‌డ్డ ఆ సినిమాలేంటో ఒక‌సారి తెలుసుకుందాం. ఖైదీ(1983) కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి న‌టించిన ఖైదీ చిత్రం 1983లో రిలీజ్ అయింది. ఈ మూవీ చిరంజీవికి భారీగా స్టార్‌డ‌మ్ తెచ్చిపెట్టింది. ఒక్క‌సారిగా అంద‌రిదృష్టి ఆయ‌న‌వైపు మ‌ళ్లింది. ఇందులో చేసిన యాక్ష‌న్ సీన్స్‌, యాంగ్రి యంగ్‌మ్యాన్‌లా చిరంజీవి న‌టించిన తీరు మెప్పించింది. మాధ‌వి ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. క‌మ‌ర్షియ‌ల్‌గా … Read more

    ఆసియా కప్ ఆల్ టైమ్ రికార్డ్‌లు (asia cup all time records)

    ఆసియా కప్ 15వ ఎడిషన్ ఆగస్టు 27, 2022న UAEలో ప్రారంభం కానుంది. ఈ పోటీల్లో ఛాంపియన్‌గా నిలిచేందుకు ఆరు దేశాల జట్లు పాల్గొంటున్నాయి. రెండు వారాల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌ సెప్టెంబర్ 11న ముగియనుంది. షార్జా, దుబాయ్‌లోని స్టేడియాల్లో మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ ఏలో బంగ్లాదేశ్, ఆప్గానిస్తాన్, శ్రీలంక ఉండగా.. ఇండియా, పాకిస్తాన్, హాంకాంగ్/ సింగపూర్/ కువైట్/UAE గ్రూప్ బీలో ఉన్నాయి. ఆసియా కప్‌ను T20 ఫార్మాట్‌లో నిర్వహించడం ఇది రెండోసారి. చివరిది 2016లో జరిగింది. T20కి ముందు … Read more

    రక్షా బంధన్ స్పెషల్: టాలీవుడ్ హీరోలు, వారి సోదరీమణులు

    అన్నాదమ్ములు, అక్కాచెళ్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వయసుతో సంబంధం లేకుండా తమ సోదరులకు చేతికి సోదరీమణులు రాఖీ కడతారు. సోదరులకు కట్టిన రాఖీ వారికి రక్షగా నిలుస్తుందని తోబుట్టువులు భావిస్తారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల సోదరీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరీమణులు ఐదుగురు తోబుట్టువుల్లో చిరంజీవి పెద్దవాడు. పవన్ కళ్యాణ్ నాల్గవవాడు. విజయ దుర్గ, మాధవి రావు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సోదరీమణులు. గతంలో పలు ఇంటర్వ్యూలలో … Read more

    బాక్సాఫీస్ రిక‌వ‌రీ మ‌ళ్లీ మొద‌లైందా?

    మంచి సినిమాలు తీస్తే ప్రేక్ష‌కులు త‌ప్ప‌కుండా థియేట‌ర్ల‌కు వ‌స్తార‌ని మ‌రోసారి రుజువైంది. ఆగ‌స్ట్ 5న విడుద‌లైన రెండు భారీ సినిమాలు సీతా రామం, బింబిసార బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నాయి. సాధార‌ణంగా రెండు బారీ బ‌డ్జెట్ సినిమాలు ఒకేసారి రిలీజ్ చేసేందుకు నిర్మాత‌లు కాస్త ఆలోచిస్తారు. కానీ వైజ‌యంతి మూవీస్‌, ఎన్‌టీఆర్ ఆర్ట్స్ ధైర్యం చేసి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ప్ప‌టికీ ప్రేక్ష‌కులు రెండింటినీ ఆద‌రిస్తున్నారు. బింబిసార‌కు ఓవ‌ర్సీస్‌లో మొద‌టిరోజే 100k డాల‌ర్స్ గ్రాస్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమాకు భారీ క‌లెక్ష‌న్లు … Read more

    టెలికాం రంగంపై 5G ప్రభావం ఎంత ?

    ఇటీవల భారత ప్రభుత్వం 5G నిర్వహించిన 5G స్పెక్ట్రమ్ వేలం విజయవంతం అయ్యింది. దీంతో అక్టోబర్ నుంచి 5G సేవలు కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే భారత టెలికాం రంగం, సేవలను 5G విపరీతంగా ప్రభావితం చేయనుంది. ఇది 4G కంటే 20 శాతం ఎక్కువ వేగంగా ఉంటుంది. సెకనుకు 1GB నుంచి 20GB వరకు నెట్ స్పీడ్ అందిస్తుంది. ఈ స్పీడ్‌తో ఏదైనా ఫైల్‌ను డౌన్లోడ్, అప్లోడ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకు, … Read more

    భారీ వానలు, ఆకస్మిక వరదలు.. కారణమేంటి?

    అనూహ్యంగా ముంచుకొస్తున్న వరదలు, ఆకస్మికంగా కురుస్తున్న భారీ వానలు, ఒక్క రోజులోనే అస్తవ్యస్తమవుతున్న జనజీవనం. గత నాలుగైదు ఏళ్లుగా ఇదే పరిస్థితి. వరుణుడి ప్రకోపానికి జన జీవనం కల్లోలమైపోతోంది. కానీ దీనంతటికీ కారణం ఒక దేశమో, ఒక ప్రాంతమో చేస్తున్న క్లౌడ్ బరస్ట్ అవునో కాదో తెలియదు గానీ, దశాబ్దాలుగా మానవులు చేస్తున్న తప్పిదాలే అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏళ్లుగా ప్రకృతిపై మానవుడి చర్యలకు ప్రతిచర్యలే ఈ వానలని చెబుతున్నారు. వానల వరం వరదల శాపంగా ఎలా మారింది? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ … Read more

    విజయ్ దేవరకొండ ‘లైగర్’ మరో పవన్ కల్యాణ్ ‘జానీ’ అవుతుందా?

    సుమారుగా 19 ఏళ్ల క్రితం అంటే 2003లో రిలీజ్ కు ముందే బీభత్సాన్ని సృష్టించిన సినిమా ‘జానీ’. ప్రస్తుతం అదే స్థాయిలో లైగర్ సినిమా బీభత్సం సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసమే భారీ కటౌట్లు ర్యాలీలు ఓ సినిమా రిలీజ్ అయిన స్థాయిలో రచ్చ. అలాగే సోషల్ మీడియాలోనూ ‘లైగర్’ మోత. అయితే కొందరు మాత్రం ఈ సినిమాను జానీ సినిమాతో పోలుస్తున్నారు. అసలు ఈ రెండింటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి? అప్పట్లో జానీ డిజాస్టర్ మరి ఇప్పుడు లైగర్ … Read more

    20 ఏళ్ల తర్వాత అవమానించిన రోజే గంగూలీకి ఇంగ్లాండ్ సన్మానం..

    ఏ రోజైతే బ్రిటీష్ మీడియా, ఆ దేశ క్రికెట్ అభిమానులు  భారత క్రికెట్ దిగ్గజం సౌరభ్ గంగూలీని పొగరుబోతు అని అవమానించిందో సరిగ్గా 20 ఏళ్ల తర్వాత సాక్షాత్తూ బ్రిటన్ ప్రభుత్వం ఆదేశ పార్లమెంటులోనే దాదాను సత్కరించింది. లెజండరీ క్రికెటర్ అని స్తుతించింది. అసలు గంగూలీపై బ్రిటీష్ మీడియా ఎందుకు చులకనగా మాట్లాడింది. ఇప్పుడెందుకు ఆ దేశం గంగూలీని సన్మానించిందో ఓసారి గతాన్ని వెతికే ప్రయత్నం చేద్దాం. భావోద్వేగాలు రగిల్చిన నాట్ వెస్ట్ ఫైనల్ 2002 జులై 13న లార్డ్స్​ నాట్ వెస్ట్ సిరీస్ … Read more

    హేయ్! హైదరాబాదీ!! వానలో విహరిద్దాం పద!(best getaways near hyderabad in rainy season)

    వానలో ఇంట్లో ముసుగు తన్నిపడుకునేవారు కొందరైతే, ప్రకృతి రమణీయతను ఆస్వాదించాలని, జలపాతాల్లో జలకాలాడాలని ఉవ్విళ్లూరే వారు కొందరు. హైదరాబాద్ లో ఉండే యువ ఉద్యోగుల్లో చాలామందికి ఈ ముసురులో దోస్తులతో విహారానికి వెళ్లడమంటే చాలా ఇష్టం. కానీ ఎక్కడి కెళ్లాలో తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. బొగత జలపాతం ప్రకృతి సృష్టించిన సుందర దృశ్యాల్లో బొగత జలపాతం ఒకటి. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి గాంచింది. ములుగు జిల్లా వాజేడు మండలం బొగత గ్రామంలో ఉన్న ఈ జలపాతం…పచ్చని ప్రకృతిలో, కొండ కోనలు వినిపించే … Read more

    తెలుగులో మనసుకు హత్తుకునే డైలాగ్స్ (emotional dialogues in telugu part-1)

    సినిమాల్లో ఎన్ని డైలాగులు ఉన్నా కొన్ని మన మనసుకు తాకుతాయి. అది స్నేహం, ప్రేమ, ఎమోషనల్, మోటివేషనల్ ఏదైనా కావొచ్చు, కానీ నేరుగా గుండెల్లోకి దూసుకెళ్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ మీకోసం.