ఇటీవల భారత ప్రభుత్వం 5G నిర్వహించిన 5G స్పెక్ట్రమ్ వేలం విజయవంతం అయ్యింది. దీంతో అక్టోబర్ నుంచి 5G సేవలు కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే భారత టెలికాం రంగం, సేవలను 5G విపరీతంగా ప్రభావితం చేయనుంది. ఇది 4G కంటే 20 శాతం ఎక్కువ వేగంగా ఉంటుంది. సెకనుకు 1GB నుంచి 20GB వరకు నెట్ స్పీడ్ అందిస్తుంది. ఈ స్పీడ్‌తో ఏదైనా ఫైల్‌ను డౌన్లోడ్, అప్లోడ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకు, మూవీ ఆఫీసులకు ఈ స్పీడ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో పాటు 5Gలో ఉన్న లో లెటెన్సీ వల్ల బిజినెస్ అప్లికేషన్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, వీడియో గేమ్స్, వీడియో కాన్ఫరెన్స్ వంటి రంగాల్లో గణణీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.
పెరగనున్న 5G ధరలు
4G కంటే అధిక వేగంగా 5G నెట్ స్పీడ్ ఉండడంతో డాటా కూడా అదే స్థాయిలో వినియోగం అవుతుంది. మనం తరచూ వినియోగించే 2GB, 3GB డాటా సరిపోదు. దీంతో డాటా కొనుక్కోవడానికి, టారిఫ్ రీఛార్జ్ చేసుకోవడానికి అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. దీంతో బిజినెస్ అప్లికేషన్స్, మొబైల్ గేమ్స్ వంటి సంస్థలు అధిక మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
సులభతరం కానున్న డేటా షేరింగ్
ఇంటిపై అమర్చిన యాంటీనా, వీధిలైట్లలో 5G స్మాల్ సెల్స్‌ను అమరుస్తారు. ఈ స్మాల్ సెల్స్ హై ఫ్రీక్వెన్సీతో పని చేస్తాయి. ఈ హై ఫ్రీక్వెన్సీ కారణంగా తక్కువ దూరంలో అధిక మొత్తంలో డేటాను షేర్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో పెద్ద పెద్ద సంస్థలు క్షణాల్లో తమ డేటాను షేర్ చేసుకోవచ్చు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!