• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘దసరా’కు యమా డిమాండ్!

  న్యాచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ‘దసరా’ మూవీ టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తే నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను చదలవాడ రూ.24 కోట్లకు కొనుక్కోగా.. దానికి అదనంగా రూ.4 కోట్లు ఇచ్చి రూ.28 కోట్లతో దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజుకు 5 నుంచి 10 కోట్ల ఆఫర్‌తో లాభాలు వస్తాయని ఫిలింనగర్ సమాచారం. నైజాం, వైజాగ్ మనహా మిగతా … Read more

  బిజినెస్‌మేన్‌తో పెళ్లి.. కీర్తి సురేష్ క్లారిటీ

  తన లవ్ స్టోరీ, పెళ్లిపై వస్తున్న రూమర్లపై నటి కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ వదంతులేనని కొట్టా పారేసింది. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేసింది. గత 13ఏళ్లుగా తన చిన్ననాటి క్లాస్‌మేట్‌తో కీర్తి ప్రేమాయణం నడుపుతోందని పుకార్లు వచ్చాయి. ఆ వ్యక్తికి కేరళలో రిసార్ట్స్ కూడా ఉన్నట్లు గుసగుసలు వినిపించాయి. వీరిద్దరి ప్రేమకి పెద్దల అంగీకారం దొరికిందని, త్వరలోనే పెళ్లి జరగనున్నట్లు నెటిజన్లు కోడై కూశారు. తాజాగా కీర్తి సురేష్ క్లారిటీ ఇవ్వడంతో ఇవన్నీ పుకార్లేనని తేలిపోయింది. దసరా … Read more

  లాస్ట్ షాట్ తోప్‌.. దసరా టీజర్‌పై రాజమౌళి ప్రశంసలు

  హీరో నాని నటించిన దసరా టీజర్‌పై డైరెక్టర్ రాజమౌళి ప్రశంసలు కురిపించారు. దసరా టీజర్ విజువల్స్ తనకు బాగా నచ్చాయని ట్వీట్ చేశారు. నాని మెకోవరర్ చాలా బాగా తీశారని కితాబిచ్చారు. కొత్త దర్శకుడు మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారన్నారు. లాస్ట్ షాట్ తోప్ అంటూ వ్యాఖ్యానించారు. కాగా ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  దసరా రెండు భాగాలపై నాని క్లారిటీ

  దసరా సినిమా రెండు భాగాలుగా వస్తుందన్న వార్తలపై హీరో నాని స్పందించాడు. ఇది కేవలం ఒకే భాగంలో వస్తుందని వెల్లడించారు. కానీ , రెండు సినిమాలకు ఉండే పవర్‌ ఇందులో ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే విడుదలైన నాని రగడ్ లుక్ ఆకట్టుకుంటోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాని సరసన కీర్తి సురేశ్ ఆడిపాడనుంది. మార్చి 30న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 30న టీజర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

  దసరా సినిమా షూటింగ్ పూర్తి

  దసరా సినిమా షూటింగ్ పూర్తైనట్లు నాచురల్ స్టార్ నాని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉన్నాయని చెప్పారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ నాని సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ వ్యయంతో ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది. దసరా చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

  నానిపై దారుణంగా ట్రోల్స్‌

  నాని నిర్మాణంలో తెరకెక్కిన హిట్‌-2 పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే నానిపై మాత్రం సోషల్‌ మీడియాలో కొందరు ట్రోల్స్‌ వేస్తున్నారు. హిట్‌-3లో నానిని ఓ క్రూరమైన పోలీసు అధికారిగా చూపించబోతున్నట్లు హిట్‌-2లో చూపించారు. కానీ ఇప్పటిదాకా నాని సీరియస్‌ రోల్స్‌లో చేసిన సినిమాలన్నీ దాదాపుగా డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దీంతో నాని హిట్‌లో అడుగుపెడితే అది కూడా డిజాస్టర్‌ అవుతుందని విమర్శిస్తున్నారు. మరి నాని HIT-3తో హిట్‌ కొట్టి ఈ ట్రోల్స్‌కు సమాధానం చెబుతాడో లేక మరోసారి ఫెయిలవుతాడో చూడాలిి.

  ఇలాంటి కథలు రావట్లేదు: నాని

  హీరో నాని సోదరి దీప్తి తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘మీట్ క్యూట్’. ఈ నెల 25 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో హీరో నాని ముచ్చటించారు. ఓటీటీలో సరదా సినిమాలు రావట్లేదని అభిప్రాయపడ్డాడు. ‘ఈరోజుల్లో ఓటీటీలో అన్నీ సీరియస్ కథాంశంతో తెరకెక్కుతున్నవే. సరదాగా ఉండే కథలు తక్కువయ్యాయి. మీట్ క్యూట్ సరదా సినిమా. ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇందులో 5 విభిన్న కథలు అద్భుతంగా ఉంటాయి. ఎలాంటి స్క్రిప్ట్ అయినా ప్రేక్షకాదరణ పొందే విధంగా ఉండాలి. ఇది అలాంటిదే’ అని … Read more

  శరవేగంగా దసరా షూటింగ్ పూర్తి

  హీరో నాని నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దసరా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బాచుపల్లి ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా వేసిన సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలను తీస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డిఫెరెంట్ లుక్‌తో కనిపించనున్నాడు.

  మరో కొత్త డైరెక్టర్‌తో నాని మూవీ?

  పాన్ ఇండియా మూవీ ‘దసరా’ తర్వాత హీరో నాని మరో కొత్త డైరక్టర్‌తో సినిమా చేయనున్నట్లు తెలిసింది. మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడితో కలిసి పనిచేయాలని నాని భావిస్తున్నట్ల సమాచారం. స్క్రిప్ట్ కూడా నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై ప్రకటన రానుంది. దసరా చిత్రానికి కూడా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు.

  ఈనెల 3న ‘దసరా’ నుంచి ఫస్ట్ సింగల్ విడుదల

  నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ ‘దసరా’. తాజాగా ఈ మూవీ నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా మొదటి సాంగ్‌ను ఈనెల 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ విడుదల చేసింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా.. మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది.