నాని హీరోగా నటించిన దసరా మూవీ హిందీలో డిసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. హిందీ రాష్ట్రాల్లో దసరా చిత్రం ఇప్పటివరకు రూ.3.5కోట్లు కొల్లగొట్టింది. నార్త్‌కు పెద్దగా పరిచయం లేనప్పటికీ నేచురల్ స్టార్ నానిని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాగా ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, స్నేహం ఇతివృత్తంతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది.
సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వీర్లపల్లి అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘ధరణి’ పాత్రలో నాని ఇరగదీశాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఏడిపించేశాడు. ప్రేక్షకులు ఈ సినిమాకు కనెక్ట్ కావడానికి ఇదొక కారణం. ఇక వెన్నెలగా కీర్తి సురేష్ ఒదిగిపోయింది. నిఖార్సైన పల్లెటూరి పిల్లలాగా జీవించింది. మొండితనం, మొరటు తనాన్ని తక్కగా ప్రదర్శించింది. ముఖ్యంగా, పెళ్లి బరాత్‌లో కీర్తి సురేష్ చేసే డ్యాన్స్ చప్పట్లు కొట్టిస్తుంది. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి సూరీగా మెప్పించాడు.
సినిమాకు నటీనటులతో పాటు సంగీతం ప్రధాన బలం. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మెస్మరైజ్ అయ్యే సంగీతం అందించాడు. ఇందులోని ధూమ్ ధామ్ దోస్తాన్, చమ్కీల అంగీలేసి, ఓరి వారి పాటలు బాగా పాపులారిటీని సంపాదించాయి. చమ్కీల అంగీలేసి పాటైతే ఏకంగా సోషల్ మీడియాల్లో సంచలనం సృష్టించింది.
ఇక సీన్స్‌కు తగ్గ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లింది.
సినిమాటోగ్రఫీ అచ్చమైన పల్లెటూరు తనాన్ని చూపించింది. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలలుగన్న వీర్లపల్లిని సినిమాటోగ్రఫర్ సత్యం మూర్తి ఆవిష్కరించారు. ఎక్కడా కూడా ఎబ్బెట్టుగా కనిపించకుండా చిత్రీకరించారు. అందుకే సినిమా వసూళ్లలో దూసుకెళ్తోంది.