అన్నాదమ్ములు, అక్కాచెళ్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వయసుతో సంబంధం లేకుండా తమ సోదరులకు చేతికి సోదరీమణులు రాఖీ కడతారు. సోదరులకు కట్టిన రాఖీ వారికి రక్షగా నిలుస్తుందని తోబుట్టువులు భావిస్తారు. ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోల సోదరీమణుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ సోదరీమణులు
ఐదుగురు తోబుట్టువుల్లో చిరంజీవి పెద్దవాడు. పవన్ కళ్యాణ్ నాల్గవవాడు. విజయ దుర్గ, మాధవి రావు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు సోదరీమణులు. గతంలో పలు ఇంటర్వ్యూలలో ఈ మెగా నటులు తమ ఇంటి ఆడబిడ్డలపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.
రామ్ చరణ్ సోదరీమణులు
రామ్ చరణ్ తన కుటుంబంతో ఎలా బంధాన్ని పంచుకుంటాడో మనందరికీ తెలుసు. ముగ్గురు తోబుట్టువులలో చరణ్ పెద్దవాడు. మిగిలిన శ్రీజ, సుష్మిత తన చెల్లెల్లు. నాగబాబు కూతురు నిహారిక కొణిదెల రామ్ చరణ్‌కి కజిన్ సిస్టర్.
మహేష్ బాబు సిస్టర్స్
ఇతరులతో పోలిస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరీమణులు ప్రేక్షకులకు బాగా తెలుసు. మహేష్ బాబుకు ఒక సోదరుడు రమేష్ బాబు, ముగ్గురు తోబుట్టువులు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. పద్మావతి రాజకీయ నాయకుడు జై దేవ్ గల్లాను వివాహం చేసుకున్నారు. మంజుల సంజయ్ స్వరూప్‌ను మనువాడారు. ప్రియదర్శిని నటుడు, నిర్మాత సుధీర్ బాబును పెళ్లి చేసుకున్నారు.
ప్రభాస్ సోదరీమణులు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చినవాడు. అతనికి సోదరుడు ప్రబోధ్, సోదరి ప్రగతి ఉన్నారు. అతను తన మేనమామ కృష్ణం రాజుకి మేనల్లుడు, సినీ వారసుడు. కృష్ణం రాజుకు ముగ్గురు కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి ఉన్నారు.
నందమూరి బాలకృష్ణ సోదరీమణులు
NBKకి 11 మంది తోబుట్టువులు, ఏడుగురు సోదరులు, నలుగురు సోదరీమణులు ఉన్నారు. కంటమనేని ఉమా మహేశ్వరి, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి బాలకృష్ణ సోదరీమణులు.
జూనియర్ ఎన్టీఆర్ సోదరీమణులు
నందమూరి సుహాసిని జూనియర్ ఎన్టీఆర్‌కి సవతి సోదరి. ఆమె రక్త సంబంధమైన సోదరుడు కళ్యాణ్ రామ్.
రానా దగ్గుబాటి సోదరి
రానా దగ్గుబాటి నిర్మాత సురేష్ బాబు కొడుకు. మాళవిక దగ్గుబాటి రానాకి తోబుట్టువు. రానా మేనమామ వెంకటేష్ దగ్గుబాటికి ముగ్గురు కుమార్తెలు ఆశ్రిత, భావన, హయవాహిని.
నాగార్జున సోదరీమణులు
నాగార్జునకు ఒక సోదరుడు వెంకట్ రత్నం, ముగ్గురు సోదరీమణులు సత్యవతి, నాగ సుశీల, సరోజ ఉన్నారు. నటుడు సుమంత్ సత్యవతి కుమారుడు. కాగా సుశాంత్ నాగ సుశీల కొడుకు.
నాని సోదరి
నేచురల్ స్టార్ నాని తన సోదరి దీప్తి గంటాతో గొప్ప బంధాన్ని పంచుకున్నారు. అతను తరచుగా తన సోషల్ మీడియాలో ఆమె ఫొటోలను షేర్ చేస్తు ఉంటాడు.
మంచు విష్ణు సోదరి
తెలుగు సినిమా పవర్ ఫుల్ ఫ్యామిలీలలో మంచు ఫ్యామిలీ ఒకటి. మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మిలకు తండ్రి. ముగ్గురూ కొన్నాళ్లుగా సినిమా వ్యాపారం చేస్తున్నారు.
వెంకటేష్ దగ్గుబాటి సోదరి
వెంకటేష్ సోదరుడు సురేష్ దగ్గుబాటి రామా నాయుడు కుమారులు. వీరికి లక్ష్మి అనే సోదరి ఉంది, ఈమె నాగార్జునను వివాహం చేసుకుంది. కాని వీరు తెలియని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. లక్ష్మి, నాగార్జునల కొడుకు నాగ చైతన్య.
రామ్ పోతినేని సోదరి
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. సోదరుడు కృష్ణ చైతన్య, సోదరి మధు స్మిత పోతినేని.
నితిన్ సోదరి
హీరో నితిన్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కుమారుడు. ఆయనకు నికితారెడ్డి అనే అక్క ఉంది. ఈమె కూడా ప్రస్తుతం ప్రొడ్యూసర్.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!