సుమారుగా 19 ఏళ్ల క్రితం అంటే 2003లో రిలీజ్ కు ముందే బీభత్సాన్ని సృష్టించిన సినిమా ‘జానీ’. ప్రస్తుతం అదే స్థాయిలో లైగర్ సినిమా బీభత్సం సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కోసమే భారీ కటౌట్లు ర్యాలీలు ఓ సినిమా రిలీజ్ అయిన స్థాయిలో రచ్చ. అలాగే సోషల్ మీడియాలోనూ ‘లైగర్’ మోత. అయితే కొందరు మాత్రం ఈ సినిమాను జానీ సినిమాతో పోలుస్తున్నారు. అసలు ఈ రెండింటికీ మధ్య ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి? అప్పట్లో జానీ డిజాస్టర్ మరి ఇప్పుడు లైగర్ హిట్ కొడుతుందా ఓ సారి చూద్దాం.
‘లైగర్’ ట్రైలర్ బీభత్సం
ఒక సినిమా విడుదలకు ముందే ఇంత బీభత్స సృష్టించడం ఈ మధ్య కాలంలో అస్సలు చూసుండం. భారీ కటౌట్లు, ర్యాలీలు ఒక పవర్ స్టార్, సూపర్ స్టార్ సినిమా విడుదలకు ఉండే రచ్చ ట్రైలర్ రిలీజ్ కే చూపించారు. ఒక స్లమ్ లో పుట్టిన కుర్రాడు, మార్షల్ ఆర్ట్స్, ప్రేమ, బంధాలు, ఎమోషన్స్, మాస్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకుడు కోరుకునే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయని ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు పూరీ జగన్నాథ్. ఆల్రెడీ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు వెెల్లువెత్తుతున్నాయి. అయితే అందులోనే కొంతమంది ఈ సినిమాను పవన్ కల్యాణ్ జానీ తో పోలుస్తున్నారు. జానీ సినిమా కూడా మార్షల్ ఆర్ట్స్, ప్రేమ తరహా అనుబంధాలతో తెరకెక్కి, విడుదలకు ముందే బీభత్సం సృష్టించిన సినిమా. కానీ బాక్సా ఫీస్ వద్ద ఆ సినిమా బోల్తా పడింది.
‘జానీ’ ఒక్క మాటలో చెప్పలేని ఓ సినిమా
ఈ వీడియో చూశాక మీకూ లైగర్, జానీకి కాస్త దగ్గరి సంబంధం కనిపించింది కదూ. పవన్ కల్యాణ్ స్వయంగా కథ రాసుకుని దర్శకత్వం వహించిన సినిమా ‘జానీ’. ఈ సినిమాకు రేణు దేశాయ్ ప్రొడక్షన్ డిజైనర్, కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. చిన్నప్పుడే తండ్రికి దూరమైన ఓ కొడుకు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని నేర్పిస్తూ స్నేహితులతో బతుకుతుంటాడు. ఇదే క్రమంలో గీత అనే అమ్మాయితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. ఆమె బ్లడ్ క్యాన్సర్ అని తెలవడంతో ఆమె చికిత్స కోసం ఇష్టం లేకున్నా ఫైట్ క్లబ్ లో చేరి డబ్బులు సంపాదించి చికిత్స చేయిస్తాడు. ఆ తర్వాత వారు సంతోషంగా బతుకుతారు ఇదీ సినిమా. దీనికోసం పవన్ కల్యాణ్, ఎస్క్రిమా మార్షల్ ఆర్ట్స్, ఐకిడో లాంటి సరికొత్త ఫైట్లను నేర్చుకున్నారు. అప్పటికే పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ తో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు రేకెత్తించింది. అప్పట్లో మెగాస్టార్ ‘ఇంద్ర’కు మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి హిస్టరీ సృష్టించింది. కానీ బాక్సా ఫీస్ వద్ద మాత్రం సినిమా బోల్తా పడింది. సినిమాలో వాడిన లైవ్ యాక్షన్ రికార్డింగ్ టెక్నిక్స్, ఫైట్లు సెన్సేషన్ సృష్టించినా, కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండే స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఇప్పటికీ చాలా మంది సినీ ప్రేమికులు పవన్ కల్యాణ్ సినిమాల్లో ‘జానీ’ తమ ఫేవరెట్ అని చెబుతారు. అలాగే పవన్ కల్యాణ్ ఒరిజినల్ గా రాసుకున్న కథలో హీరో చనిపోతాడని అదే గనక తీసుంటే బ్లాక్ బస్టర్ అయ్యేదని అంటారు.
జానీ ఒక పదేళ్లు ఆగి వచ్చుంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేదని చెబుతుంటారు. మరి ఇప్పుడు 18 ఏళ్లు అయ్యింది అలాగే పూరీ సినిమాల్లో స్క్రీన్ ప్లేనే బలం, మరి ‘లైగర్’ ఏం చేస్తుందో చూడాలి
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?